Best Web Hosting Provider In India 2024
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళా టూర్ ప్యాకేజీలు- 11 రోజుల్లో 13 పుణ్యక్షేత్రాల సందర్శన, మహాశివరాత్రికి కాశీలో
APSRTC Mahakumbha Mela Tour : ఏపీఎస్ఆర్టీసీ మహాకుంభమేళా యాత్ర ప్యాకేజీలు అందిస్తుంది. రాయదుర్గం, రాజమహేంద్రవరం డిపోల నుంచి 11 రోజుల పాటు 13 క్షేత్రాలను దర్శించుకునేలా టూర్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చింది. కుంభమేళా పవిత్ర స్నానం, కాశీవిశ్వనాథుడి దర్శనం చేసుకోవచ్చు.
APSRTC Mahakumbha Mela Tour : ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానంతో పాటు ప్రముఖ ఆలయాల దర్శనానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తుంది. ఏపీలోని రాయదుర్గం, రాజమహేంద్రవరం డిపోల నుంచి 11 రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 11 రోజుల్లో 13 క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
రాయదుర్గం నుంచి మహాకుంభమేళా యాత్ర
రాయదుర్గం డిపో నుంచి ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 11 రోజుల మహాకుంభమేళా యాత్ర ప్రారంభం అవుతుంది. విజయవాడ, అన్నవరం, భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధగయ, భద్రాచలం, త్రివేణి సంగమ స్నానం…ఈ ప్కాకేజీలో కవర్ చేస్తారు. ప్రయాగరాజ్, కాశీలో ఒక రోజు బస చేయవచ్చు. రాయదుర్గం నుంచి మహాకుంభమేళా టూర్ ప్యాకేజీలో ఒక్కరికి టికెట్ ధర రూ.14 వేలుగా నిర్ణయించారు. ఈ టూర్ లో ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్ఫాహారం అందిస్తారు.
రాజమహేంద్రవరం నుంచి మహాకుంభమేళా యాత్ర ప్యాకేజీ
ఏపీఎస్ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో నుంచి మహా కుంభమేళా యాత్ర ప్యాకేజీ అందిస్తుంది. 11 రోజుల్లో 13 క్షేత్రాలను దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. సూపర్ లగ్జరీ బస్సులో ఫిబ్రవరి 18 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది.
ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే ప్రదేశాలు
1. భువనేశ్వర్ : శ్రీ లింగరాజస్వామి వారి దేవాలయం
2. పూరీ : శ్రీ జగన్నాథస్వామి వారి దేవాలయం
3. కోణార్క్ : శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం
4. జాజీపూర్ : శ్రీ గిరిజాదేవి దేవాలయం (శక్తి పీఠం)
5. ప్రయోగ్ రాజ్ : మహాకుంభ మేళా పుష్కర స్నానం, శ్రీ కళ్యాణిదేవి ఆలయం, త్రివేణి సంగమం
6. కాశీ : శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి (జ్యోతిర్లింగం), శ్రీకాశీ అన్నపూర్ణ, విశాలక్షి (శక్తి పీఠం)
7.అయోధ్య : శ్రీబాల రాముడు ఆలయ దర్శనం
8. సీతామడి : శ్రీ సీతా సమాహిత్ స్థల్ (సీతామర్షి ఆలయం)
9. నైమిశారణ్యం : గోమతి నదీ స్నానం, చక్రతీర్థంచ రుద్రావర్తం, లలితాదేవి (ఉప శక్తి పీఠం)
10. గయ : శ్రీ విష్ణు పాద ఆలయం, శ్రీ మంగళ గౌరీ ఆలయం (శక్తి పీఠం)
11. బుద్ధ గయ : బుద్ధుడు జ్ఞానోదయం పొందిన మహాబోధి ఆలయం
12. అరసవిల్లి : శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం
13. అన్నవరం : సత్యనారాయణ స్వామి వారి దేవాలయం
ఈ టూర్ లో యాత్రికులకు ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. ఒకరికి టికెట్టు వెల రూ.12,800గా నిర్ణయించారు. టిక్కెట్లు కావాల్సిన వారు ఈ 95023 00189, 9966666544, 9866045588 నెంబర్లు సంప్రదించవచ్చు.
టాపిక్