Best Web Hosting Provider In India 2024
ఒక వివాహిత జీవితాన్ని ఆనందంగా మార్చగలిగేది ఈ ముగ్గురే, వీరే ఆమెను వ్యతిరేకిస్తే ఇంట్లో గొడవలే
పెళ్లి తర్వాత ఆడపిల్ల కొత్త ఇంట్లోకి అడుగుపెడుతుంది. అక్కడ ఉండే కొత్తవారితో సర్దుకుపోవాలి. పెళ్లైన మహిళ జీవితాన్ని ఆనందంగా మార్చే శక్తి, నరకం చేసే శక్తి ముఖ్యంగా ముగ్గురికే ఉంది. వారెవరో తెలుసుకోండి.
పెళ్లయ్యాక ఓ అమ్మాయి ఎన్నో ఆశలతో, తీపి కలలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. పుట్టి పెరిగిన ఇల్లు, కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి, పూర్తిగా కొత్త వ్యక్తుల మధ్యకు వస్తుంది. ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆమెకు అక్కడ మద్దతు పలికేవారు కూడా ఉండాలి. కొత్త కోడలు తన అత్తమామలను తన తల్లిదండ్రులుగా, అత్తారిల్లును తన ఇల్లుగా భావిస్తుందో ఆమె ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. అయితే కేవలం కోడలే కాదు… ఆమె అత్తమామల ప్రవర్తన కూడా ఆమె జీవితాన్ని నిర్ణయిస్తుంది. అదృష్టవశాత్తూ, కొంతమంది అమ్మాయిలకు మాత్రమే కూతురులా చూసుకునే అత్తమామలు దొరుకుతారు. ఒక వివాహిత జీవితాన్ని ఆనందంగా ఉంచాలన్నా… నరకంగా మార్చాలన్న అతవారింట్లోని ముగ్గురే నిర్ణయిస్తారు.
అత్తగారు సపోర్ట్ చేయనప్పుడు
అత్తా కోడళ్ల అనుబంధం శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఏ ఇంట్లో అత్తగారు బాగుంటారో, కోడలిని కూతురుతో సమానంగా చూస్తారో… ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు ఉంటాయి. అయితే కొందరు అత్తమామలు కోడలిని బయటివ్యక్తిలా చూస్తారు. అలాంటి అత్తగారు తన కోడలితో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కోడలి గురించి అత్తగారు నిత్యం చెడుగా మాట్లాడుతున్నా, విమర్శిస్తున్నా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. కోడలు స్వతంత్రంగా ఉన్నా, ఆమె ఆధునిక భావాలను ముందుకు వెళుతున్నా కూడా కొంతమంది అతగార్లకు నచ్చదు. వారిని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడినా అలాంటి అత్తగారు తన కోడలితో ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండదు. అలాంటి అత్తగారితో కోడలు సంతోషంగా జీవించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో చాలాసార్లు ఆమె తన భర్తతో విషయాలను పంచుకోలేకపోతోంది.
మరదలు
మరదలు, వదినల మధ్య అనుబంధం కూడా అత్తగారింట్లో చాలా ప్రత్యేకం. భర్తకు చెల్లి లేదా అక్క ఉంటే వారితో కూడా కోడలి కలిసిపోతేనే సంతోషంగా ఉండాలి. వివాహం చేసుకుని తన అత్తవారింటికి చేరుకున్నప్పుడు, ఆమె తన మరదలిలో ఒక స్నేహితురాలిలా, గురువులా, సోదరిలా కలిసిపోతేనే సంతోషంగా ఉండగలదు. ఈ బంధం ఎంత బలంగా ఉంటే ఇంటి వాతావరణం అంత సంతోషంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మరదలు కూడా బయటకు వచ్చి కోడలి గురించి చెడుగా మాట్లాడడం వంటివి చేస్తుంది. కోడలిని అవమానించడానికి ఏ మాత్రం వెనుకాడరు. కొన్నిసార్లు కోడలి మీదకి తమ తల్లి, సోదరుడిని రెచ్చగొట్టేందుకు కూడా ప్రయత్నిస్తుంది. అలాంటి మరదళ్లు, వదినల వల్ల కూడా వివాహితలు కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు.
జీవిత భాగస్వామి
పెళ్లయిన మహిళలకు తన భర్త సపోర్ట్ చాలా ముఖ్యం. అత్తవారింట్లో భర్త మద్దతు ఉంటేనే భార్య సంతోషంగా జీవించగలదు. వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటేనే అమ్మాయి అత్తవారింట్లో ఉండటం తేలికవుతుంది. భర్త తనకు సపోర్ట్ చేయకపోతే వివాహిత జీవితం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. తల్లి, అక్కాచెల్లెళ్లు చెప్పిన విషయాలు విని భార్యపై అరిచే భర్త, అనుమానించే భర్త ఉంటే ఆ మహిళ జీవితం నరకంగా మారిపోతుంది. సరైన భర్త లేకపోతే ఆమె జీవితం నలిగిపోతుంది.