Best Web Hosting Provider In India 2024
Exercise Mistakes: మీకు డైలీ ఎక్సర్‌సైజ్ చేసే అలవాటుందా? ఈ తప్పులు చేస్తుంటే, వయస్సు కంటే ముందే వృద్ధాప్యం వచ్చేస్తుందట!
Exercise Mistakes: వ్యాయామం చేయడం మంచి అలవాటే. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ మీరు ఈ 4 తప్పులు చేశారంటే, వయస్సు కంటే ముందే మీలో వృద్ధాప్య లక్షణాలను కనిపిస్తాయి.
ఆరోగ్యకరమైన జీవన విధానంలో ప్రధానమైనది వ్యాయామం. ఎంతటి హెల్తీ డైట్ పాటించినా ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అనేది తప్పనిసరి. అందుకే ఆరోగ్యకరంగా ఉండాలనుకునే వారు రోజువారీ అలవాట్లలో వ్యాయామాన్ని భాగంగా చేసుకుంటారు. కానీ, వ్యాయామం చేసే సమయంలో ఏమేం చేయాలో, ఎలాంటివి చేయకూడదో కూడా తెలుసుకోవాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటిల్లో ఒకటే ఈ వృద్ధాప్య సమస్య. మీరు చేసే వ్యాయామంలో ఈ కొన్ని పొరబాట్లు రిపీట్ అవడం వల్ల వయస్సు కంటే ముందుగానే వృద్ధులుగా కనిపిస్తారట. ఆ పొరబాట్లేంటో తెలుసుకుందామా..
విశ్రాంతి లేకుండా నిరంతరం వ్యాయామం చేయడం:
మనలో చాలా మంది వ్యాయామం చేసేటప్పుడు ఏకధాటిగా శ్రమిస్తుంటాం. శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి ఇష్టపడం. కానీ, అలా చేయడం ముమ్మాటికి తప్పేనట. నిరంతరంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంపై దుష్ప్రభవాలు చూపిస్తాయట. శరీరంలో దీర్ఘకాలిక వాపు (Chronic Inflammation), కార్టిసాల్ స్థాయిలు పెరగడం, గాయాలయ్యే అవకాశం పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయట. వీటి వల్ల శరీరం ఎక్కువగా అలసిపోయి వృద్ధాప్య లక్షణాలు బయటపడేలా చేస్తుంది.
బలవర్థక శిక్షణ (Strength Training)ని నిర్లక్ష్యం చేయడం:
శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాాలంటే కండరాలు, ఎముకలను బలోపేతం చేసే వ్యాయామాలు మంచిది. దీని కోసం ప్రత్యేకించి ఎముకలు, కండరాలకు ప్రత్యేకమైన వ్యాయామాలు చేయాలి. స్క్వాట్స్, పుష్-అప్స్ వంటి వ్యాయామాలను వారానికి కనీసం రెండు నుండి మూడు సార్లు చేస్తుండాలి. ఈ అలవాట్లు శరీరాన్ని బలపరచడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి.
నిరంతరం హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేయడం:
తరచూ కొన్ని హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేయాలి. నిరంతరం పరుగు, జంపింగ్ వంటి హై ఇంటెన్సిటీ వ్యాయామాలు చేస్తే కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఎముకలపై ఎక్కువగా ఒత్తిడి పడే వ్యాయామాలకు దూరంగా ఉండాలి.
వార్మ్-అప్ నిర్లక్ష్యం చేయడం:
చాలా మంది చేసే పొరబాటు ఏంటంటే, అవగాహన లేకుండా వ్యాయామం చేసే వాళ్లు ముందుగా వార్మప్ చేయరు. వ్యాయామం ప్రారంభించడానికి ముందు వ్యాయామం తర్వాత వార్మప్ చేయడం తప్పనిసరి చేసుకోవాలి. శరీరాన్ని వార్మ్-అప్ చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. ఇలా రిలాక్స్ చేయడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా ఫ్రీ అవుతాయి.
సరైన సమయం నిద్ర:
శరీరానికి సరిగా విశ్రాంతి అవసరం. అందులో భాగంగా నిద్ర కూడా చాలా ముఖ్యమైనది. సరైన నిద్ర లేకపోతే, శరీరానికి అవసరమైన పునరుత్పత్తి జరగదు. అలా సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. శరీర స్థితి అదుపు తప్పిపోతుంది. వయస్సు కంటే ముందే వృద్ధాప్య లక్షణాలు కనిపించవచ్చు.
ఆహారం, పోషకాహారం పట్ల పట్టించుకోకపోవడం:
వ్యాయామం సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు అందే ఆహారం తీసుకోవాలి. కేలరీల ఆధారంగా ఎక్సర్‌సైజ్ చేస్తున్నా, శరీరానికి అవసరమైన పోషకాలు అందకపోతే, జాయింట్ దెబ్బలు, కండరాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
సంబంధిత కథనం