Best Web Hosting Provider In India 2024
Bigg Boss Kannada 11: బిగ్‍బాస్ విన్నర్‌గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్.. ఎవరు ఈ హనుమంత? ప్రైజ్‍మనీ ఎంతంటే..
Bigg Boss Kannada 11: బిగ్‍బాస్ కన్నడ 11వ సీజన్ ముగిసింది. సీజన్‍కు ముందు పెద్దగా అంచనాలు లేని హనుమంత విజేతగా నిలిచాడు. బిగ్‍బాస్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ హనుమంత ఎవరో ఇక్కడ తెలుసుకోండి.
హోరాహోరోగా సాగిన బిగ్‍బాస్ కన్నడ 11వ సీజన్ ముగిసింది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేసిన ఈ సీజన్ 120 పాటు సాగింది. ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. హనుమంత లమాని ఈ సీజన్ విజేతగా నిలిచాడు. సీజన్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఏకంగా టైటిల్ సాధించాడు. ముందు పెద్దగా అంచనాలు లేకపోయినా ఆ తర్వాత ప్రేక్షకుల మనసులను గెలిచి ఛాంపియన్ అయ్యారు. హనుమంత ఎవరంటే..
బిగ్‍బాస్ కన్నడ 11 ఫైనల్‍లో హనుమంత, నటుడు త్రివిక్రమ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే చివరికి భారీగా ప్రేక్షకుల ఓట్లు సాధించిన హనుమంత విజేత అయ్యాడు. హనుమంతకు సుమారు ఐదు కోట్లు రాగా.. త్రివిక్రమ్‍కు 2 కోట్లు వచ్చినట్టు అంచనా. హనుమంతను విజేతగా హోస్ట్ సుదీప్ ప్రకటించారు.
ఎవరు ఈ హనుమంత?
హనుమంత సొంతఊరు కర్ణాటకలోని హవేరి. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి అతడు వచ్చారు. హవేరీలోనే డిగ్రీ వరకు చదివారు. చిన్నప్పటి నుంచే హనుంత పాటలు పాడే వారు. చాలా పాటల పోటీల్లోనూ పాల్గొన్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. 2018లో సారిగమప కన్నడ 15వ సీజన్‍లో హనుంత పాల్గొన్నారు. దీంతో చాలా పాపులర్ అయ్యాడు. ఫస్ట్ రన్నరప్‍గా నిలిచారు. దీంతో అతడి కెరీర్ దూసుకెళ్లింది. 2019లో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ ఫ్యామిలీ వార్ సీజన్ 2లో హనుమంత పాల్గొన్నారు. డ్యాన్సింగ్ టాలెంట్‍తోనూ మెప్పించారు.
2023లో ఓ రియాల్టీ షో చేశాడు హనుమంత. ఇలా ప్రేక్షకులకు దగ్గరవుతూ వచ్చాడు. గతేడాది జీ5 ఓటీటీలో వచ్చిన కామెడీ ఖిలాడిగలు ప్రీమియర్ లీగ్ షోలో అదరగొట్టాడు. దీంతో అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. బిగ్‍బాస్ కన్నడ సీజన్ 11లో 21వ రోజున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‍గా హనుమంత అడుగుపెట్టాడు. తన ఆటతో అదరగొట్టాడు. ప్రేక్షకుల మనసులు గెలిచి మొత్తంగా దాదాపు 5 కోట్ల ఓట్లు సాధించాడు. బిగ్‍బాస్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.
ప్రైజ్‍మనీ ఇదే
బిగ్‍బాస్ కన్నడ 11వ సీజన్ విజేతగా నిలిచిన 31 ఏళ్ల హనుమంతకు రూ.50కోట్ల ప్రైజ్‍మనీ దక్కింది. ట్రోఫీతో పాటు ఓ లగ్జరీ కారును కూడా గెలుచుకున్నారు. రన్నరప్ త్రివిక్రమ్‍కు రూ.10లక్షల ప్రైజ్‍మనీ దక్కింది.
ఫైనలిస్టులు వీరే
20 మంది కంటెస్టెంట్లు పాల్గొన్న బిగ్‍బాస్ కన్నడ 11వ సీజన్‍లో.. ఫైనల్‍కు హనుమంత, త్రివిక్రమ్, రజత్, మోక్షిత, మంజు చేరారు. హనుమంత విన్నర్ కాగా.. రన్నరప్‍గా త్రివిక్రమ్ నిలిచారు. రజత్ మూడో స్థానాన్ని దక్కించున్నాడు. మోక్షిత, మంజు నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.
సంబంధిత కథనం
టాపిక్