Egg Price In US : ఓ మై గాడ్.. అమెరికాలో 12 గుడ్లకు 600 రూపాయలపైనే..!

Best Web Hosting Provider In India 2024


Egg Price In US : ఓ మై గాడ్.. అమెరికాలో 12 గుడ్లకు 600 రూపాయలపైనే..!

Anand Sai HT Telugu
Jan 26, 2025 05:01 PM IST

Egg Price In US : అమెరికాలో గుడ్లు రోజురోజుకు ఖరీదైనవిగా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత దాని ధరలు 40 శాతం పెరిగాయి. గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో చూద్దాం..

గుడ్ల ధరలు
గుడ్ల ధరలు (Unsplash)

అమెరికాలో గుడ్ల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుడ్డు ధరలు నిరంతరం ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో గుడ్లు డజనుకు 7 డాలర్లు(రూ.603) చొప్పున విక్రయిస్తున్నారు. గుడ్డు ఖరీదైనదిగా మారడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని డెమోక్రాట్ల నేతృత్వంలోని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. పెరుగుతున్న గుడ్ల ధరలను తగ్గించుకునేందుకు ట్రంప్ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

yearly horoscope entry point

‘2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జో బిడెన్‌పై ట్రంప్ మాటలతో పదేపదే దాడి చేశారు. అయితే ధరలు పెరగకుండా నిరోధించడానికి ఏమీ చేయలేదు. ఇప్పుడు ప్రెసిడెంట్‌గా గెలిచి రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా కోడిగుడ్ల ధరలను తగ్గించేందుకు ట్రంప్ ఏమీ చేయడం లేదు.’అని డెమోక్రాట్లు అన్నారు.

కమోడిటీ ప్రైస్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, అమెరికాలోని కొన్ని నగరాల్లో గుడ్లు డజనుకు 7 డాలర్లు రికార్డు ధరకు, కొన్ని నగరాల్లో డజనుకు 6.55 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రజల బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు ముఖ్యమైన భాగం. కాబట్టి ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు గుడ్లను కొంటారు. కానీ ఇప్పుడు గుడ్ల ధరలు తమ బడ్జెట్‌ను నాశనం చేస్తున్నాయని జనాలు వాపోతున్నారు.

కిరాణా సామాగ్రి ధరలను తగ్గిస్తానని ట్రంప్ చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్టులు చేస్తున్నారు. ట్రంప్ తన వాగ్దానాన్ని మరచిపోయారని కొందరు వినియోగదారులు పోస్ట్‌లు చేశారు. బిల్ క్లింటన్ మాజీ క్యాబినెట్ సెక్రటరీ రాబర్ట్ రీచ్ ట్రంప్ అధ్యక్ష పదవిని ఆరోగ్యానికి, ప్రజల జేబుకు ముప్పుగా అభివర్ణించారు. బిడెన్ పదవీకాలంతో పోలిస్తే ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత గుడ్ల ధర 40 శాతం పెరిగింది.

ఏవియన్ ఫ్లూ వ్యాప్తి కొనసాగుతున్నందున బయటి నుండి ఆహార దిగుమతులను నిలిపివేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్‌ను ట్రంప్ ఆదేశించారు. దీంతో గుడ్ల దిగుమతులు తగ్గి.. ధరలు పెరిగాయి. దీనిపై డెమోక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా లేదా బర్డ్ ఫ్లూ 2022 సంవత్సరం నుండి యునైటెడ్ స్టేట్స్‌లో వ్యాపించింది. దేశంలో 30 మిలియన్లకు పైగా కోళ్లను చంపేశారు.

’47వ అధ్యక్షుడిగా తన ప్రారంభ ప్రసంగంలో గుడ్డు ధరలను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పారు ట్రంప్. కానీ అదేమీ జరగలేదు.’ అని మిన్నెసోటా సెనేటర్ అమీ క్లోబుచార్ అన్నారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link