Best Web Hosting Provider In India 2024
Chopping Board: మీ కట్టింగ్ బోర్డు మురికిగా కనిపిస్తుందా, దుర్వాసన వస్తుందా? ఇలా శుభ్రం చేయండి కొత్తదానిలా మారిపోతుంది!
Chopping Board: చకాచకా కూరగయాలను కట్ చేసి టకటకా వంట చేయాంటే కటింగ్ బోర్లు ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు అందరి ఇళల్లో కటింగ్ బోర్డు చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. కొన్ని ఇళ్లలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు, అందుకే మురకిగా కనిపిస్తుంది, దుర్వాసన వస్తుంది. ఇలా శుభ్రం చేయండి కొత్తదానిలా మారిపోతుంది!
ఈ రోజుల్లో కూరగాయలు కోసేందుకు కత్తిపీట వాడేవాళ్లు చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ చాకుతో చకచకా కట్ చేసేస్తున్నారు. అందుకే కిచెన్‌లో కొన్ని వస్తువులు రోజూ ఉపయోగించబడతాయి. కూరగాయలను చకచకా తరిగేయడానికి కట్టింగ్ బోర్డు చాలా బాగా ఉపయోగించబడుతుంది. ఉల్లిపాయలు, టమోటాలు నుంచి అల్లం, వెల్లుల్లి వరకూ దేన్నైనా చాపింగ్ బోర్డు మీద చక్కగా కట్ చేసుకోవచ్చు.
ఇలా అన్ని రకాల కూరగాయాలను దీని మీద కట్ చేయడం వల్ల అన్నింటి మురికి, వాసన దీనికి పట్టుకుంటుంది. నీటితో, డిటర్జెంట్‌తో బాగా కడిగిన తర్వాత కూడా ఈ దుర్గంధం పోవడం కష్టం అవుతుంది. ఇది చూడటానికి అసహ్యంగా కనిపించడంతో పాటు దీని మీద కూరగాయలను కత్తిరించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం కూడా ఉంది. కనుక మీ ఇంట్లో కూడా కటింగ్ బోర్డు(Chopping Board) మురికిగా కనిపిస్తుంటే, దాని నుంచి దుర్వాసన వస్తుంటే ఈ టిప్స్ తో దాన్ని శుభ్రం చేయండి. కొత్తదానిలా మెరిసిపోవడంతో పాటు తాజా సువాసనను వెదజల్లులుతుంది. చాపింగ్ బోర్డు శుభ్రం చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలో ఇక్కడ తెలుసుకోండి.
కట్టింగ్ బోర్డు దుర్గంధాన్ని ఎలా తొలగించాలి?
మొదటి చిట్కా:
- ముందుగా కట్టింగ్ బోర్డుపై పూర్తిగా బేకింగ్ సోడాను చల్లుకోండి.
- తర్వాత సగానికి కత్తిరించిన నిమ్మకాయను తీసుకొని దాంతో కట్టింగ్ బోర్డుపై రుద్దడం ప్రారంభించండి.
- ఇలా బాగా రుద్దిన తర్వాత బోర్డును కాసేపు అలాగే పక్కకు పెట్టి ఉంచండి.
- కనీసం 15 నిమిషాల పాటు ఉంచిన కట్టింగ్ బోర్డును శుభ్రమైన నీటితో కడగండి.
- తర్వాత దీన్ని ఎండ తగిలే చోట లేదంటే గాలి తాకే చోట కాసేపు ఆరనివ్వండి.
రెండవ చిట్కా:
ఈ చిట్కాలో నిమ్మకాయతో పాటు ఉప్పును చాపింగ్ బోర్డు మీద వేసి బాగా రుద్దండి.
- ముందుగా కొంత చాపింగ్ బోర్డు మీద ఉప్పు చల్లి నిమ్మకాయతో పూర్తి బోర్డును బాగా రుద్దండి.
- బోర్డు మొత్తానికి ఉప్పు, నిమ్మరసం పట్టిన తర్వాత పావుగంట పాటు దాన్ని అలాగే ఉంచండి.
- తర్వాత బోర్డును గోరు వెచ్చటి లేదా చల్లటి నీటితో శుభ్రంగా కడగండి.
మూడవ చిట్కా:
కట్టింగ్ బోర్డు దుర్గంధాన్ని తొలగించడానికి బంగాళాదుంప లేదా ఆపిల్‌ను ఉపయోగించవచ్చు.
- దీని కోసం ముందుగా ఆపిల్ లేదా బంగాళాదుంపను తీసుకుని పొడవాటి లేదా గుండ్రటి ముక్కలుగా చేసుకోవాలి.
- వీటి రసం బోర్డు అంతా అంటుకునేలా ముక్కలతో చక్కగా కటింగ్ బోర్డును రుద్దాలి.
- రుద్దిన తర్వాత వీటి రసం అంతా బోర్డు పీల్చుకునే దాకా అంటే కనీసం 10 నుంచి 15 నిమిషాల పైన వరకూ బోర్డును పక్కకు పెట్టి ఉంచండి.
- తర్వాత దానిని నీటితో బోర్డును శుభ్రం చేయండి.
ఇలా చేశారంటే మీ చాపింగ్ బోర్డు మీద ఉన్న మురికి అంతా తొలగిపొవడమే కాకుండా దాని నుంచి తాజా సువాసన వస్తుంది.
చిట్కా
మరో ముఖ్య విషయం ఏంటంటే.. కట్టింగ్ బోర్డు మురికిగా మారకుండా ఉండాలంటే, దాని నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే దానిని ఉపయోగించిన ప్రతిసారి వెంటనే కడగడం మర్చిపోవద్దు. ఇది మురికి, దుర్వాసనకు నిలయంగా మారకుండా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని కలగదు.