Brahmamudi January 31st Episode అమెరికాకు రాజ్, కావ్య- ఇగోతో కోటిన్నర లాభం- రాహుల్ రుద్రాణిని దెబ్బకు దెబ్బ తీసిన స్వప్న

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 31st Episode అమెరికాకు రాజ్, కావ్య- ఇగోతో కోటిన్నర లాభం- రాహుల్ రుద్రాణిని దెబ్బకు దెబ్బ తీసిన స్వప్న

Sanjiv Kumar HT Telugu
Jan 31, 2025 07:42 AM IST

Brahmamudi Serial January 31st Episode: బ్రహ్మముడి జనవరి 31 ఎపిసోడ్‌లో కావ్య డిజైన్ చేసిన స్పెషల్ నెక్లెస్‌ను తన ఇగో, తెలివితో వేలంలో రూ. 1.80 కోట్లకు అమ్ముడుపోయేలా చేస్తాడు రాజ్. అలా కోటిన్నర లాభం వస్తుంది. ఆ డిజైన్ అమెరికా క్లైంట్స్‌కు నచ్చడంతో రాజ్, కావ్య అమెరికా వెళ్లాలని సూరజ్ చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 31వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 31వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డిజైనర్స్ కంటే బిజినెస్ మ్యాన్ గొప్ప అని కస్టమర్స్‌తో చెప్పిస్తా అని రాజ్ అంటాడు. తర్వాత కావ్య డిజైన్స్ ఫొటో తీసి ఎవరికో పంపిస్తాడు. దాంతో దీన్ని ఎంతకు అమ్మొచ్చు. ఒక పాతిక లక్షలు అని కావ్య అంటుంది. నువ్ అలాగే చూస్తూ ఉండు ఒక బిజినెస్ మ్యాన్‌గా దీని వాల్యూ ఎలా పెంచుతానో చూడు అని రాజ్ అంటాడు.

yearly horoscope entry point

గ్రీన్ స్టోన్‌తో స్పెషల్‌గా

తర్వాత సూరజ్‌కు కాల్ చేసి మనం వేళంలో పెట్టిన నెక్లెస్ వ్యాల్యూ నేను చెప్పేవరకు పెంచుతూనే ఉండు అని రాజ్ చెబుతాడు. ఆక్షన్‌లో గ్రీన్ స్టోన్‌తో స్పెషల్‌గా తయారు చేసిన ఒకే ఒక్క నెక్లెస్ ఉంది. ఒక్కసారి ఇది అమ్ముడుపోతే మళ్లీ మీరు కావాలనుకున్న దొరకదు. ఎందుకంటే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ పీస్‌ ఒక్కటే రెడీ చేసింది అని రాజ్ కంపనీ అతను చెబుతాడు. కంపెనీ పాట రూ. 30 లక్షలు అని అతను చెబుతాడు.

తన మనిషి సూరజ్‌తో రూ. 50 లక్షలు అని చెప్పిస్తాడు రాజ్. అందరూ పెంచుతారు. దాంతో కోటి రూపాయలకు పెంచిపిస్తాడు రాజ్. అదంతా ల్యాప్‌ట్యాప్‌లో చూసిన కావ్య ఇప్పటికే 70 లక్షలు ఎక్కువ పాడాం అని అంటుంది. కానీ, రాజ్ వినడు. యూనిక్ పీస్‌లు ఇలాగే సేల్ అవుతాయని కోటి రూపాయలు అంటాడు రాజ్. అప్పుడు కూడా ఇంకా పాట పాడుతూనే ఉంటారు. కోటి 80 లక్షలకు పలుకుతారు. రెండు కోట్లకు పాడనా అని సూరజ్ అంటే.. వద్దులే ఇక్కడితో ఆపేద్దాం అని రాజ్ అంటాడు.

దాంతో కోటి 80 లక్షలకు రాజ్ కంపెనీ నెక్లెస్ శిరీష్‌కు సేల్ అవుతుంది. వేళం ముగుస్తుంది. దాంతో కావ్య బిత్తరపోతుంది. నువ్ ఊహించింది ఎంత. వచ్చింది ఎంత. సో నువ్ ఎంత కష్టపడి డిజైన్స్ వేశావో అన్నది సెల్లింగ్ పాయింటా. దాని గురించి గొప్పగా చెప్పి అనుకున్న దానికంటే ఎక్కువ ధర తెప్పించినా నేను గొప్ప అని రాజ్ అంటాడు. మహాప్రభో మీరే గొప్ప. మీ ఇగో వల్ల కోటి 80 లక్షలు వచ్చాయి. ఒక ఈఎమ్ఐ కట్టుకోవచ్చు అని కావ్య అంటుంది.

స్వప్నను అడుక్కున్న రుద్రాణి

దానికి రాజ్ షాక్ అయి చూస్తాడు. మరోవైపు స్వప్న తను అద్దెకు ఇచ్చినవాళ్లతో రెంట్ ఇక్కడ ఇవ్వలేదని అడుగుతుంటుంది. ఆ మాటలు చాటుగా రుద్రాణి, రాహుల్ వింటుంటారు. రెంట్ అతను రెండు లక్షలు ఆల్రెడీ సెండ్ చేశాను అని చెబుతాడు. దాంతో ఒకే. ఇంకెప్పుడు లేట్ చేయకండి అని స్వప్న అంటుంది. మనకు డబ్బులకు కష్టమవుతుంటే ఇది మన నాన్న ఇచ్చిన ఆస్తితో ప్రతి నెల రెండు లక్షలు సంపాదిస్తుంది అని రుద్రాణి అంటుంది.

రేపు మనం క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి కదా. దీని దగ్గర ట్రై చేద్దామా అని రాహుల్ అంటే వెళ్లి జ్యూస్ రెడీ చేస్తుంది రుద్రాణి. జ్యూస్‌తో కాకా పట్టాలని చూస్తుంది రుద్రాణి. మీ మనసులో ఏం పుట్టిందో చెప్పండి అని స్వప్న అంటుంది. నీకు రెండు లక్షలు వచ్చాయి కదా. 40 వేలు ఇస్తే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేసి అలా ఇస్తాం అని రుద్రాణి అంటుంది. ఎలా ఇస్తారు. మీరిద్దరు జులాయిగా తిరుగుతారు కదా. అయినా కావ్య కార్డ్స్ అన్ని బ్లాక్ చేసింది కదా అని స్వప్న అంటుంది.

నా దగ్గర పర్సనల్‌గా ఒకటి ఉంది. అది ఎవరికి తెలియదు అని రుద్రాణి అంటే.. మీరు కూడా ఎవరికి తెలియకుండా బిల్ కట్టేయండి. లేకపోతే ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. తేడా వస్తే మిమ్మల్ని కొట్టుకుంటు లాక్కెళ్తారు బ్యాంక్ వాళ్లు అని స్వప్న వెళ్లిపోతుంది. రుద్రాణి పొగరుగా అడిగితే.. పంచ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఎలాగైనా దీని పొగరు అణచాలి అని రుద్రాణి అంటుంది. రెండు లక్షలు వచ్చినందుకేగా. అవి కొట్టేస్తే నెలంతా మనలాగే ఉంటుంది కదా అని రాహుల్ అంటాడు.

స్వప్న డబ్బులు మాయం

దానికి తెలియకుండా ఎలా కొట్టేస్తావ్ అని రుద్రాణి అంటుంది. దొంగలకు తెలియని దారులా. ఇప్పుడు దానికి పది కోట్లు గెలిచినట్లు లింక్ పంపిస్తాను. అది గనుక క్లిక్ చేస్తే దాని అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ మన అకౌంట్‌లోకి వస్తాయని రాహుల్ చెప్పి లింక్ పంపిస్తాడు. ఆ లింక్ చూసి ఆనందంతో ఆశ్చర్యపోతుంది స్వప్న. ఇదేంటో ఇప్పుడే చూడాలి అని లింక్ ఓపెన్ చేస్తుంది. దాంతో రాహుల్ అకౌంట్‌లోకి స్వప్న డబ్బులు వస్తాయి.

చూశావా మమ్మీ పదికోట్లు అనగానే కక్కుర్తి పడి లింక్ క్లిక్ చేసింది. ఇప్పుడు డబ్బులు మనకు వచ్చేశాయి అని రాహుల్ అంటాడు. ఇంతలో రెండు లక్షలు కట్ అయిపోయాయని రాహుల్‌కు వచ్చి చెబుతుంది స్వప్న. అడ్డమైన లింక్‌లన్నీ క్లిక్ చేయొద్దు. స్కామర్స్ ఎక్కువైపోయారు. కనీసం ఇప్పుడైన జాగ్రత్తగా ఉండు అని రాహుల్ చెప్పి వెళ్లిపోతాడు. దాని పొగరు భలే అణిచావరా. ఇప్పుడు రెండు లక్షలు పోయాయని ఏడుస్తూ ఉంటుందని రుద్రాణి అంటుంది.

నేను లింక్ క్లిక్ చేసినట్లు చెప్పలేదా. మరి రాహుల్‌కు ఎలా తెలిసింది. అంటే తల్లీకొడుకులు ఇద్దరు కలిసే నా దగ్గర డబ్బులు కొట్టేశారా. చెబుతా మీ సంగతి అని స్వప్న అనుమానించి అనుకుంటుంది. మరోవైపు రాజ్ ఫ్రెండ్ సూరజ్ వస్తాడు. గుడ్ న్యూస్‌తో వచ్చాని చెబితే రాజ్ ఆశ్చర్యపోతాడు. మీ డిజైన్స్ అమెరికా క్లైంట్స్‌కు బాగా నచ్చాయి. మీరు అమెరికా వెళ్లి డెమో ఇస్తే కాంట్రాక్ట్ ఓకే చేసుకోవచ్చు అని సూరజ్ అంటాడు.

వడ్డీకి రెండు లక్షలు

వీడొక్కడే కాదు మీరు కూడా వెళ్లాలి అని సూరజ్ అంటే.. కావ్య చాలా షాక్ అవుతుంది. త్వరగా వీసా పని పూర్తి చేసుకోండి. ఒక నెలలో వెళ్లాల్సి వస్తుంది అని సూరజ్ చెప్పి వెళ్లిపోతాడు. సూరజ్ వెళ్లగానే డోర్ వేసిన కావ్య సంతోషంగా డ్యాన్స్ వేస్తుంది. అది చూస్ రాజ్ షాక్ అవుతాడు. ఇది ఆఫీసే అని ఆపుతాడు. మనం అమెరికా వెళ్తున్నాం కదా. నన్నెవరు ఆపలేరు అని కావ్య అంటుంది. తర్వాత ఆగిన కావ్య అమెరికా రావాలంటే ఇంగ్లీష్ రావాలి కదా అని కావ్య అంటుంది.

పాస్‌పోర్ట్ కూడా కావాలి. నేను చూసుకుంటా. నా పక్కన ఉండి ఫైల్స్ క్యారీ చేయు చాలు అని రాజ్ అంటాడు. ఇంట్లో అన్ని బాధ్యతలు నేనే మోసి. అక్కడ కూడా ఫైల్స్ మోసి ఏంటీ నాకు ఈ గాడిద చాకిరీ. ఇంగ్లీష్ నేర్చుకుని చూపిస్తా అని కావ్య అనుకుంటుంది. మరోవైపు రుద్రాణితో రాహుల్ మాట్లాడుతాడు. నా ఫ్రెండ్‌తో మాట్లాడా రెండు లక్షలు ఇచ్చాడని చెబుతాడు. ఆ మాటలు స్వప్న వింటుంది. తిరిగి వడ్డీతో నెల రోజుల్లో ఇవ్వాలని అని రాహుల్ అంటాడు.

నాకు తీసుకోవడమే కాని ఇవ్వడం రాదు. డబ్బులు ఇచ్చే టైమ్‌కు ఇంట్లో ఎవరినైనా బుక్ చేసి ఇస్తాలే అని రుద్రాణి అంటుంది. తర్వాత అత్తయ్య అని మర్యాదగా పిలుస్తుంది స్వప్న. దాంతో ఇద్దరూ షాక్ అవుతారు. నాకు ఒక హెల్ప్ కావాలి. నాకు ఓ 50 వేలు కావాలి. ఇప్పుడు మీకు డబ్బులు వచ్చినట్లున్నాయి కదా అని స్వప్న అడుగుతుంది. ఇప్పుడు దొరికావే. ఇందాక మమ్మల్ని అడిగావ్ కదా. నీకెక్కడిది కార్డ్ అని రుద్రాణి అంటుంది.

సీక్రెట్‌గా కార్డ్ వాడుతున్నావా

నేను కూడా పర్సనల్‌గా కార్డ్ వాడుతున్నా అని స్వప్న అంటుంది. అంటే అందరికి దగ్గరిగా ఉంటూ సీక్రెట్‌గా కార్డ్ వాడుతున్నావా అని రాహుల్ అంటాడు. రుద్రాణి డబ్బులు ఇవ్వనని చెబుతుంది. ఎవరి బిల్లులు వాళ్లే కట్టుకోవాలన్నావ్‌ కదా. కట్టుకో అని వెళ్లిపోతారు రుద్రాణి, రాహుల్. మీ దగ్గర ఉన్న నాలుగు లక్షలు నా అకౌంట్‌లోకి ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని స్వప్న రాహల్ లాగే లింక్ పంపిస్తుంది. అది చూసి చొంగకార్చుకున్న రాహుల్ లింక్ క్లిక్ చేస్తాడు.

దాంతో డబ్బులు పోతాయి. అది చూసి రాహుల్ షాక్ అవుతాడు. రుద్రాణి వస్తే డబ్బులు పోయాయని చెబుతాడు. నువ్ కూడా అడ్డమైన లింక్‌లు క్లిక్ చేశావా అని రుద్రాణి అంటే.. లేదని రాహుల్ అంటాడు. అప్పుడే వచ్చిన స్వప్న స్కామర్స్ మాకే కాదు మీకూడా ఉంటారు అని స్వప్న అంటుంది. దాంతో అనుమానపడిన రుద్రాణి, రాహుల్ మా డబ్బు ఏం చేశావే అని అడుగుతారు. నేనేం చేయలేదు. స్కామర్సే చేశారు అని స్వప్న వెళ్లిపోతుంది.

హత్య చేసినవాడి గురించి

దాని డబ్బుతోపాటు మన డబ్బు కూడా దొబ్బేసిందిరా. తెలిసినా అడగలేం. తేలు కుట్టిన దొంగలా ఉండాలి. రేపటిలోపు ఆ డబ్బు ఎలాగైనా తీసుకురా. లేకపోతే చంపేస్తా అని రుద్రాణి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్, కావ్య కారులో వస్తుంటే ఎస్సై కాల్ చేసి నందగోపాల్‌ను మర్డర్ చేసిన బైక్ అతన్ని ట్రాఫిక్ సీసీ కెమెరాలతో చూడాలి అని చెబుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024