Best Web Hosting Provider In India 2024
Romantic Thriller OTT: ఓటీటీలోకి మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ – వెరైటీ కాన్సెప్ట్ మూవీని ఎందులో చూడాలంటే?
OTT: మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒరు కట్టిల్ ఒరు మురి మనోరమా మ్యాక్ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను త్వరలో అనౌన్స్‌చేస్తామని ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. ఈ మలయాళం మూవీలో పూర్ణిమ ఇంద్రజీత్, హకీష్ షా, ప్రియంవద కీలక పాత్రలు పోషించారు.
మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఒరు కట్టిల్ ఒరు మురి థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను మనోరమా మ్యాక్స్ ఓటీటీ సొంతం చేసుకున్నది. త్వరలోనే ఒరు కట్టిల్ ఒరు మురి రిలీజ్ కానున్నట్లు మనోరమా మ్యాక్స్ ప్రకటించింది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.
రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ…
ఒరు కట్టిల్ ఒరు మురి సినిమాకు శన్వాస్ కే భవకుట్టి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూర్ణిమ ఇంద్రజీత్, హకీమ్ షా, ప్రియంవద కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నా స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజింగ్గా సాగడం, డ్రామా అనుకున్న స్థాయిలో పండటకపోవడంతో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
మంచం నేపథ్యంలో…
ఓ పాత కాలం నాటి మంచం నేపథ్యంలో దర్శకుడు శన్వాస్ ఈ కథను రాసుకున్నారు. ఆ మంచంతో ముడిపడి ఉన్న ముగ్గురి జీవితాల చుట్టూ ఈ సినిమాను నడిపించారు.
రుగ్మాంగదన్ క్యాబ్ డ్రైవర్. గతం జీవితానికి స్వస్తి చెప్పి బతుకుతెరువు కోసం సిటీకి వస్తాడు. కానీ కొందరు రౌడీలు మాత్రం అతడిని వెంటాడుతుంటారు. రుగ్మాంగదన్పై ఎటాక్ చేసేందుకు రౌడీలు ప్లాన్ చేస్తారు. వారి బారి నుంచి రుగ్మాంగదన్ ఎలా తప్పించుకున్నాడు అన్నది ఓ కథ.
అక్కమ్మ భర్త చనిపోతాడు. అతడి జ్ఞాపకాలతోనే బతుకుతుంటుంది. తమిళ అమ్మాయి అయిన అక్కమ్మ మలయాళీని ఎందుకు పెళ్లిచేసుకుంది? ఆమె భర్త ఎలా చనిపోయాడు అన్నది మరో కథ.
మధు చదువు పూర్తిచేసుకుంటుంది. ఉద్యోగం కోసం సిటీకి వచ్చిన మధు అక్కమ్మ ఇంట్లో ఉంటుంది. తండ్రితో మధుకు విభేదాలు ఉంటాయి. కుటుంబం కోసం మధు ఏం చేసింది అన్నది మూడో కథ.
ఈ ముగ్గురు వ్యక్తులకు పాతకాలం నాటి మంచంతో ఎలాంటి అటాచ్మెంట్ ఉందనే పాయింట్‌తో ఈ సినిమా సాగుతుంది.
మిలియన్ వ్యూస్…
ఒరు కట్టిల్ ఒరు మురు మూవీ ట్రైలర్ మలయాళంలో మిలియన్‌కుపైగా వ్యూస్ సొంతం చేసుకున్నది. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచిన కంటెంట్ వీక్ కావడంతో కమర్షియల్‌గా మూవీ సక్సెస్‌గా నిలవలేకపోయింది. యాక్టర్ ఇంద్రజీత్ సుకుమారన్ భార్య అయినా పూర్ణిమ మలయాళంలో ఇరవైకిపైగా సినిమాలు చేసింది.