Best Web Hosting Provider In India 2024
Movies: మత్య్సకారుడిగా చైతూ.. లేడీ గెటప్‍లో విశ్వక్.. కొడుకుతో బ్రహ్మానందం.. ఫిబ్రవరిలో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు
Telugu Movie Releases in February 2025: ఫిబ్రవరిలో ఇంట్రెస్టింగ్ తెలుగు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. తండేల్ మూవీపై భారీ అంచనాల ఉన్నాయి. లైలా, బ్రహ్మానందం చిత్రాలపై మంచి క్రేజ్ ఉంది. ఫిబ్రవరిలో రానున్న టాప్ 5 తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.
జనవరిలో సంక్రాంతి సందర్భంగా తెలుగు సినిమాల సందడి బాగా కనిపించింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఫిబ్రవరిలోనూ తెలుగు సినిమాల జోరు ఉండనుంది. తండేల్ చిత్రంపై క్రేజ్ భారీగా ఉంది. వాలెంటైన్స్ డే రోజున మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజ్ కానున్న టాప్-5 తెలుగు సినిమాలో ఏవో ఇక్కడ తెలుసుకోండి.
తండేల్
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగచైతన్య నటించారు. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు చందూ మొండేటి. లవ్ స్టోరీ, దేశభక్తి కలబోతతో ఈ మూవీని రూపొందించారు. తండేల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించింది.
బ్రహ్మ ఆనందం
‘బ్రహ్మ ఆనందం’ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. కామెడీ బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయన కుమారుడు రాజ్ గౌతమ్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో బ్రహ్మ ఆనందం చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీకి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు.
లైలా
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమా కూడా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో లేడీ గెటప్‍లోనూ విశ్వక్ కనిపించనున్నారు. ఈ గెటప్ బాగా వైరల్ అయింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. విశ్వక్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్‍గా నటించారు. ఈ చిత్రంపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.
దిల్‍రూబా
గతేడాది ‘క’ చిత్రంతో బ్లాక్‍బస్టర్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మళ్లీ ఫామ్‍లోకి వచ్చారు. కిరణ్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ మూవీ దిల్‍రూబా వైలెంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఈ మూవీలో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ నటించారు. దిల్‍రుబా మూవీని డైరెక్టర్ విశ్వకిరణ్ తెరకెక్కించగా.. సామ్ సీఎస్ సంగీతం అందించారు.
మజాకా
సందీప్ కిషన్ హీరోగా నటించిన మజాకా చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తండ్రీకొడుకుల లవ్ స్టోరీల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో సందీప్ సరసన రితూ వర్మ హీరోయిన్‍గా నటించారు. రావు రమేశ్, మన్మథుడు ఫేమ్ అన్షు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ కామెడీ డ్రామా సినిమా టీజర్ ఆకట్టుకోవటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మజాకా చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం