Best Web Hosting Provider In India 2024
National Games: హైకోర్టు ఆదేశించినా మారని శాప్ వైఖరి.. శాప్ లోగో లేకుండా జాతీయ క్రీడల్లో పాల్గొననున్న ఏపీ క్రీడాకారులు
National Games: నవ్వి పోదురుగాక అన్నట్టు వ్యవహరిస్తోంది ఏపీ శాప్.. మంగళవారం నుంచి ఉత్తరాఖండ్‌లో మొదలవుతున్న జాతీయ క్రీడల్లో ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపింది.దీంతో జాతీయ క్రీడల్లో శాప్, ఏపీ ప్రభుత్వ లోగోలు లేకుండానే పోటీల్లో పాల్గొనాలని ఏపీ ఒలంపిక్ సంఘం నిర్ణయించింది.
National Games: ఉత్తరాఖండ్‌లో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు జరగనున్న 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ జట్లకు ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ ప్రాతినిథ్యం వహించాలని ఏపీ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. రాష్ట్రం నుంచి క్రీడాకారులను పంపే విష యంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియే షన్ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(శాప్), ఏపీ ఆర్చరీ, ఏపీ అథ్లెటిక్, ఏపీ జూడో, ఏపీ ఖోఖో, ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లకు హైకోర్టు ఆదేశించింది.
మరోవైపు కోర్టు తీర్పు తర్వాత కూడా శాప్ నుంచి తమకు ఎలాంటి సహకారం, సమాచారం అందలేదని, శాప్ ప్రతినిధులు కూడా జాతీయ క్రీడలకు హాజరవుతున్నారనే సమాచరం లేదని ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ చెబుతోంది. తొలి రోజు ప్రధాని ఎదుట క్రీడాకారుల కవాతులో శాప్ లోగో, ఏపీ లోగో లేకుండా నిరసన తెలియ చేస్తామని ఏపీ ఒలంపిక్ సంఘం ప్రకటించింది
జాతీయ క్రీడలకు ప్రాతినిధ్యం వహించడంపై పలు క్రీడా సంఘాల మధ్య విభేదాల నేపథ్యంలో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలిచ్చింది. ఏపీ క్రీడాకారులకు ప్రభుత్వం సాయం చేయాలని కొన్ని నెలలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, శాప్‌ను అభ్యర్థిస్తున్నా ఫలితం లేదని ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు పురుషోత్తం ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఏపీ జట్టు క్రీడాకారులు రాష్ట్ర లోగో లేకుండానే ప్రధాని సమక్షంలో జరిగే కవాతులో పాల్గొంటారని హిందుస్తాన్ టైమ్స్‌కు తెలిపారు.
జాతీయ క్రీడలకు ఏపీ నుంచి క్రీడా బృందాలను పంపే అధికార పరిధి ఏపీ ఒలంపిక్ అసోసియేషన్‌కు ఉందని హైకోర్టు గత శుక్రవారం స్పష్టం చేసింది. క్రీడాకారుల ఎంపిక విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలేదని హైకోర్టు అభిప్రాయపడింది. జాతీయ క్రీడలకు క్రీడా బృందాలను పంపే విషయంలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ బాధ్యతలను ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ నిర్వహించడమే సముచితమని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్ జడ్జి మన్మధరావు శుక్రవారం తీర్పు ఇచ్చారు.
మూడేళ్లుగా సహాయ నిరాకరణ…
క్రీడా సంఘాల్లో నెలకొన్న రాజకీయాలతో గత మూడేళ్లుగా జాతీయ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందడం లేదు. గుజరాత్, గోవాలలో జరిగిన జాతీయ క్రీడల్లో కూడా ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ క్రీడాకారులు పాల్గొన్న ప్రభుత్వం ఒక్కరుపాయి కూడా సాయం చేయలేదని ఆరోపించారు. వరుసగా మూడో ఏడాది కూడా ఏపీ ఒలంపిక్ సంఘమే జాతీయ క్రీడల్లో జట్లకు ప్రాతినిథ్యం వహిస్తోందని, ఒలంపిక్ సంఘాన్ని కబ్జా చేయడానికే క్రీడలకు సాయం చేయట్లేదని ఆరోపించారు.
ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ సంబంధం లేకుండా 2029లో జాతీయ క్రీడాలకు బిడ్డింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ తరపున 115 మంది ఉత్తరాఖండ్ చేరుకున్నారని, వారంతా రాష్ట్ర ప్రభుత్వ లోగో లేకుండానే క్రీడల్లో పాల్గొంటారని స్పష్టం చేవారు. ప్రభుత్వంలో కొందరు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
టాపిక్