Best Web Hosting Provider In India 2024
AP Tourism Investments : ఏపీ టూరిజంలో రూ.1217 కోట్ల పెట్టుబడులు, 8 సంస్థలతో ఒప్పందాలు
AP Tourism Investments : ఏపీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. రూ.1217 కోట్ల విలువైన ఎనిమిది ప్రాజెక్టులతో ఏపీ టూరిజం ఒప్పందాలు చేసుకుంది. దీంతో టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పించనున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు.
AP Tourism Investments : ఏపీ పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుంది. పర్యాటక రంగానికి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.1,217 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టుల ఎంవోయూలపై సంతకాలు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
విశాఖపట్టణం, తిరుపతి, అమరావతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 825 రూమ్ లు ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ముందుకొచ్చారన్నారు. దీంతో టూరిజం రంగంలో 2,567 ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ సదస్సులో అరకు చలి ఫెస్టివల్ బ్రోచర్ విడుదల చేశారు.
“ఉత్తరాంధ్ర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా విశాఖ ప్రాంతీయ పర్యాటక సదస్సు జరిగింది. త్వరలోనే విశాఖ కేంద్రంగా క్రూయిజ్ హబ్ ఏర్పాటు చేస్తాం. ఎంటర్టైన్మెంట్, టూరిజానికి రియల్ హబ్ గా విశాఖపట్టణం మారుతుంది. పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించాం. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం”- మంత్రి కందుల దుర్గేష్
8 సంస్థలతో ఒప్పందం- రూ.1217 కోట్ల పెట్టుబడులు
- అట్మాస్పియర్ కోర్ – విశాఖ, అమరావతి, తిరుపతి- రూ.1,000 కోట్లు
- సుమియాగ్రి – విశాఖ, గుంటూరు – రూ.50 కోట్లు
- ఎవరెస్టు ఎంటర్ ప్రైజెస్- విశాఖ – రూ. 07 కోట్లు
- రాయల్ పామ్స్ – చీరాల – రూ.30 కోట్లు
- రిప్పిల్స్ అండ్ కో- అల్లూరి సీతారామరాజు జిల్లా- రూ.100 కోట్లు
- బ్లూబే ఇన్ ఫ్రా- భోగాపురం -రూ.18 కోట్లు
- హోటల్ ఎస్ పార్క్ – బాపట్ల – రూ.7 కోట్లు
- డాల్ఫిన్ ఓషన్ క్రూయిజ్ – విశాఖ – రూ.5 కోట్లు
టాపిక్