Best Web Hosting Provider In India 2024
Comedy Thriller OTT: ఓటీటీలో అదరగొడుతున్న సెటైరికల్ థ్రిల్లర్ చిత్రం.. టాప్‍లో ట్రెండింగ్.. తెలుగులోనూ..
Comedy Thriller OTT: హిసాబ్ బరాబర్ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది. మూడు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
సీనియర్ స్టార్ నటుడు మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన హిసాబ్ బరాబర్ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సెటైరికల్ కామెడీ థ్రిల్లర్ సినిమాకు అశ్వినీ ధీర దర్శకత్వం వహించారు. ట్రైలర్ తర్వాత ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే ఓటీటీలో హిసాబ్ బరాబర్ మూవీ దూసుకెళుతోంది. ఆ వివరాలు ఇవే..
నేషనల్‍వైడ్ టాప్‍లో..
హిసాబ్ బరాబర్ చిత్రం జనవరి 24వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ డే నుంచే మంచి వ్యూస్ దక్కుతున్నాయి. మిక్స్డ్ రెస్పాన్స్ వస్తున్నా వ్యూస్‍లో ఈ చిత్రం దూసుకెళుతోంది. దీంతో జీ5 నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో ఈ మూవీ ప్రస్తుతం (జనవరి 26) టాప్‍కు వచ్చేసింది. ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
మూడు భాషల్లో..
హిసాబ్ బరాబర్ మూవీ హిందీలో రూపొందింది. జీ5 ఓటీటీలో హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. మూడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండడం కూడా ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కేందుకు ఉపయోగపడుతోంది.
మిక్స్డ్ రెస్పాన్స్
బ్యాంకులో ఆర్థిక మోసాన్ని బయటపెట్టేందుకు ఓ రైల్వే టీసీ ప్రయత్నించడం చుట్టూ హిసాబ్ బరాబర్ సినిమా సాగుతుంది. సెటైరికల్ కామెడీతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్వినీ తెరకెక్కించారు. బ్యాకింగ్ వ్యవస్థలోని కొన్ని లోపాలను చూపించేలా ఈ మూవీని రూపొందించారు. అయితే, ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. స్టోరీ ఐడియా బాగానే ఉన్నా.. కథనం ఆసక్తికరంగా లేదనే అభిప్రాయాన్ని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
హిసాబ్ బరాబర్ మూవీలో మాధవన్‍తో పాటు కృతి కుల్హారీ, నీల్ నితిన్ ముకేశ్, రషామీ దేశాయ్, శౌనక్ దుగ్గల్, రవి మారియా, హిమాన్షు మాలిక్, మనూ రిషి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని జియో స్టూడియోస్, ఎస్‍పీ సినీకార్ప్ బ్యానర్లపై జ్యోతి దేశ్‍పాండే, శరద్ పటేల్, శ్రేయాన్షి పటేల్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి అమన్ పంత్ సంగీతం అందించగా.. సంతోశ్ తుండియిల్ సినిమాటోగ్రఫీ చేశారు.
హిసాబ్ బరాబర్ స్టోరీలైన్
రైల్వేల్లో టికెట్ కలెక్టర్ (టీసీ)గా నిజాయితీగా విధులు నిర్వర్తిస్తుంటాడు రాధే మోహన్ (మాధవన్). అతడు సీఏ చదువుకొని టీసీగా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో తన బ్యాంక్ అకౌంట్‍లో రూ.27.50 మాయం అవుతాయి. దీంతో అతడు బ్యాంకు అధికారులను ప్రశ్నిస్తాడు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిజాలను వెలికి తీసేందుకు మోహన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఏకంగా రూ.2000కోట్ల బ్యాకింగ్ స్కామ్ గురించి కనుగొంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది హిసాబ్ బరాబర్ చిత్రంలో ఉంటుంది.
జీ5లో తిరు మాణికం
తమిళ మూవీ తిరు మాణికం కూడా జనవరి 24వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామా సినిమాలో సీనియర్ నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర చేశారు. డిసెంబర్ 27వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు జీ5 ఓటీటీలో తమిళంతో పాటు మలయాళం, కన్నడలోనూ తిరు మాణికం స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం