



Best Web Hosting Provider In India 2024
Meerpet Murder Case : మిస్సింగ్ టు మర్డర్.. మీర్‌పేట హత్య కేసులో సీన్ రీ కన్‌స్ట్రక్షన్
Meerpet Murder Case : సంచలనం సృష్టించిన మీర్‌పేట హత్య కేసులో మరో కీలక పరిణామం జరిగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడు గురుమార్తిని తన ఇంటికి తీసుకొచ్చారు. హత్య చేసిన విధానాన్ని తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి వరకు గురుమూర్తిని రిమాండ్‌కు తరలించే ఛాన్స్ ఉంది.
మీర్‌పేట హత్య కేసుకు సంబంధించి పోలీసులు సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేశారు. నిందితుడి ఇంటి వద్ద గురుమూర్తితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశారు. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా మార్చారు. ప్రస్తుతం మీర్‌పేట పోలీసు స్టేషన్‌లోనే నిందితుడు ఉన్నాడు. గురుమూర్తిని మంగళవారం రాత్రి లోపు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

అసలు ఏం జరిగింది..
గురుమూర్తి, వెంకట మాధవి భార్యాభర్తలు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే.. కొన్ని భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. తన భార్య వెంకట మాధవిని గురుమూర్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా చేసి.. కుక్కర్‌లో ఉడికించాడు. ఎలక్ట్రిక్ హీటర్ సాయంతో బకెట్‌లోనూ ఉడికించాడు. ఎముకలను కాల్చి బూడిద చేసి చెరువులో పడేశాడు.
ఏమీ తెలియనట్టు..
ఇదంతా చేసి.. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఆమె తల్లి సుబ్బమ్మతో కలిసి.. జనవరి 16న మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై పోలీసులు ఆధారాలు సేకరించారు. గురుమూర్తిని అరెస్టు చేశారు.
సినిమాలో చేసినట్టు..
హత్యకు ముందు గురుమూర్తి కామెడీ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమాను ఓటీటీలో చూశాడు. ఆ సినిమాలో ఉన్నట్టు మాధవిని హత్యచేసి.. ఆధారాలు మాయం చేయాలనుకున్నాడు. సూక్ష్మదర్శిని సినిమాలో ఇంట్లో వారి మాట వినకుండా పెళ్లి చేసుకుని.. బాలికను దత్తత తీసుకున్న కూతురిని.. ఆమె తల్లి కొడుకుతో కలిసి హత్య చేస్తుంది. శవాన్ని మాయం చేయడానికి ఇంట్లో చిన్న నీళ్ల ట్యాంకు ఏర్పాటు చేస్తుంది. అందులో యాసిడ్, రసాయనాలు కలిపి శవాన్ని ఆ ట్యాంకులో వేస్తారు. యాసిడ్, రసాయనాలు శవాన్ని కరిగించి ద్రవంగా మార్చేస్తాయి. ఆ నీటిని వాష్ రూమ్ ద్వారా ఫ్లష్ చేసేస్తారు. కరిగిపోని ఎముకలను చిన్న చిన్న ముక్కలుగా చేసి.. ఆ తర్వాత పొడి చేసి ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారు. గురుమూర్తి కూడా ఇలాగే ప్లాన్ చేశాడు.
కాల్ డేటా పరిశీలన..
గురుమూర్తి కాల్ డేటాను కూడా పోలీసులు పరిశీలించారు. తన భార్యను హత్య చేసిన తర్వాత గురుమూర్తి 8 కాల్స్ చేశాడని.. వాటిలో ఒకటి బడంగ్‌పేట్‌లో నివసిస్తున్న తన సోదరికి అని పోలీసులు గుర్తించారు. మిగతా కాల్స్‌పైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. హత్యకు ముందు, హత్య తర్వాత అతను ఎవరెవరికి కాల్ చేశాడో వివరాలు సేకరించి, అవసరాన్ని బట్టి వారిని కూడా విచారణకు పిలుస్తున్నారు.
టికెట్లు బుక్..
గురుమూర్తి జనవరి 15న తన భార్య వెంకట మాధవిని హత్య చేశాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి వెళ్లడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా టిక్కెట్లు బుక్ చేసుకున్నాడు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు అతని స్నేహితుడిని విచారణ కోసం పిలిపించినట్లు సమాచారం. అతనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినట్టు తెలిసింది.
టాపిక్