Egg Mittai Recipe: మీకు స్వీట్లు అంటే ఇష్టమా..? ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లతో ఇలా స్వీట్స్ తయారు చేసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Egg Mittai Recipe: మీకు స్వీట్లు అంటే ఇష్టమా..? ఆరోగ్యంగా ఉండాలంటే గుడ్లతో ఇలా స్వీట్స్ తయారు చేసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Jan 26, 2025 05:03 PM IST

Egg Mittai Recipe: స్వీట్స్ తింటే హెల్తీ కాదని ఫీలవుతున్నారా.. అయితే మీరు పొరబడినట్లే. మీ శరీరానికి టేస్ట్‌తో పాటు ప్రొటీన్లను అందించే ఎగ్ స్వీట్ ఇదే. మరి దీని రెసిపీ గురించి వివరంగా తెలుసుకుందామా..

అయితే గుడ్లతో ఇలా మిఠాయి చేసుకోండి
అయితే గుడ్లతో ఇలా మిఠాయి చేసుకోండి

ఎగ్స్ కలిపి తయారుచేసిన స్వీట్స్ తినడం చాలా మంచిది. గుడ్లలో పలు పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ప్రోటీన్ రిచ్, పరిపూర్ణ విటమిన్లు – ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీర పునరుత్పత్తి, సరైన హార్మోన్ ఉత్పత్తి, ఎముకల ఆరోగ్యం, కంటి ఆరోగ్యం కోసం ఎగ్ తినాల్సిందే.

yearly horoscope entry point

కావలసిన పదార్థాలు

  • పాలు – ఒక లీటరు
  • గుడ్లు – 6
  • చక్కెర – 200 గ్రాములు (పొడి చేసుకోవాలి)
  • నెయ్యి – తగినంత
  • బాదం – 100 గ్రాములు
  • (ఇందులో 50 గ్రాముల తోలుతీసిన బాదం పప్పును వాడాలి. మిగిలిన బాదం పొడి చేసుకోవాలి)
  • కుంకుమపువ్వు – 1
  • వెన్నెల ఎసెన్స్ – ఒక స్పూన్
  • లేదా
  • యాలకుల పొడి – ఒక స్పూన్

తయారీ విధానం

  • ఒక లీటరు పాలను కోవా మాదిరిగా పాకం వచ్చే వరకు బాగా మరిగించాలి. పాలు చిక్కగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అందులో నానబెట్టిన బాదం పప్పు, కప్పు పాలు కలిపి మెత్తగా చేసుకోవాలి.
  • మరొక గిన్నె తీసుకుని గుడ్లు పగలగొట్టి పోసుకోవాలి. దానిలో పొడి చక్కెర, కోవా, రుబ్బిన బాదం వేసి మిక్స్ చేసుకోవాలి. చివరగా వెన్నెల ఎసెన్స్, కుంకుమపువ్వు లేదా యాలకుల పొడి మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి.
  • ఆ మిశ్రమాన్ని పక్కకుపెట్టుకుని ఒక కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి.
  • ఆ తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని దానిలో వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి.
  • తరువాత ఒక ప్లేట్ లో నెయ్యి రాసి, దానిలో చిక్కటి మిశ్రమాన్ని పరచాలి. దానిపై కొద్దిగా నెయ్యి పోసి, పొడి బాదం చల్లుకోవాలి.
  • ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద వేసి, కొన్ని నిమిషాల పాటు వేడి చేయాలి. దానిలో ఒక రింగ్ ఉంచి, దానిపై ఈ ప్లేట్ ఉంచి, మూత పెట్టి 40 నుండి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
  • తరువాత దించి చల్లారిన తరువాత వేరే ప్లేట్ కు మార్చి, ముక్కలుగా కోసి తినవచ్చు.
  • డయాబెటిస్ తో సతమతమయ్యే వారు తెల్ల చక్కెరకు బదులు బెల్లం లేదా ఇతర చక్కెరలను కూడా వాడుకోవచ్చు.

ఈ ఎగ్ మిఠాయిని మీ ఇంట్లో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ కావాలనిపించే విధంగా రుచి ఉంటుంది. ఇది ఒక మంచి స్నాక్ గా తీసుకోవచ్చు. పాఠశాల నుండి ఇంటికి వచ్చే పిల్లలకు చేసి ఇస్తే ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఒక్కసారి చేసి చూడండి.

గుడ్లు తినమని మారం చేసే పిల్లలకు తినిపించేందుకు కూడా ఇదొక సులభమైన మార్గం. గుడ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల వారికి మేలు జరుగుతుంది. చక్కటి బరువుతో కూడా ఉంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024