Best Web Hosting Provider In India 2024
Daaku Maharaj OTT: డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్‍పై లేటెస్ట్ రూమర్లు.. ఆ రోజునే స్ట్రీమింగ్‍కు రానుందా?
Daaku Maharaj OTT Release: డాకు మహారాజ్ సినిమా ఓటీటీ రిలీజ్‍పై రూమర్లు బలంగా వస్తున్నాయి. స్ట్రీమింగ్‍కు ఆరోజున రానుందో అంచనాలు బయటికి వచ్చాయి. ఆ వివరాలు ఇవే..
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా మంచి సక్సెస్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ యాక్షన్ డ్రామా మూవీకి బాబీ లొల్లి దర్శకత్వం వహించారు. డాకు మహారాజ్ చిత్రం రూ.150కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‍పై అంచనాలు వెలువడ్డాయి. స్ట్రీమింగ్ డేట్‍పై రూమర్లు స్ట్రాంగ్‍గా వినిపిస్తున్నాయి.
స్ట్రీమింగ్‍కు అప్పుడేనా?
డాకు మహారాజ్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలీజ్‍కు ముందే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా డీల్ చేసుకుందట. అందుకు తగ్గట్టే ఫిబ్రవరి 9న డాకు మహారాజ్ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేసిందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.
మంచి క్రేజ్ ఉన్న డాకు మహారాజ్ హక్కులను మంచి ధరకే నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుందని టాక్. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రూమర్ల మేరకు ఫిబ్రవరి 9న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తుందా.. తేదీ మారుతుందా అనేది చూడాలి.
డాకు మహారాజ్ కలెక్షన్లు
డాకు మహారాజ్ సినిమా బంపర్ ఓపెనింగ్ దక్కించుకుంది. తొలి వారంలోనే ఈ చిత్రం రూ.100కోట్ల మార్క్ దాటింది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సుమారు రూ.150కోట్ల గ్రాస్ దక్కినట్టు అంచనా. బాలయ్యకు వరుసగా ఇది నాలుగో రూ.100కోట్ల చిత్రంగా నిలిచింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి తర్వాత డాకు మహారాజ్‍తో మరోసారి రూ.100కోట్ల మార్క్ అధిగమించారు బాలకృష్ణ.
డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ మూడు షేడ్లలో యాక్టింగ్ అదరగొట్టారు. యాక్షన్ సీక్వెన్సుల్లో దుమ్మురేపారు. ఈ చిత్రాన్ని పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ బాబీ. స్టైలిష్ టేకింగ్‍తో మెప్పించారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్స్ చేశారు. చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రల్లో నటించారు.
డాకు మహారాజ్ సినిమాను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య ప్రొడ్యూజ్ చేశారు. సంగీత దర్శకుడు థమన్ అందించిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో హైలైట్‍గా నిలిచింది. ఈ చిత్రానికి విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం