Brahmamudi January 29th Episode:కావ్య ప్ర‌శ్న‌ల‌కు లాయ‌ర్ ప‌రార్ -ఆస్తి అక్క‌ర‌లేద‌న్న క‌ళ్యాణ్ -రుద్రాణి ఆశ‌లు గ‌ల్లంతు

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 29th Episode:కావ్య ప్ర‌శ్న‌ల‌కు లాయ‌ర్ ప‌రార్ -ఆస్తి అక్క‌ర‌లేద‌న్న క‌ళ్యాణ్ -రుద్రాణి ఆశ‌లు గ‌ల్లంతు

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌లో ధాన్య‌ల‌క్ష్మి, ప్ర‌కాశం కోర్టుకు వెళితే ఇళ్లు ముక్క‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని, ఆస్తిలో త‌మ‌కు వాటా ద‌క్కుతుంద‌ని రుద్రాణి, రాహుల్ సంబ‌రంతో పార్టీ చేసుకుంటారు. ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి త‌ర‌ఫు లాయ‌ర్‌ను లా పాయింట్స్‌తో కావ్య బెద‌ర‌గొడుతుంది.

 
బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 29 ఎపిసోడ్‌

Brahmamudi: ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి ఆస్తిలో వాటాల కోసం కోర్టుకు వెళ‌తామ‌ని అన‌డంతో ఏం చేయాలో అర్థంకానీ ప‌రిస్థితుల్లో ప‌డుతుంది కావ్య‌. ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మిని కోర్టుకు వెళ్ల‌కుండా ఆప‌మ‌ని సుభాష్‌ను రిక్వెస్ట్ చేస్తుంది. చేసేది నువ్వు…ఆపేది మేమా అంటూ కావ్య‌పై ఫైర్ అవుతుంది అప‌ర్ణ‌.

నిన్ను న‌మ్మి ఆస్తి నీ చేతుల్లో పెడితే ఎవ‌రికి అడిగే హ‌క్కు లేద‌ని నోరు మూయించావు…ఇప్పుడు మేము ఏం చేయ‌లేమ‌ని వాళ్ల‌ను కోర్టుకు వెళ్ల‌కుండా ఆప‌డం క‌ష్ట‌మ‌ని అప‌ర్ణ అంటుంది. ఈ విష‌యంలో నీకు మేము సాయం చేయ‌లేమ‌ని కావ్య‌కు ఇద్ద‌రు చెప్పేస్తారు.

రాజ్ టెన్ష‌న్‌…

ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి కోర్టుకు వెళుతున్నార‌ని తెలిసి రాజ్ టెన్ష‌న్ ప‌డుతుంటాడు. వాళ్ల‌ను ఎలా ఆపాలో తెలియ‌డం లేద‌ని కావ్య‌తో అంటాడు. రుద్రాణి అత్త ఈ డ్రామా ఆడిస్తుంద‌ని అర్థ‌మైపోతుంద‌ని ఫైర్ అవుతాడు.ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి కోర్టుకు వెళితే వంద కోట్లు అప్పు తీర్చ‌లేం… బిజినెస్ చేయ‌లేం… కుటుంబం రోడ్డు ప‌డుతుంద‌ని రాజ్ భ‌య‌ప‌డిపోతాడు.

రుద్రాణి, రాహుల్ పార్టీ…

త‌మ ప్లాన్ స‌క్సెస్ కావ‌డంతో రుద్రాణి, రాహుల్ పార్టీ చేసుకుంటారు. ఆనందం ప‌ట్ట‌లేక డ్యాన్సు చేస్తుంటారు. ప్ర‌కాశం, ధాన్య‌ల‌క్ష్మి కోర్టుకు వెళ్ల‌కుండా ఆప‌డం కావ్య వ‌ల్ల కాద‌ని అనుకుంటారు. స‌డెన్‌గా వాళ్ల మ‌ధ్య‌లోకి డ్యాన్స్ చేసుకుంటూ స్వ‌ప్న ఎంట్రీ ఇస్తుంది.

అప్పుడే ఆస్తి ముక్క‌లు చేసి… మీ వాటా మీ చేతికి వ‌చ్చిన‌ట్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారేంటి అని రుద్రాణిని అడుగుతుంది స్వ‌ప్న‌. కోర్టు నోటీసులు వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగేది అదే క‌దా అని రుద్రాణి బ‌దులిస్తుంది. నోటీసుల‌తోనే అంత అయిపోద‌ని, కోర్టుకు వెళ్లాలి…ఆస్తిలో వాటా ఉంద‌ని మీరు నిరూపించుకోవాలి…అదంతా జ‌ర‌గ‌ద‌ని స్వ‌ప్న అంటుంది.

 

ఇంటిని ముక్క‌లు చేయాలి…

కావ్య ఎలాంటిదో ఇంట్లో అంద‌రికి తెలిసిపోయింద‌ని, ఇంకా నీ చెల్లెలిని స‌పోర్ట్ చేయ‌కు అని స్వ‌ప్న‌తో వెట‌కారంగా రుద్రాణి అంటుంది. ఇంటిని ముక్క‌లు చేయాలి, మ‌నుషుల్ని విడ‌గొట్టాల‌ని ఆలోచించే నీ లాంటి నీచుల‌కు మాత్రం స‌పోర్ట్ చేయ‌న‌ని స్వ‌ప్న కోపంగా అంటుంది. మా నాన్న ఆస్తి రాసివ్వ‌గానే స‌డెన్‌గా మంచిదానిలా మారిపోయిన నువ్వు మాకు నీతులు చెబుతున్నావా అంటూ స్వ‌ప్న మాట‌ల్ని రుద్రాణి కొట్టిప‌డేస్తుంది.

కావ్య గొప్ప‌త‌నం…

ఆస్తి వ‌చ్చిన త‌ర్వాత తాను మార‌లేద‌ని, కావ్య గొప్ప‌త‌నం చూసి మారిపోయాన‌ని స్వ‌ప్న అంటుంది. మా నాన్న కావ్య పేరిట ఆస్తి రాసిన‌ప్పుడే నీ ఆస్తిపై కూడా హ‌క్కు కూడా మీ చెల్లికే వెళ్లింద‌ని, త‌ను త‌లుచుకుంటే నీ ఆస్తిని క్ష‌ణాల్లో కావ్య అమ్మ‌గ‌ల‌ద‌ని స్వ‌ప్న‌ను ట్రాప్‌లో ప‌డేసేలా మాట్లాడుతుంది రుద్రాణి. అయినా కూడా కావ్య‌కే నా స‌పోర్ట్ అని స్వ‌ప్న అంటుంది.

ఆట‌లు సాగ‌వు…

కావ్య ఉండ‌గా కోర్టుకు వెళ్లి కోట్లు సంపాదించాల‌నే మీ ఆట‌లు సాగ‌వ‌ని రుద్రాణితో అంటుంది స్వ‌ప్న‌. నా చెల్లెలు గురించి తెలిసి క‌ల‌లు క‌న‌కు అని అత్త‌కు వార్నింగ్ ఇస్తుంది. కావ్య‌ను నువ్వు ఇంట్లో నుంచి పంపిచేస్తే కంపెనీకి సీఈవో అయ్యింది.

 

ఆఫీస్ నుంచి వెళ్ల‌గొడితే…తాత‌య్య ఆస్తి మొత్తం కావ్య పేరు మీద రాశాడ‌ని స్వ‌ప్న అంటుంది. కావ్య ఉండ‌గా మీరు గెల‌వ‌డం కాదు క‌దా…క‌నీసం కోర్టు మెట్లు కూడా ఎక్క‌లేర‌ని రుద్రాణితో ఛాలెంజ్ చేసి వెళ్లిపోతుంది స్వ‌ప్న‌. కావ్య ఎన్ని ప్లాన్స్ వేసినా ఈ సారి గెల‌వ‌డం అసాధ్య‌మ‌ని రుద్రాణి అనుకుంటుంది.

ప్ర‌కాశం ఎమోష‌న‌ల్‌…

కోర్టు నోటీసులు ఇచ్చి త‌ల్లితో పాటు ఇంట్లో వాళ్ల‌ను బాధ‌పెట్టిన సంగ‌తి గుర్తొచ్చి ప్ర‌కాశం ఎమోష‌న‌ల్ అవుతాడు. మ‌నం చేసిన ప‌ని క‌రెక్ట్ కాద‌ని, కోర్టు వ‌ర‌కు వెళ్లి నేనే మ‌న ఇంటి ప‌రువు తీస్తున్నానేమో అనిపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మితో అంటాడు. కోర్టులో ఈ ఇంటి మ‌నుషుల‌తో గొడ‌వ ప‌డ‌టం త‌ప్పుగా అనిపిస్తుంద‌ని ప్ర‌కాశం వాపోతాడు.

త‌ప్పైనా త‌ప్ప‌ద‌ని, ఎవ‌రి వాటాలు వాళ్ల‌కు వ‌స్తాయ‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. ఆస్తి మాత్ర‌మే కాదు..మ‌నుసులు కూడా ముక్క‌ల‌వుతాయ‌ని ప్ర‌కాశం ఎంత చెప్పిన ధాన్య‌ల‌క్ష్మి విన‌దు. క‌ళ్యాణ్‌కు న్యాయం చేసేందుకే కోర్టుకు వెళుతున్నాన‌ని, ఎవ‌రు బాధ‌ప‌డిన తాను ప‌ట్టించుకోన‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది.

లాయ‌ర్ ఎంట్రీ…

ధాన్య‌ల‌క్ష్మి త‌ర‌ఫున వాదించే లాయ‌ర్ ఇంటికొస్తాడు. చివ‌రి నిమిషంలో ప్ర‌కాశానికి స‌ర్ధిచెప్పేందుకు ఇందిరాదేవితో పాటు సుభాష్, అప‌ర్ణ ప్ర‌య‌త్నిస్తారు. నువ్వు కోర్టుకు వెళితే మ‌న కుటుంబం రోడ్డున ప‌డుతుంద‌ని సుభాష్ అంటాడు.

 

కోర్టుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకొని మంచి ప‌ని చేశార‌ని కావ్య అంటుంది. ఆమె మాట‌ల‌తో అంద‌రూ షాక‌వుతారు. న్యాయాన్ని నిల‌బెట్టి, అన్యాయాన్ని ఎదురించి ఆధ‌ర్మాన్ని ఎదురించ‌డానికి మీరు కోర్టుకు వెళ్ల‌డంలో త‌ప్పు లేద‌ని అంటుంది.

మ‌న‌వ‌ల‌కే ఆస్తి…

ఓ ఇంటి య‌జ‌మాని ఆస్తి కొడుకుల‌కు చెందుతుందా…మ‌న‌వ‌ల‌కు చెందుతుందా అని ధాన్య‌ల‌క్ష్మి లాయ‌ర్‌ను కావ్య అడుగుతుంది. మ‌న‌వ‌లు ఉంటే వారికే చెందుతుంద‌ని లాయ‌ర్ అంటాడు. మ‌రి ఈ ఇంటి య‌జ‌మాని కొడుకు, కోడ‌లు త‌ర‌ఫున కేసు వేయ‌డానికి ఎ లా వ‌చ్చార‌ని లాయ‌ర్‌ను అడుగుతుంది.

మా అబ్బాయి క‌ళ్యాణ్ త‌ర‌ఫున కేసు మేము వేశామ‌ని కోపంగా ధాన్య‌ల‌క్ష్మి. అలా ఎలా కేసు వేస్తార‌ని ధాన్య‌ల‌క్ష్మిపై లాయ‌ర్ ఫైర్ అవుతాడు. క‌ళ్యాణ్ కాకుండా మీరు కేసు వేస్తే గెల‌వ‌లేర‌ని లాయ‌ర్ అంటాడు.కావ్య లా పాయింట్స్‌కు రుద్రాణి షాక‌వుతుంది.

నా అనుమ‌తి లేకుండా…

మా ఆయ‌న కేసు వేయ‌డం వీలు కాక‌పోతే నా కొడుకు క‌ళ్యాణ్‌తో కేసు వేయిస్తాన‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. నా ఇష్టం, అనుమ‌తితో ప‌నిలేకుండా కేసు ఎలా వేస్తార‌ని అప్పుడే అక్క‌డికి ఎంట్రీ ఇచ్చిన క‌ళ్యాణ్ అంటాడు. నేను కేసు వేయ‌ను, నాకు ఈ ఆస్తి అక్క‌ర‌లేద‌ని లాయ‌ర్‌తో చెబుతాడు.

 

నీ కోసం ఇంట్లో అంద‌రితో గొడ‌వ‌లు ప‌డి కోర్టుకు వెళ్లాల‌ని అనుకుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ‌ని కొడుకుతో అంటుంది ధాన్య‌ల‌క్ష్మి. మీ నాన్న కూడా కోర్టుకు వెళ్ల‌డానికి ఒప్పుకున్నాడ‌ని అంటుంది.

తండ్రి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఏంటింది నాన్న అని ప్ర‌కాశాన్ని అడుగుతాడు క‌ళ్యాణ్‌. త‌ప్ప‌లేదు…త‌ప్పించుకోలేక‌పోయాన‌ని ప్ర‌కాశం అంటాడు. నాన్న‌ను బెదిరించి భ‌య‌పెట్టి ఒప్పించావ‌ని అర్థ‌మైపోయింద‌ని త‌ల్లిపై కోప్ప‌డుతాడు క‌ళ్యాణ్. ఆస్తి కోసం ఎందుకు నీకు ఇంత తాప‌త్ర‌యం అని అడుగుతాడు.

ఆత్మీయ‌త‌, అనుబంధాలు…

ఆస్తి ఉంటే కాలు మీద కాలు వేసుకొని ద‌ర్జాగా బ‌త‌కొచ్చ‌ని, క‌ష్టాలు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ధాన్య‌ల‌క్ష్మి అంటుంది. ఈ రోజు ఉండి రేపు పోయే ఆస్తులు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని క‌ళ్యాణ్ అంటాడు. ఆత్మీయ‌త‌, అనుబంధాలు, ర‌క్త సంబంధం నిల‌బ‌డాల‌ని క‌ళ్యాణ్ అంటాడు.

త‌త్వాలు క‌డుపు నింప‌వు…

నీ త‌త్వాలు క‌డుపునింప‌వ‌ని రుద్రాణి అంటుంది. నీలాంటి మ‌న‌స్త‌త్వం నాది కాద‌ని క‌ళ్యాణ్ బ‌దులిస్తాడు. ఎవ‌రు అడిగారు ఆస్తి…నేను అడిగానా…నాకు రాసివ్వ‌మ‌ని అడిగానా…నా త‌ర‌ఫున పోరాడి నా వ్య‌క్తిత్వాన్ని దిగ‌జార్చే హ‌క్కు త‌ల్లికి లేద‌ని, ఇంత గొప్ప కుటుంబానికి న‌న్ను మాన‌సికంగా దూరం చేసే హ‌క్కు తండ్రికి లేద‌ని క‌ళ్యాణ్ ఫైర్ అవుతాడు. కావ్య, రాజ్ క‌లిసి విదేశాల‌కు వెళుతున్నార‌ని రుద్రాణి క‌నిపెడుతుంది. ఆ సీక్రెట్‌ను ధాన్య‌ల‌క్ష్మితో చెబుతుంది. ఇద్ద‌రు క‌లిసి కొత్త గొడ‌వ‌కు తెర లేపుతారు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024