వేట మొదలు.. గురుద్వారాలపై ట్రంప్​ యంత్రాంగం టార్గెట్​! వలసదారుల్లో భయం- భయం..

Best Web Hosting Provider In India 2024


వేట మొదలు.. గురుద్వారాలపై ట్రంప్​ యంత్రాంగం టార్గెట్​! వలసదారుల్లో భయం- భయం..

Sharath Chitturi HT Telugu
Jan 27, 2025 11:20 AM IST

Raids in New York Gurdwaras : అక్రమ వలసదారులను “ఇల్లీగల్​ ఏలియెన్స్​” అని సంబోధిస్తూ.. వారిని పట్టుకునేందుకు న్యూయార్క్​, న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లో ట్రంప్​ యంత్రాంగం సోదాలు నిర్వహించింది. దీనిని అమెరికాలోని సిక్​ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

గురుద్వారాల్లో అధికారుల సోదాలు
గురుద్వారాల్లో అధికారుల సోదాలు (Reuters/ Representative image)

డొనాల్డ్​ ట్రంప్​ ఎంట్రీతో అమెరికాలో వలసదారుల గుండెల్లో భయం పెరిగిపోయింది. ఇమ్మిగ్రెంట్స్​పై ఎప్పుడు ఎలాంటి బాంబు వదులుతారో అని అందరు వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా అక్రమ వలసదారులకు నిద్రపట్టడం లేదు! ఈ నేపథ్యంలో తాజాగా బయటకు వచ్చిన ఒక వార్తతో అక్రమ వలసదారుల్లో ఆందోళనలు మరింత పెరిగాయి. అక్రమ వలసదారులను “ఇల్లీగల్​ ఏలియన్స్​” అని సంబోధిస్తూ.. న్యూయార్క్​, న్యూజెర్సీలోని గురుద్వారాల్లో యూఎస్​ హోంల్యాండ్​ డిపార్ట్​మెంట్​ సెక్యూరిటీ (డీహెచ్​ఎస్​) అధికారులు సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం సృష్టించింది.

yearly horoscope entry point

గురుద్వారాల్లో సోదాలు..

న్యూయార్క్​, న్యూజెర్సీలోని గురుద్వారాల్లో ఆదివారం మొత్తం అధికారులు భారీ ఎత్తున సోదాలు నిర్వహించారు. దీనిని ట్రంప్​ యంత్రాంగం సమర్థించుకుంది.

“ఇమ్మిగ్రేషన్​ చట్టాలను అమలు చేసి, మర్డర్లు- రేప్​లకు పాల్పడే క్రిమినల్​ ఏలియెన్స్​ని పట్టుకునేందుకు మా అధికారుల నిబద్ధతకు ఇది చిహ్నం. వీళ్లందరు దేశానికి అక్రమంగా వచ్చారు. అమెరికా స్కూళ్లల్లో, చర్చ్​లలో క్రిమినల్స్​ ఇక ఏ మాత్రం తలదాచుకోలేరు. కచ్చితంగా అరెస్ట్​ చేస్తాము. ధైర్యవంతులైన అధికారుల చేతులను ట్రంప్​ ప్రభుత్వం కట్టేయదు. వారిపై నమ్మకాన్ని మరింత పెంచుకుని బాధ్యతలు అప్పగిస్తాము,” అని డీహెచ్​ఎస్​ ప్రతినిధి ఒకరు తెలిపారు.

సున్నితమైన ప్రదేశాల్లో సోదాలు నిర్వహించకుండా ఉండేందుకు మాజీ అధ్యక్షుడు జో బైడెన్​ పలు కీలక చర్యలు తీసుకున్నారు. వాటిని పక్కనపెట్టి ఇప్పుడు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ నేతృత్వంలో అధికారులు గురుద్వారాలు, చర్చ్​లను సైతం విడిచిపెట్టకుండా సోదాలు నిర్వహిస్తున్నారు.

సిక్కు సమాజం ఆందోళన..

తాజా పరిణామాలపై ఎస్​ఏఎల్​డీఎఫ్​ (సిక్​ అమెరికన్​ లీగల్​ డిఫెన్స్​ అండ్​ ఎడ్యుకేషన్​ ఫండ్​) ఆందోళన వ్యక్తం చేసింది. సున్నితమైన ప్రాంతాల్లో సోదాల పేరుతో గందరగోళం సృష్టించడాన్ని తప్పుబట్టింది.

“సున్నిమైన ప్రదేశాల భద్రతలను తొలగించడమే కాదు, సోదాల పేరుతో గురుద్వారాలు వంటి ప్రార్థనా స్థలాలను హోంల్యాండ్​ సెక్యూరిటీస్​ టార్గెట్​ చేయడం ఆందోళనకరంగా ఉంది. విధానాలు మారిన కొద్ది రోజులకే.. న్యూయార్క్​, న్యూజెర్సీ ప్రాంతాల్లోని గురుద్వారాలపై డీహెచ్​ఎస్​ ఏజెంట్​లు దాడులు చేసినట్టు రిపోర్టులు వస్తున్నాయి,” అని ఎస్​ఏఎల్​డీఎఫ్​ ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్​ కిరణ్​ కౌర్​ గిల్​ తెలిపారు.

ఈ చర్యలు సిక్కుల విశ్వాసాల పవిత్రతను భంగం కలిగించే విధంగా ఉన్నాయని, అమెరికాలోని వలసదారుల సమాజానికి భయపెట్టే సంకేతాలు ఇస్తున్నట్టు ఉన్నాయని గిల్​ పేర్కొన్నారు.

“పోలీసు వ్యవస్థ నిఘాలో మా గురుద్వారాలు ఉన్నాయని తెలిస్తే, సిక్కులు ఒకచోట చేరి ప్రార్థనలు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. వారెంట్​తో వచ్చినా, వారెంట్​ లేకుండా వచ్చినా, అది ఆమోదయోగ్యం కానిది,” అని సిక్​ సమాజం వెల్లడించింది. “డాక్యుమెంట్లు ఉన్న- డాక్యుమెంట్లు లేని వారిపై గురుద్వారాల్లో రైడ్లు జరుగుతున్నాయని, నిఘా పెడుతున్నారని తెలిస్తే ఇక్కడికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోతుంది. మతపరమైన ప్రార్థనలు చేసుకోవడం కుదరదు,” అని ఆవేదన వ్యక్తం చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link