Best Web Hosting Provider In India 2024
Kalki 2 Update: కల్కి 2 సినిమాపై అదిరిపోయే అప్‍డేట్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్.. రిలీజ్ ప్లాన్ గురించి కూడా..
Kalki 2 Update: కల్కి 2 సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం గురించి తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ అప్‍డేట్ వెల్లడించారు. షూటింగ్, రిలీజ్ ప్లాన్‍ల గురించి చెప్పారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. గ్రాండ్ విజువల్స్, మైథాలజీ, భారీతనంతో ఈ మైథో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్, చివర్లో ట్విస్ట్ ఆకట్టుకున్నాయి. దీంతో కల్కి 2పై అంచనాలు, హైప్ భారీగా ఉన్నాయి. అయితే, ప్రభాస్ లైనప్‍లో చాలా చిత్రాలు ఉండటంతో కల్కి 2 ఎప్పుడు అనే సందేహం నెలకొంది. ఈ సీక్వెల్ చిత్రంపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా అప్‍డేట్ చెప్పారు.
స్టోరీ పనులు పూర్తి.. రిలీజ్ ప్లాన్
కల్కి 2 మూవీకి సంబంధించిన స్టోరీ పనులు పూర్తయినట్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ చేశారు. ప్రభాస్ సిద్ధమైనప్పుడు షూటింగ్ మొదలుపెట్టేస్తామని అన్నారు. 2026 చివరి నాటికి కల్కి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నట్టు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రభాస్ డేట్స్ దొరకడంపై ఇది ఆధారపడి ఉంటుందన్నట్టుగా మాట్లాడారు.
ప్రభాస్ లైనప్ ఇలా..
ప్రభాస్ ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజా సాబ్ చిత్రం చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ పీరియడ్ యాక్షన్ చిత్రంలో హీరోగా రెబల్ స్టార్ నటిస్తున్నారు. దీనితర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని ప్రభాస్ చేయాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 కూడా లైనప్‍లో ఉంది. మరి కల్కి 2 సినిమాకు ప్రభాస్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారనేది ఇంట్రెస్టింగ్‍గా మారింది. సలార్ 2 కంటే ముందే కల్కి 2 చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. మొత్తంగా వరుస చిత్రాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నారు.
కీలకంగా దీపక డేట్స్
కల్కి 2898 ఏడీ చిత్రంలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణ్ కూడా ఓ ప్రధాన పాత్ర చేశారు. కల్కి 2 చిత్రం కోసం ఆమె డేట్స్ కూడా కీలకంగా మారాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆడబిడ్డకు జన్మనచిచ్చారు దీపక. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. కూతురిని చూసుకునేందుకు ఎక్కువ రోజులు సినిమాల నుంచి విరామం కావాలని ఆమె అనుకుంటున్నారట. దీంతో కల్కి 2 చిత్రానికి దీపక డేట్స్ ఎప్పుడు కేటాయిస్తారనేది కూడా ముఖ్యంగా ఉంది.
కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, దీపికతో పాటు లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, శోభన కీరోల్స్ చేశారు. మహాభారతం ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు నాగ్ అశ్విన్. ఈ సినిమా సుమారు రూ.1,200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని సూపర్ హిట్ అయింది. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ మూవీని నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించారు. కల్కి 2898 ఏడీ సినిమా క్లైమాక్స్‌లో కర్ణుడి పాత్ర రివీల్ సహా కొన్ని ట్విస్టులు ఉన్నాయి. దీంతో కల్కి 2పై చాలా ఆసక్తి నెలకొంది.
సంబంధిత కథనం