Best Web Hosting Provider In India 2024
Kannappa Prabhas First Look: రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. డేట్ ఇదే
Kannappa Prabhas First Look Date: కన్నప్ప చిత్రం నుంచి ప్రభాస్ లుక్ రెడీ అయింది. ఫస్ట్ లుక్ ఎప్పుడు రానుందో డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. దీంతో రెబల్ స్టార్ అభిమానుల్లో ఎగ్జైట్‍మెంట్ పెరిగిపోయింది.
మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నప్ప చిత్రం చేస్తున్నారు. శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రను ఈ మూవీలో విష్ణు పోషిస్తున్నారు. ఈ మైథాలజీ చిత్రానికి ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలకపాత్ర చేస్తున్నారు. దీంతో ఈ మూవీకి క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉంటారోననే ఆసక్తి విపరీతంగా నెలకొంది. ఈ ఉత్కంఠ వీడనుంది. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్‍కు డేట్ ఖరారైంది.
ఫస్ట్ లుక్ తేదీ ఇదే
కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జనవరి 27) అధికారికంగా వెల్లడించింది. నుదిటన నామాలు పెట్టుకున్న ప్రభాస్ కళ్లు, త్రిశూలం ఉన్న ఓ కొత్త పోస్టర్‌ను కూడా షేర్ చేసింది. ఫిబ్రవరి 3న లుక్ పూర్తిగా రివీల్ చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఫస్ట్ లుక్‍తో పాటే కన్నప్ప మూవీలో ప్రభాస్ ఏ పాత్ర చేయనున్నారో కూడా వెల్లడికానుంది. పాత్రల గురించి తెలియజేస్తూనే ఇప్పటి వరకు పోస్టర్లను టీమ్ తెచ్చింది. దీంతో ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో ఫిబ్రవరి 3న తెలియనుంది.
ప్రేక్షకుల్లో ఆసక్తి
కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేయాలని ప్రభాస్ దగ్గరికి వెళ్లామని, అయితే ఆయన వేరే క్యారెక్టర్ చేస్తానని చెప్పారని మంచు విష్ణు గతంలో వెల్లడించారు. దీంతో కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఏంటా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంది. నంది పాత్రను ఆయన చేశారనే రూమర్లు ఉన్నాయి. కన్నప్ప టీజర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే ఓ సెకన్ అలా కనిపించాయి. అయితే, ఇప్పుడు ఫస్ట్ లుక్ వస్తుండటంతో ఎగ్జైట్‍మెంట్ విపరీతంగా పెరిగిపోయింది. అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరిలో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది.
కన్నప్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ప్రభాస్ ఫస్ట్ లుక్ వచ్చాక దేశం మొత్తం ఈ మూవీకి క్రేజ్ రావడం పక్కాగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
కన్నప్ప మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. శివుడి పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే వచ్చింది. పార్వతీ దేవి పాత్రను కాజల్ చేస్తున్నారు.
కన్నప్ప చిత్రంలో మంచు మోహన్‍బాబు, మలయాళ స్టార్ మోహన్‍లాల్, శరత్ కుమార్, మధో, బ్రహ్మాజీ, ప్రీతీ ముకుందన్, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహాభారతం టీవీ సిరీస్ ఫేమ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టీఫెన్ దెవాసీ సంగీతం అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకాలపై మోహన్‍బాబు ఈ మూవీని ప్రొడ్యూజ్ చేస్తున్నారు. రూ.100కోట్లకుపైగానే ఈ చిత్రానికి బడ్జెట్ అయినట్టు అంచనా.
సంబంధిత కథనం