రాష్ట్రంలో దీ గ్రేట్ మోసగాడు చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024

ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేశారు

సచివాలయం సాక్షిగా సూపర్ సిక్స్ అమలు ఉండదంటూ స్పష్టం

ఎన్నికల ముందు హామీలు… అధికారంలోకి వచ్చిన తరువాత ఎగవేతలు

ప్రజలను నిలువునా దగా చేస్తున్న చంద్రబాబు

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఫైర్

నీతి అయోగ్ లెక్కలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రోజుకో రకంగా చంద్రబాబు మాటలు

అప్పులపై ప్రతిసారీ అబద్దపు లెక్కలతో మాయ చేసే యత్నం

తన అసమర్థతను గత ప్రభుత్వంపై నెట్టేస్తూ నిందలు

తన చేతకానితనంతో రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్న చంద్రబాబు

ఆర్థిక పరిస్థితి అంటూ సూపర్ సిక్స్ కు సున్నం

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం 

చరిత్ర హీనుడుగా చంద్రబాబు మిగిలిపోతాడు

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ధ్వజం

నెల్లూరు జిల్లా: ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి, హామీలతో కనికట్టు చేసిన దీ గ్రేట్ మోసగాడు నారా చంద్రబాబు ఎట్టకేలకు తన ముసుగు మొత్తం తీసేశారని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కుదరదు అంటూ చాలా స్పష్టంగా చంద్రబాబు తేల్చి చెప్పేశారని అన్నారు. ఎలాంటి సంకోచం, భయం లేకుండా ప్రజలను మోసం చేయగల ఘనుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు.

సంపద సృష్టించిన తరువాతే హామీల అమలు అని తేల్చేశారు

చంద్రబాబు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్లీ లేపినట్టేనని, పులినోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు వైయస్ జగన్ గారు  ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు మరోసారి నిజం అని చంద్రబాబు నిరూపించుకున్నాడు. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబును, మాట మీద నిలబడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ  ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వసనీయతను, ఆయన చిత్తశుద్ధి, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా అందరూ పోల్చి చూస్తున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిబోయే సమయం ఖజానాలో మిగిల్చింది కేవలం రూ.100 కోట్లు. అదే వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్న మొత్తం రూ.5000 కోట్లు. అటువంటి నేపథ్యంలో వాస్తవాలను దాచిపెట్టి ప్రజలకు అబద్దాలను నిస్సిగ్గుగా మాట్లాడారు. నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను ఒక్కసారి చూస్తే… ‘‘అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది.  ఆదాయం పెరిగితే మళ్లీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోరో మనీ ఉంటే మోరో క్యాపిటల్ వ్యయం ఖర్చు పెడతాం. మోర్ గ్రోత్ రేట్ వస్తుంది. మోర్ రెవెన్యూ వస్తుంది. సస్టైనబులిటీ వస్తుంది. ఆ సస్టైనబులిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్  జరుగుతుంది. మేం చెప్పిన సూపర్ సిక్స్ఇస్తాం. ఇంకా బెటర్గా ఇస్తాం. పీ4 తీసుకొస్తాం.’’ ఇదీ నీతి ఆయోగ్ నివేదిక పై ప్రజెంటేషన్‌లో  సీఎం  చంద్రబాబు  చెప్పిన మాటలు. 

9 నెలల్లో రూ.1.19 కోట్లు అప్పులు

ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 9 నెలలు కావొస్తోంది. ఈ 9 నెలలకాలంలో దాదాపుగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారన్నది నిజం కాదా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను తీసేసి… వారిని రోడ్డు మీదకు పెడుతున్నారన్నది నిజం కాదా? వాలంటీర్లను, గ్రామ వార్డు సచివాలయాల్లో పోస్టులు కుదించడం దగ్గర నుంచి, బెవరేజెస్ కార్పొరేషన్, ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఏపీఎండీసీ, పీల్డ్ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖ ఇలా ఆయా విభాగాల్లో లక్షలమంది ఉద్యోగులను తొలగిస్తున్నది వాస్తవం కాదా? పైగా జగన్ గారు ఒక ముందుచూపుతో, విజన్ తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి మూడు పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే.. వాటిని మీ వాళ్లకు తెగనమ్మాలనుకున్నది వాస్తవం కాదా? ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతోపాటు, మరికొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే మొత్తంగా జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నంచేస్తున్న మాట వాస్తవం కాదా? ఇక సంపద సృష్టి ఎక్కడ జరుగుతోంది. సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకులకుకోసం, చంద్రబాబునాయుడుగారి మనుషులకోసం తప్ప మరెవ్వరికీ కాదు. ఇసుక, మద్యం మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఫ్లైయాష్ ఇలా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రతి పనికీ ఎమ్మెల్యేలకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందే.. ఈరకంగా సంపద సృష్టి మీ వాళ్లకు జరుగుతోంది తప్ప.. పేదలకు, సామాన్యులకు సంపద సృష్టి దక్కడం లేదు. మీ పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ తో రెండు మూడు సినిమాలు తీస్తే.. వారికి వందల ఎకరాలు దోచి పెడుతున్నారు. సంపద సృష్టి అలాంటి వారికి జరగుతోంది తప్ప, రాష్ట్రానికీ, ప్రజలకూ కాదు. అందుకే చంద్రబాబుగారు… సంపద సృష్టి అన్నది వట్టిమాటలేనని చెప్పకనే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా, స్లోగా ఎక్కించే ప్రయత్నంచేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు. 

హామీల అమలుకు చంద్రబాబుకు మనసు రావడం లేదు

తాను చేసిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ వాగ్దానాలను అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతగాని తనంతో, అసమర్థతతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు, ఆ నేరాన్ని జగన్ గారి మీద నెట్టేయడానికి ఇప్పటికీ కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేవేసిన, ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి యత్నిస్తున్నారు. దాంట్లో భాగమే తాజా ఆయన చెప్తున్న నీతి ఆయోగ్ నివేదిక. అసలు నీతి ఆయోగ్ పేరుమీద చంద్రబాబు విడుదలచేసిన రిపోర్టును చూస్తుంటే… చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఒక రాష్ట్రం ఆర్థిక పనితీరు చెప్పాలంటే,  ఒక ఏడాదికి, తర్వాత ఏడాదికి పోల్చి చూడ్డం సహజం. అంతే కాకుండా గత పదేళ్లకాలంలో ప్రగతి ఎలా ఉంది? అన్నది ఇయర్ బై ఇయర్ కూడా చూస్తారు. లేదంటో గత ఐదేళ్లతో, తర్వాత ఐదేళ్లతో పోల్చి చూస్తారు. సహజంగా ఎవరైనా చేసే పని ఇది.     అలాగే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రభుత్వ పనితీరును ఆయన పనిచేసిన ఐదేళ్లకాలానికి, అంతకుముందు నాయకుడు పనిచేసిన ఐదేళ్లకాలానికి పోల్చిచూస్తారు. ఇద్దరి నాయకుల మధ్య తేడా ఏంటి? ఎవరి పనితీరు ఎలా ఉందో చూస్తారు. పోల్చే విషయంలో సహజంగా పాటించే విధానం ఇది. కాని చంద్రబాబు నాయుడు చూపుతున్న నీతి ఆయోగ్ నివేదికలో చంద్రబాబు దిగిపోయిన 2018-19 ఆర్థిక సంవత్సరంతో, వైయస్ జగన్ గారు పరిపాలించిన ఐదేళ్లకాలంలోని 2022-23 సంవత్సరంతో పోల్చి చూస్తున్నారు. రెండు పరిపాలనా కాలంలో ఎంపికచేసుకున్న రెండు సంవత్సరాల మధ్య పోలిక చూడటం అనే కొత్త పద్దతిని చంద్రబాబు మాత్రమే సిగ్గు లేకుండా ప్రవేశపెట్టారు. 

మూలధన వ్యయంపైనా అవాస్తవాలు
 
చంద్రబాబు గత పరిపాలనా కాలం అంటే 2014-19 మధ్య  కోవిడ్ లాంటి సంక్షోభం ఏమీ లేదు. కాని జగన్మోహన్ రెడ్డిగారి హయాంలో రెండున్నరేళ్లపాటు కోవిడ్ ప్రపంచంమీద దాడిచేసింది. మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంక్షోభాన్ని తీసుకు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉత్పత్తి లేదు, చేసిన వాటిని ఎగుమతి చేసే వీలులేదు, పంపిణీ వ్యవస్థలు లేవు. 2020లో మొదటి వేవ్, 2021లో రెండో వేవ్, 2023లో మూడో వేవ్ ఇలా ఆ రెండున్నర సంవత్సరాలు కూడా కోవిడ్ ప్రపంచంమీద దాడి చేసింది. ఇంతటి సంక్షోభం ఉన్నా  దాన్ని ఎదుర్కొంటూ జగన్ గారు మెరుగైన పనితీరు చూపించారు. వాస్తవంగా నీతి ఆయోగ్ రిపోర్టును చూస్తే కేవలం జగన్ గారి హయాంలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ బాగోలేదని, 13వ స్థానానికి దిగిపోయామని చెప్పారు. అదే నీతి ఆయోగ్ రిపోర్టులో కూడా కోవిడ్ లేని సమయంలో చంద్రబాబుగారి హయాంలో కూడా రాష్ట్రం ర్యాంకు 13 కాగా, ఆ తర్వాత కోవిడ్ లాంటి సంక్షోభం ఎదుర్కొన్న జగన్ గారి ప్రభుత్వంలో కూడా  రాష్ట్రం ర్యాంకు 13వ స్థానమే. చంద్రబాబు మూలధన వ్యవయం మీద కూడా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. 2014-19 మధ్య కాలంలో, చంద్రబాబుగారి గడచిన ఐదేళ్లలో మూల ధన వ్యయం కింద సగటున ఏడాది రూ.13,860 కోట్లు ఖర్చుపెడితే,  జగన్ గారి హయాంలో కోవిడ్ లాంటి విపత్తు ఉన్నా సరే 2019-24 మధ్య సగటున ఏడాదికి రూ. 15,632 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కాగ్ ఇచ్చిన లెక్కులు.  మరి ఎవరు ఆర్థిక అరాచకవాదో ప్రజలు అర్థం చేసుకుంటారు. 
  
చంద్రబాబు హయాంలో క్షీణించిన రుణాల లభ్యతలో స్థిరత్వం

2024-25 అంటే నడుస్తున్న ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలలకాలంలో తెచ్చిన అప్పులు వారి లెక్కల ప్రకారమే రూ.73,635కోట్లు కాగా, అందులో మూలధన వ్యయం కింద పెట్టిన ఖర్చు కేవలం రూ.8894.98 కోట్లు మాత్రమే. కోవిడ్ లాంటి విపత్తు ఉన్నప్పుడు జగన్ గారి హయాంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంటే 12 నెలల కాలంలో రూ. 67,985 కోట్లు అప్పులు తెస్తే, అందులో సుమారుగా రూ.7300 కోట్లు మూలధన వ్యయం చేశారు. ఒక విపత్తు నడుస్తున్న సమయంలో, ఏ పనులు కూడా నడవని సమయంలో చేసిన ఖర్చు ఇది. మరి ఎవరు ఆర్థిక అరాచకవాది? ఒక రాష్ట్రం తానుచేసిన అప్పులు మీద చెల్లించే వడ్డీల వృద్ధిరేటు, జీఎస్డీపీ వృద్ధిరేటు కన్నా అధికంగా ఉంటే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించినట్టేనని గొప్ప ఆర్థిక నిపుణుడుగా, విజనరీగా తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు కొత్త నిర్వచనం చెప్పారు. 2013-14లో విభజిత రాష్ట్రం జీఎస్డీపీ రూ.4,64,272 కోట్లు అయితే, వడ్డీ చెల్లింపులు రూ.7,488 కోట్లు. అదే 2018-19లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,73,721 కోట్లు అయితే, వడ్డీల కింద చెల్లింపులు రూ.15,342 కోట్లు. అప్పులపై కట్టే వడ్డీ వృద్ధిరేటు 15.42% కాగా, GSDP వృద్ధిరేటు 13.48%. అంటే చంద్రబాబు తాజాగా చెప్పిన నిర్వచనం ప్రకారం చేస్తే మీ పాలనలోనే రుణాల లభ్యతలో స్థిరత్వం పూర్తిగా క్షీణించిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇంత దారుణమైన పాలన అందించిన చంద్రబాబును ఆర్థిక అరాచకవాది అనడం తప్పవుతుందా?  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూటకో మాట

ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అప్పులుమీద కూడా చంద్రబాబు చేస్తున్న డ్రామాలు, గిమ్మిక్కులు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అప్పులు మీద ఇలాంటి ప్రచారం చేశాడు. కాని అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయాడు. 05.04.2022న రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ చంద్రబాబు ప్రకటన చేశారు. 17.05.2022న శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలో’.. అని చంద్రబాబు పార్ట్ నర్  పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. 07.04.2024న రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్లు అని చంద్రబాబు గారి వదినమ్మ పురంధీశ్వరి గారు ప్రకటించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశారు. 21.04.2024న ఎన్నికలకు కొన్నాళ్ల ముందు చంద్రబాబుకు వంతపాడే ఈనాడు దినపత్రిక ఒకాయనను పట్టుకొచ్చి, ఆయన ఆర్థిక నిపుణుడు అని ప్రకటించి ఆయనతో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని చెప్పించారు. 

అప్పుల లెక్కలపై తన మాటలపైనే చంద్రబాబుకు నిలకడలేదు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన, అప్పుల పైన ఇంత దారుణంగా ప్రచారంచేసిన చంద్రబాబు మే 29, 2023న రాజమండ్రిలో సూపర్ సిక్స్ అంటూ హామీలను ప్రకటించారు. తర్వాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలను మోసం చేయడానికి డబ్బుల్లేవు, కొండల్లా అప్పులున్నాయి, చూస్తే భయమేస్తోందని కథలు చెప్పడం ప్రారంభించాడు. జూలై 10, 2024న ఆర్థికశాఖ పై రివ్యూ చేస్తూ.. రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని లీక్  చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 2024న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ అప్పులు ఉన్నాయని చెప్పించారు. అదే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదలచేస్తూ రాష్ట్రం అప్పులు రూ.12,93,261 కోట్లు ఇది ఆర్ధిక విధ్వంసం అంటూ కొత్త లెక్కలు చెప్పారు. చివరకు అప్పులు మీద తాను చెప్పిన అంకెలు నిజం అని నిరూపించేందుకు చివరకు బడ్జెట్ను కూడా వాయిదా వేశాడు. నవంబర్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అప్పులు రూ.4,91,734 కోట్లు అనిమాత్రమే చూపించాడు.ప్రభుత్వ గ్యారెంటీలకు చెందిన అప్పులు రూ.1,54,797 కోట్లు అంటే ఇవి రెండూ కలిపితే రూ.6,46,531 కోట్లు. అంటే చంద్రబాబు గతంలో అప్పులపై చేసిన ప్రకటనలు అన్నీ అబద్దాలే అని స్పష్టం అయ్యింది. బడ్జెట్ సాక్షిగా చెప్పిన లెక్కలను కూడా కాదంటూ ఇప్పుడు చంద్రబాబు నేటి వరకు మొత్తం అప్పులు రూ.9.75 లక్షల కోట్లు మరో కొత్త లెక్క చెబుతున్నాడు. ఒక్క మాట మీదైనా చంద్రబాబుకు నిలకడ ఉందా? పోనీ చంద్రబాబు అప్పులు తీసుకు రావడంలేదా? అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడు. ఈ తొమ్మిది నెలల కాలంలో అన్నిరకాల అప్పులు కలిపి సుమారు రూ.1.19 లక్షల కోట్లు తెచ్చాడు. వాస్తవం ఏంటంటే.. అప్పులు ఎంత కావాలంటే, అంత తీసుకోవడానికి అనుమతి ఉండదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా అప్పులు తేవాలంటే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందే.  చట్టం అనుమతించిన ప్రకారం ఆ రాష్ట్ర జీఎస్డీపీలో 3 శాతం నుంచి 3.5 శాతం వరకూ మాత్రమే అప్పులు తేవడానికి ఆస్కారం ఉంటుంది. కాని చంద్రబాబు గిమ్మిక్కులు చేసి ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు. ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెప్పి హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024