Best Web Hosting Provider In India 2024
Marco OTT: ఓటీటీలోకి మోస్ట్ వయెలెంట్ మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో.. మారిన ఓటీటీ ప్లాట్‌ఫామ్.. 5 భాషల్లో స్ట్రీమింగ్!
Malayalam Action Movie Marco OTT Streaming: ఓటీటీలోకి మలయాళంలో మోస్ట్ వయెలెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మార్కో స్ట్రీమింగ్ కానుంది. అయితే, తాజాగా మార్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిందని, మలయాళం, తెలుగు ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని టాక్ జోరుగా నడుస్తోంది.
Malayalam Violent Film Marco OTT Release: మలయాళం నుంచి మోస్ట్ వయెలెంట్ మూవీగా వచ్చింది మార్కో. ఇదివరకు మోస్ట్ వయెలెంట్ చిత్రాలుగా రికార్డుకెక్కిన జాన్ విక్, కిల్ సినిమాలను మించి మార్కో ఉందని కామెంట్స్ వినిపించాయి. గతేడాది డిసెంబర్ 20న మలయాళంలో థియేటర్లలో విడుదలైన మార్కో సెన్సేషనల్ హిట్ అందుకుంది.
మార్కో బడ్జెట్ అండ్ కలెక్షన్స్
మార్కోకు వచ్చిన క్రేజ్‌తో తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో మార్కో తెలుగు వెర్షన్‌తో రిలీజ్ అయింది. తెలుగులో కూడా అదిరిపోయే కలెక్షన్స్‌తో మార్కో సత్తా చాటింది. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మార్కో సుమారుగా ఇప్పటికీ రూ. 115 కోట్లకుపైగా కలెక్షన్స్ అందుకుంది. అలాగే, ఏ సెన్సార్ సర్టిఫికేట్‌తో వంద కోట్ల క్లబ్ దాటిన తొలి సినిమాగా మార్కో రికార్డ్ క్రియేట్ చేసింది.
ఉన్ని ముకుందన్ గత సినిమాలు
జనతా గ్యారేజ్, భాగమతి, యశోద, మాలికాపురం వంటి సినిమాలతో అలరించిన ఉన్ని ముకుందన్ మార్కో సినిమాలో మెయిన్ హీరోగా యాక్ట్ చేశాడు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై షరీఫ్ మహమ్మద్ నిర్మించిన మార్కో సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన మార్కో ఓటీటీలోకి వచ్చేయనుంది.
మారిన మార్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్
అయితే, తొలుత మార్కో ఓటీటీ హక్కులను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని టాక్ నడిచింది. కానీ, నెట్‌ఫ్లిక్స్‌కు బదులు సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ మార్కో రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో మార్కో ఓటీటీ ప్లాట్‌ఫామ్ మారిందని, అలాగే, ఈ సినిమాను ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.
సోనీ లివ్ ఓటీటీలో 5 భాషల్లో
సోనీ లివ్‌లో మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో మార్కో ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారట. అయితే, మార్కో ఓటీటీ రిలీజ్ డేట్‌పై మాత్రం ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ, మార్కో సినిమాను ఓటీటీలో ఫిబ్రవరి 27న లేదా, మార్చి 10 తేదీల్లో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ తేదీల్లో మాత్రం పూర్తి క్లారిటీ లేదు.
క్లారిటీ లేని ఓటీటీ రిలీజ్ డేట్
ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి ఫస్ట్ వీక్‌లో మార్కో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ తేదీల కంటే ముందే మార్కో ఓటీటీలోకి రావొచ్చని, వాయిదా పడే అవకాశం లేదని సోషల్ మీడియాలో వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. ఏది ఏమైనా మార్కో ఓటీటీ స్ట్రీమింగ్, ప్లాట్‌ఫామ్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వయెలెన్స్.. వయెలెన్స్..
ఓటీటీ రిలీజ్ డేట్‌కు కొన్ని రోజులు, లేదా వారం ముందు సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అయితే, వయెలెన్స్.. వయెలెన్స్.. అంటూ సాగే ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మార్కో ఓటీటీ రిలీజ్‌పై మాత్రం ఫుల్ బజ్ క్రియేట్ అయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ఓటీటీ ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్