Best Web Hosting Provider In India 2024
IRCTC eWallet : రైలు టికెట్ బుకింగ్ మరింత ఈజీ.. ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్ ఎలా ఉపయోగించాలి?
IRCTC eWallet : రైలు టిక్కెట్లను బుక్ చేయడంలో కొన్నిసార్లు సమస్యలు వస్తుంటాయి. చెల్లింపులో జాప్యం, క్యాన్సిల్ వంటి సమస్యలు సాధారణం. దీన్ని దృష్టిలో ఉంచుకుని IRCTC eWallet సౌకర్యాన్ని అందిస్తోంది. దీన్ని ఎలా వాడుకోవాలో చూద్దాం..
భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాలను తెస్తుంది. దీనిద్వారా ప్రయాణం సులభతరం అవుతుంది. రైలు టికెట్ బుక్ చేసినప్పుడు తరచుగా బుకింగ్ కన్ఫామ్‌లో ఆలస్యం లేదా క్యాన్సిల్ చేయడం, వాపసు వంటి సమస్యలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు డబ్బు కట్ అయినా వాపస్ రావడం లేట్ అవుతుందనే భయం ఉంటుంది. చాలాసార్లు టికెట్లు సకాలంలో బుక్ కాదు. ఇప్పుడు ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఐఆర్‌సీటీసీకి eWallet ఉంది. ఇది టిక్కెట్ బుకింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుంది.
రైలు టిక్కెట్లను బుక్ చేయడంలో వైఫల్యం, ఆలస్యంగా బుకింగ్ కన్ఫామ్, క్యాన్సిల్ వంటి సమస్యలు వస్తాయి. ఐఆర్‌సీటీసీ ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ వ్యాలెట్ తీసుకొచ్చింది. దీని ద్వారా టిక్కెట్లను తక్షణమే బుక్ చేసుకోవచ్చు. ఈ వ్యాలెట్ ద్వారా చెల్లింపు ప్రక్రియ ఇతర చెల్లింపుల పద్ధతి కంటే ఈజీ. ప్రయాణికులు అదనపు చెల్లింపు గేట్‌వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
టిక్కెట్ రద్దు విషయంలో వాపసు కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. రీఫండ్ నేరుగా ఈ వ్యాలెట్‌కు వచ్చేస్తుంది. బ్యాంక్ ఖాతా, నెట్ బ్యాంకింగ్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ వ్యాలెట్ సులభంగా రీఛార్జ్ చేయవచ్చు. దీనిని ఐర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లో మాత్రమే ఉపయోగించవచ్చు.
మీరు కూడా ఈ-వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. అక్కడ మీ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మొదటి సారి ఈ వ్యాలెట్ ఉపయోగిస్తుంటే ఐఆర్‌సీటీసీ ఎక్స్‌క్లూజివ్ విభాగంలో eWallet ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో ఐఆర్‌సీటీసీ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి సమర్పించండి. ఈ వాలెట్ ఆప్షన్‌ని మళ్లీ క్లిక్ చేస్తే టాప్అప్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో రూ.100 నుంచి రూ.10,000 వరకు బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి టిక్కెట్లు సులభంగా బుక్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసే సమయంలో వ్యాలెట్ నుంచి కట్ అయ్యేలా చేయవచ్చు.
రైలు టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు చెల్లింపు విఫలమవుతుంది లేదా బుకింగ్ ధృవీకరించబడడంలో ఆలస్యం జరుగుతుంది. ఐఆర్‌సీటీసీ ఈ వ్యాలెట్ ద్వారా ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది సురక్షితమైన, వేగవంతమైన చెల్లింపు ఆప్షన్. దీని ద్వారా మీరు సులభంగా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. అదనపు చెల్లింపు గేట్‌వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
Best Web Hosting Provider In India 2024
Source link