Best Web Hosting Provider In India 2024
Raw banana Omlette: అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా? రుచి చూశారంటే వారానికి మాడు సార్లు ఇదే బ్రేక్ ఫాస్ట్ కావాలంటారు?
Raw banana Omlette: అరటికాయతో కూర చేసుకుని ఉంటారు, అరటికాయ బజ్జీలను కూడా తినే ఉంటారు. కానీ అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా తిన్నారా? ఈసారి ట్రై చేసి చూడండి. ఉదయాన్నే చాలా త్వరగా తయారయ్యే అరటికాయ ఆమ్లెట్ రుచిలోనూ అమోఘంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ రెసిపీ ఉంది ట్రై చేయండి.
అరటిపండు ఆరోగ్యానికి ఎంత మంచితో అరటికాయ కూడా అంతే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. తరచూ అరటికాయను తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చు. అయితే ఒంటికి ఎంతో మంచిదైనా ఈ అరటికాయతో కూర చేసుకుని తిని ఉండచ్చు, బజ్జీలు కూడా వేసుకుని ఉంటారు. కానీ అరటికాయ ఆమ్లెట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పటి వరకూ తిని ఉండకపోతే మీరు చాలా మిస్ అయినట్టే. ఉదయాన్నే బిజీబిజీగా ఆఫీసులకు వెళ్లే వారికి ఇది పర్ఫెక్ట్ రెసిపీ చాలా తక్కువ సమయంలోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. రుచిలో కూడా ఇది అమోఘంగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా అరటికాయ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి.
అరటికాయ ఆమ్లెట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
- ఒక అరటికాయ
- నాలుగు గుడ్డు
- పావు టీ స్పూన్ ధనియాల పొడి
- పావు టీస్పూన్ గరం మసాలా
- పావు టీ స్పూన్ మిరియాల పొడి
- అర టీస్పూన్ కారం పొడి లేదా రెండు పచ్చిమిర్చీ
- చిన్న అల్లం ముక్క
- ఒక టేబుల్ స్పూన్ క్యాప్సికం
- రుచికి తగినంత ఉప్పు
- ఒక టేబుల్ స్పూన్ నెయ్యి
అరటికాయ ఆమ్లెట్ తయారీ విధానం:
- అరటికాయ ఆమ్లెట్ తయారీ కోసం ముందుగా ఒక పచ్చి అరటికాయను తీసుకుని మీడియం సైజు ముక్కులుగా చేసుకోవాలి.
- ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వీటిని వేసి మెత్తటి పేస్టులా తయారు చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో గుడ్లను కొట్టి గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన కలిసిపోయేంత వరకూ బాగా కలపాలి.
- ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పోడి, కారం పొడి లేదంటి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్క, చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- ఇవన్నీ చక్కగా కలిసిన తర్వాత పక్కకు పెట్టుకోండి.
- ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లేదా ఆమ్లెట్ ప్యాన్ తీసుకుని దాంట్లో కాస్త నూనె పోయండి.
- నూనె కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో అరటికాయ, గుడ్డు మిశ్రమాన్ని వేయండి.
- ఆమ్లెట్ ఒకవైపు ఉడికిన తర్వాత మరొక వైపు తిప్పి ఉడికించుకోవాలి.
అంతే రుచికరమైన అరటికాయ ఆమ్లెట్ రెసిపీ రెడీ అయినట్టే. దీన్ని ఉదయం బ్రేక్‌ఫాస్ట్ గానో లేదా సాయంత్రం స్నాక్స్ గానో తినచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు.