Best Web Hosting Provider In India 2024
OTT Movie: ఓటీటీలో అనసూయ సినిమాకు సూపర్ రెస్పాన్స్.. స్ట్రీమింగ్‍లో ఆ మార్క్ దాటిన చిత్రం
Razakar OTT Streaming: రజాకార్ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. థియేటర్లలో రిలీజైన పది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
హిస్టారికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘రజాకార్’ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమా గతేడాది మార్చి 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. పది నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టింది. నిజాం పాలకుల దురాగతాల ఆధారంగా అప్పటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక, అనసూయ భరద్వాజ్, మకరంద్ దేశ్‍పాండే ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో రజాకార్ మూవీకి అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లు రాలేదు. అయితే, ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి.
30 మిలియన్ నిమిషాలను దాటి..
రజాకార్ చిత్రం జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. గోల్డ్ సబ్‍స్క్రైబర్లకు అందుకు రెండు రోజుల ముందే అందుబాటులోకి వచ్చింది. ఆహాలో రజాకార్ చిత్రానికి భారీ వ్యూస్ దక్కుతున్నాయి. ఆహా ఓటీటీలో 30 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాల మార్కును రజాకార్ చిత్రం తాజాగా దాటేసింది.
ఆహాలో రజాకార్ చిత్రం ప్రస్తుతం టాప్‍లో ట్రెండ్ అవుతోంది. క్రమంగా వ్యూస్ పెంచుకుంటూ వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది. ఇంకొన్ని రోజులు టాప్‍లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
యథార్థ ఘటనల ఆధారంగా..
నిజాంల పాలనలో రజాకార్ల దురాగతాలు, ప్రజల తిరుగుబాటు, హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్ పోలో లాంటి చారిత్రక ఘటనల చుట్టూ రజాకార్ మూవీ సాగుతుంది. ఆ యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు యేట సత్యనారాయణ తెరకెక్కించారు.
రజాకార్ సినిమా కోసం ప్రమోషన్లను మూవీ టీమ్ ఎక్కువగానే చేసింది. దీంతో మంచి బజ్ తెచ్చుకుంది. ఆరంభంలో పాజిటివ్ టాక్‍నే దక్కించుకుంది. అయితే, అనుకున్న విధంగా ఈ చిత్రానికి కలెక్షన్లు రాలేదు. థియేట్రికల్ రన్ ఎక్కువ కాలం సాగలేదు. ఓటీటీ డీల్ కూడా చాలా ఆలస్యమైంది. ఆహా ఓటీటీ ఇటీవలే రైట్స్ తీసుకుంది. దీంతో థియేటర్లలో రిలీజైన పది నెలలకు ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.
రజాకార్ చిత్రంలో రాజిరెడ్డి అనే ప్రధాన పాత్ర చేశారు బాబీ సింహా. తేజ్ సప్రు, మకరంద్, రాజ్ అర్జున్, వేదిక కీరోల్స్ చేశారు. పోచమ్మ అనే పవర్‌ఫుల్ పాత్రను అనసూయ భరద్వాజ్ పోషించారు. సీనియర్ నటి ఇంద్రజ కూడా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను సమర్‌వీర్ క్రియేషన్స్ పతాకంపై సత్యనారాయణ రెడ్డి నిర్మించారు. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చిన ఈ చిత్రానికి కుశేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.
సంబంధిత కథనం