Best Web Hosting Provider In India 2024
Sperm count: మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే గర్భం ధరించడం కష్టంగా మారుతుంది, ఈ పనులు చేస్తే మంచిది
Sperm count: మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. వీర్య కణాల సంఖ్యతో పాటూ వాటి నాణ్యతపై గర్భం ఏర్పడడంపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు, అవి నాణ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి.
ఆధునిక కాలంలో పురుషుల వల్ల సంతానలేమి సమస్య పెరిగిపోతోంది. గర్భం ధరించకపోతే లోపం భార్యలోనే ఉందనుకుంటారు, నిజానికి మగవారిలో వీర్య కణాలు తక్కువగా ఉన్నా, వాటిలో నాణ్యత లేకపోయినా కూడా గర్భం ధరించడం కష్టంగా మారుతుంది. వీర్య కణాలు తక్కువగా ఉండే పరిస్థితిని ఒలిగోస్పెర్మియా అంటారు.
స్థూలకాయం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, మాదకద్రవ్యాలు, ఆల్కహాల్ వాడకం, ధూమపానం, వృషణాలకు గాయం, కీమోథెరపీ వంటి పరిస్థితులు కూడా స్పెర్మ్ కణాల నాణ్యతను ప్రభావితం చేస్తాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి గల కారణాలను బెంగళూరులోని స్పర్శ్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గిరిరాజ వేలాయుధం వివరించారు.
1. జీవనశైలి: చెడు జీవనశైలి కూడా వీర్యంలోని కణాల సంఖ్యను తగ్గిస్తాయి. ధూమపానం, అధికంగా మద్యం సేవించడం, మాదకద్రవ్యాల వాడకం, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తాయి.
2. వైద్య పరిస్థితులు: వివిధ వైద్య పరిస్థితులు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వీటిలో అంటువ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వంటి జన్యు పరిస్థితుల వల్ల వీర్యం ప్రభావితం అవుతుంది.
3. వరికోసెల్: ఇది స్పెర్మ్ ను ఫిల్టర్ చేసే సిరల వాపు సమస్య. దీని వల్ల మగవారికి సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి.
4. పర్యావరణ కారకాలు: పురుగుమందులు, భారీ లోహాలు,రేడియేషన్ వంటి పర్యావరణ విషానికి గురికావడం వీర్యంలోని కణాల ఉత్పత్తికి హాని కలిగిస్తుంది.
5. వేడి: వృషణాల చుట్టూ అధిక ఉష్ణోగ్రత, వేడి స్నానాలు, బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల వీర్య కణాల ఉత్పత్తి తగ్గుతుంది.
స్పెర్మ్ కౌంట్ ను మెరుగుపరిచే చిట్కాలు:
వీర్యంలో కణాల సంఖ్యను పెంచడం, పురుష సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు పాటించాలి.
- ధూమపానం, మద్యపానం: మీరు ధూమపానం చేస్తే, వీలైనంత త్వరగా మానేయండి. దీనివల్ల వృషణాలలో చలనశీలత తక్కువగా ఉంటుంది. క్రోమోజోమ్ జన్యువు దెబ్బతింటుంది. టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గించడంతో పాటు, అధికంగా మద్యపానం ఒక వ్యక్తి సెక్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అదనంగా, మాదకద్రవ్యాల వాడకం స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది.
- వేడి స్నానాలు: వేడి కారణంగా వీర్య కణాలు తగ్గుతాయి. కాబట్టి వేడి స్నానాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి శరీర ఉష్ణోగ్రతను పెంచి స్పెర్మ్ కణాల సంఖ్యను తగ్గిస్తాయి. మీ ఒడిలో కూర్చున్నప్పుడు ల్యాప్ టాప్ ఉపయోగించడం మానుకోండి.
- అతిగా వ్యాయామం: అధిక, భారీ వ్యాయామం టెస్టోస్టెరాన్ స్థాయిలను స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తుంది. మీ వ్యాయామం తేలికగా ఉండాలి. మీ అధిక వ్యాయామం టెస్టోస్టెరాన్ లేదా స్పెర్మ్ స్థాయిలపై ఎటువంటి ప్రభావాన్ని చూపకూడదు.
- బిగుతైన దుస్తులు: వీర్య ఉత్పత్తిని నిరోధించే బిగుతు దుస్తులకు దూరంగా ఉండండి.
- ఆరోగ్యకరమైన బరువు: మీరు గణనీయంగా అధిక బరువు లేదా తక్కువ బరువుతో ఉంటే, మీ శరీరం స్పెర్మ్ అభివృద్ధిని ప్రభావితం చేసే హార్మోన్లను ఎక్కువ లేదా తక్కువ ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి, యోగా చేయడం, వ్యాయామం చేయడం, తెలివిగా తినడం ద్వారా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.
వీర్య కణాలు పెరుగుదలకు కోడిగుడ్లు, పాలకూర, అరటిపండ్లు, డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, తాజా కూరగాయలు, పండ్లు అధికంగా తినాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)