Best Web Hosting Provider In India 2024
AP Mega DSC Update: ఇదిగో అన్నారు, అదిగో అన్నారు.. ఆర్నెల్లు గడిచినా మెగా డిఎస్సీ జాడే లేదు..
AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ జాడ కనుచూపు మేరలో కనిపించడం లేదు. గత ఏడాది నవంబర్‌లో ఏపీ అసెంబ్లీలో నారా లోకేష్ ప్రకటన తర్వాత డిఎస్సీ గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేకపోవడం నిరుద్యోగుల్ని నిరాశకు గురి చేస్తోంది.
AP Mega DSC Update: న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తామని ప్రకటించినా ఆ దిశగా ఎలాంటి కదలిక లేదు.ఏపీ మెగా డిఎస్సీ ప్రకటన కనుచూపు మేరలో కనిపించకపోవడం నిరుద్యోగుల్ని నిరాశకు గురి చేస్తోంది. గత ఏడాది నుంచి జూన్ 12న కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే ముఖ్యమంత్రి మెగా డిఎస్సీ ప్రకటనపై సంతకం చేయడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్న ఉద్యోగాలు మానేసి నెలల తరబడి శిక్షణ పొందుతున్నారు. రోజులు గడుస్తున్నా డిఎస్సీ నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
మందకృష‌్ణ డిమాండ్‌తో…
ఏపీలో 16347 పోస్టులతో ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ గత ఏడాది నవంబర్ మొదటి వారంలోనే వెలువరించాల్సి ఉంది. నోటివఫికేషన్ వెలువడటానికి ముందు రిజర్వేషన్ల అమలుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అభ్యంతరం వ్యక్తం చేయడంతో డిఎస్సీ నోటిఫికేషన్ నిలిచిపోయింది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని నారా లోకేష్ సభలో ప్రకటించారు.
ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని మంద కృష్ణ డిమాండ్ చేయడంతో వర్గీకరణ ప్రక్రియను కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్‌ను నియయించింది. ప్రస్తుతం జిల్లాల్లో అభిప్రాయ సేకరణ జరుగుతోంది.
మరోవైపు అందరికి అమోదయోగ్యంగా, లీగల్ లిటిగేషన్లు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని, పెండింగ్ ఖాళీలు సహా అన్ని ఉద్యోగాలను వచ్చే ఏడాది నాటికి ఉద్యోగాలను భర్తీ చేస్తామని నారా లోకేష్ అసెంబ్లీలో గత ఏడాది ప్రకటించారు. గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి, లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలో బెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీచేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
2024 జనవరిలో వైసీపీ ప్రభుత్వం 6100పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత నోటిఫికేషన్ రద్దు చేసి దాని స్థానంలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎస్సీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారైన తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా నోటిఫికేషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఏళ్ల తరబడి నియామకాల్లో జాప్యం…
డిఎస్సీ నియామకాల్లో ఏళ్ల తరబడి జరగుతున్న జాప్యం నిరుద్యోగుల్ని నిరాశకు గురి చేస్తోంది. 1994 ముందు టీచర్ రిక్రూట్‌మెంట్ జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియమాకాలు జరిగేవి. 1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ జరుగుతోంది. 1994 నుంచి ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయంలోనే జరిగాయని టీడీపీ చెబుతోంది.
2019 వరకు మొత్తం 2.20లక్షల పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80లక్షల పోస్టుల్ని టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసినట్టు లోకేష్ చెప్పారు. గత ప్రభుత్వంలో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయగా పరీక్ష జరిగేలోపు ఎన్నికల షెడ్యూల్ వెలువడటం, కూటమి వాటిని రద్దుచేయడంతో కథ మొదటికి వచ్చింది.
ఈ ఏడాది విద్యా సంవత్సరం మొదలయ్యే లోపు డిఎస్సీ పూర్తి చేసి వచ్చే ఏడాదికల్లా నియామకాలు పూర్తి చేస్తామని చెబుతున్నా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే డిఎస్సీ పరీక్షలు ఎప్పుడు జరుపుతారు, ఆ తర్వాత కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించి ఫలితాలను వెల్లడించి, నియామక ప్రక్రియ పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుందో అంతు చిక్కడం లేదు. మరోవైపు డిఎస్సీతో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న నిరుద్యోగులు మాత్రం నెలల తరబడి శిక్షణా కేంద్రాల్లోనే పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు.
సంబంధిత కథనం
టాపిక్