Best Web Hosting Provider In India 2024
Jatadhara: సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా సుధీర్ బాబు కొత్త సినిమా.. ఆ ఆలయం చుట్టు అల్లుకున్న కథతో జటాధర
Sudheer Babu Jatadhara Zee Studio Prerana Arora: నవ దళపతిగా పేరు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నుంచి వస్తున్న కొత్త సినిమా జటాధర. సూపర్ నాచురల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న జటాధర సినిమా కోసం బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది.
Sudheer Babu Jatadhara Zee Studio Prerana Arora: టాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు సుధీర్ బాబు. ఇటీవల నవ దళపతిగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు ఇంతకుముందు హరోం హర, మా నాన్న సూపర్ హీరో వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అవి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్నాయి.
ముందుకొచ్చిన జీ స్టూడియోస్
కానీ, గుర్తుండిపోయేంతగా హిట్ కొట్టలేదు. దీంతో మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సుధీర్ బాబు. ఈ నేపథ్యంలో నవ దళపతి సుధీర్ బాబు నుంచి వస్తున్న కొత్త సినిమా జటాధర. సూపర్ నాచురల్ హారర్ అండ్ ఫాంటసీ థ్రిల్లర్ జోనర్‌లో జటాధర తెరకెక్కుతోంది. ఈ జటాధర చిత్రాన్నిప్రేరణ అరోరాతో కలిసి నిర్మించేందుకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ముందుకు వచ్చింది.
రుస్తుం తర్వాత
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ బ్లాక్ బస్టర్ హిట్ రుస్తుం మూవీ తరువాత మళ్లీ ప్రేరణ అరోరాతో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. సూపన్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జటాధర చిత్రంలోకి జీ స్టూడియోస్ ఎంట్రీ ఇవ్వడంతో టీంలో కొత్త ఉత్తేజం వచ్చింది.
ఎన్నో కథలు అందించాలని
ఈ మేరకు జీ స్టూడియోస్ సీఈవో ఉమేష్ కేఆర్ బన్సాల్ మాట్లాడుతూ.. “జీ స్టూడియోస్‌లో మేం ఇంకా ఎన్నో కథలను అందించాలని, అవి తరతరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నాం. జటాధర థ్రిల్లింగ్ సూపర్ నేచురల్‌గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం మరోసారి ప్రేరణ అరోరాతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు.
ప్రేరణ అరోరా గత సినిమాలు
బాలీవుడ్‌లో నిర్మాతగా ప్రేరణ అరోరాకు మంచి పేరు ఉంది. డైరెక్టర్, నిర్మాత వీరేందర్ కుమార్తె అయిన ప్రేరణ అరోరా రుస్తుం, టాయిలెట్, ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్‌మ్యాన్, పరి, పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ వంటి మంచి చిత్రాలను నిర్మాతగా, సహా నిర్మతగా వ్యవహరించి అందించారు. అలాంటి నిర్మాత అయిన ప్రేరణ అరోరా సుధీర్ బాబు జటాధరకు పనిచేయడం ఆసక్తి కలిగిస్తోంది.
అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టు
జటాధర సినిమా కథ అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుంది. అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, నేపథ్యం, చరిత్ర ఇలా అనేక అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అక్కడి నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణా కథల్ని కూడా చూపించబోతోన్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కారెక్టర్ చాలా భిన్నంగా ఉండబోతోంది.
కఠినమైన శిక్ష
అందుకే ప్రస్తుతం సుధీర్ బాబు తన బాడీని పెంచే పనిలో పడ్డారు. ఇందుకోసం కఠినమైన శిక్షణ కూడా తీసుకుంటున్నారు. ఉమేష్ కెఆర్ బన్సాల్, ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, రాజీవ్ అగర్వాల్, అరవింద్ అగర్వాల్, నిఖిల్ నందా, మోనేష్ మంఘ్నానితో పాటు జీ స్టూడియోస్ బ్రాండ్ వ్యాల్యూ పెంచేలా ఈ జటాధర ఉండనుంది. ఫిబ్రవరిలో జటాధర చిత్రీకరణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుంది.
సంబంధిత కథనం