Best Web Hosting Provider In India 2024
Facepack: ముఖకాంతిని పెంచే ఫేస్ ప్యాక్‌లు ఇవిగో, వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ
Facepack: ముఖంపై కొంత ప్రాంతం రంగు ముదురు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే హోం ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. అసమాన చర్మానికి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇక్కడ ఇచ్చాము.
అందంగా ఉండాలని అందరూ ప్రయత్నిస్తారు. కానీ కాలుష్యం, పోషకాహారలోపం వల్ల ముఖం కాంతి విహీనంగా మారుతుంది. కొన్ని చోట్ల రంగు పాలిపోయినట్టు, మరోచోట రంగు ముదిరినట్టు ముఖం కనిపిస్తుంది. ఇలా ముఖం అసమాన స్కిన్ టోన్ కలిగి ఉండడం వల్ల అందంగా కనిపించరు. కాబట్టి మీ స్కిన్ టోన్ మొత్తం ఒకేలా ఉంటేనే అందంగా కనిపిస్తారు.
అసమాన స్కిన్ టోన్ ఒక సాధారణ సమస్యలా కనిపిస్తున్నా… ఇది అందాన్ని తగ్గిస్తుంది. ఇది ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఈ సమస్యను తగ్గించేకోవడానికి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. అసమాన స్కిన్ టోన్ ను వదిలించుకునే సులభమైన ఫేస్ ప్యాక్ ను ఇక్కడ మేము చెబుతున్నాము.
ఫేస్ ప్యాక్ తయారీ
ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ముందుగా బియ్యాన్ని నీళ్లలో వేసి బాగా ఉడికింాచలి. అన్నం ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. దాన్ని మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టమోటా తీసుకుని మెత్తటి ప్యూరీలా చేసి దాన్ని అన్నంలో కలుపుకోవాలి. అందులోనే అర నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి. అంతే ఫేస్ ప్యాక్ రెడీ అయినట్టే.
ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ శుభ్రత కోసం ఫేస్ వాష్ ను ఉపయోగించవచ్చు. లేదా క్లెన్సర్ తో కూడా ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ముఖానికి కెమికల్ ప్రొడక్ట్స్ అప్లై చేయకుండా ఉండాలంటే నీళ్లతో ముఖాన్ని కడిగి ఆరనివ్వాలి. తర్వాత కొద్దిగా పాలలో కాటన్ బాల్ ను ముంచి ఈ కాటన్ ను ముఖమంతా తిప్పి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను శుభ్రమైన ముఖానికి అప్లై చేసి, అప్లై చేసిన తర్వాత కనీసం 15 నిముషాలు అలాగే వదిలేయాలి.
ఫేస్ ప్యాక్ ను తొలగించే ముందు, ప్యాక్ బాగా ఎండిందో లేదో తనిఖీ చేయండి. ఆరిన తర్వాత చేతులను తడిపి, ఆ తర్వాత ముఖాన్ని వృత్తాకారంలో మసాజ్ చేస్తూ ప్యాక్ ను శుభ్రం చేసుకోవాలి. చివరగా శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగి ఆ తర్వాత రోజ్ వాటర్ ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు నెలరోజుల్లోనే మీ ముఖంలో మెరుపును చూస్తారు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్