Best Web Hosting Provider In India 2024
Umbilical Cord: ప్రసవం అయిన వెంటనే శిశువు బొడ్డుతాడు రాలిపోదు, అది రాలిపోయే వరకు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
బిడ్డ పుట్టిన తరువాత, అతని బొడ్డు తాడు 5 నుండి 10 రోజుల వరకు అలాగే ఉంటుంది. తరువాత దానికదే రాలిపోతుంది. అయితే ఈలోగా దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ బొడ్డు తాడు దగ్గర ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకూడదు.
బొడ్డుతాడు గర్భిణీ స్త్రీ శరీరంలో ఒక భాగం. ఇది తల్లి నుంచి శిశువుకు పోషణను, రక్షణను అందిస్తుంది. తల్లి తిన్న ఆహారం నుంచి గర్భస్థ శిశువుకు పోషకాలు, రక్తం చేరేది కల్పిస్తుంది. ఇది తల్లీబిడ్డలను కలుపుతుంది. బిడ్డ పుట్టిన తర్వాత, డాక్టర్ దానిని జాగ్రత్తగా కత్తిరిస్తారు. కాని ఇది శిశువు నాభి నుంచి ముక్కలా వేలాడుతుంది. దానికి క్లిప్ పెట్టి ఉంచుతారు వైద్యులు. కొన్ని రోజుల వరకు అది అలాగే ఉంటుంది. తరువాత అది తనకు తానే ఊడిపోతుంది. ఇది పడిపోవడానికి 5 నుండి 10 రోజులు పడుతుంది. అయినప్పటికీ, బొడ్డు తాడు పడిపోయే వరకు దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. శిశువు బొడ్డు తాడు సంరక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.
పొడిగా ఉంచండి
బొడ్డు తాడును పొడిగా ఉంచడం చాలా ముఖ్యం. అదే సమయంలో ఈ డైపర్ లోపలికి పెట్టి నొక్కడం కూడా మంచిది కాదు. బొడ్డు తాడు భాగానికి ఎల్లప్పుడూ పొడిగా, గాలి తగిలేలా ఉండాలి. మీరు శిశువుకు డైపర్ ధరిస్తుంటే, ఈ మావి కింద కొంచెం మడతపెట్టడం ద్వారా ధరించడానికి ప్రయత్నించండి.
మావిపై సబ్బు లేదా ఆల్కహాల్ ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది మావి సమీపంలోని ప్రాంతాన్ని చికాకుపెడుతుంది. శిశువు బొడ్డుతాడు రాలిపడిపోయే వరకు మీ శిశువుకు పూర్తిగా నీటితో స్నానం చేయించే బదులు తడి బట్టతో లేదా స్పాంజితో శుభ్రం చేయడం మంచిది.
ఇన్ఫెక్షన్ రాకుండా
బొడ్డు తాడు స్టంప్ చుట్టూ ఎరుపు, వాపు, దుర్వాసన వచ్చే స్రావాలు లేదా అధిక రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించకుండా చూసుకోవాలి. అలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆ లక్షణాలు బొడ్డు దగ్గర ఇన్ఫెక్షన్ మొదలైందని చెబుతుంది.
స్వయంగా కట్ చేయవద్దు
బొడ్డు తాడు దానికదే రాలిపోయేంత వరకు ఉంచాలి. కానీ మీకు మీరుగా కట్ చేయడం వంటి పనులు చేయవద్దు. ఇలా చేస్తే చాలా ప్రమాదం. శిశువుకు తీవ్ర సమస్యలు రావచ్చు. అక్కడ ఇన్ఫెక్షన్ కూడా మొదలవ్వచ్చు. బొడ్డుతాడును లాగేందుకు ఎప్పుడూ ప్రయత్నించవద్దు.
తాకే ముందు చేతులు కడుక్కోవాలి
శిశువులు చాలా సున్నితంగా ఉంటారు. వారి రోగనిరోధక శక్తి కూడా చాలా బలహీనంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వారికి అంటువ్యాధులు, బ్యాక్టిరియా, వైరస్ వంటివి త్వరగా సోకే అవకాశం ఉంది. కాబట్టి బొడ్డు తాడును తాకే ముందు ఎల్లప్పుడూ మీ చేతులను బాగా కడగాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్