Best Web Hosting Provider In India 2024
Budget 2025: బడ్జెట్ బ్రీఫ్‌కేసు ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది? ఎరుపు దేనికి ప్రతీక?
Budget 2025: కేంద్ర బడ్జెట్ సమర్పించేందుకు సీతారామన్ సర్వసిద్ధమయ్యారు. ఎనిమిదో సారి ఆమె ఈ బడ్జెట్ ను సమర్పించబోతున్నారు. ఆమె చేతుల్లో ఎర్రటి బ్రీఫ్ కేసు మళ్లీ దర్శనమిస్తోంది. ఇలా ఎరుపు రంగుని ఆ బ్రీఫ్ కేసు ఎందుకు ఎంపిక చేసుకున్నారు.
ఎర్రటి బ్రీఫ్ కేస్ లేదా ఫైల్ పట్టుకొని బడ్జెట్ రోజున కేంద్రమంత్రి సీతారామన్ మీడియాకు కనిపిస్తారు. అదే కేంద్ర బడ్జెట్ ఉన్న బ్రీఫ్ కేస్. దీన్ని బడ్జెట్ బండిల్ అని కూడా అంటారు. దాని కవర్ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. కేంద్ర బడ్జెట్ ఎవరు సమర్పించినా కూడా ఆ బడ్జెట్ పత్రాలు లేదా సమాచారం ఉన్న ఫైలు, బ్రీఫ్ కేసు, బండిల్ అనేవి ఎరుపు రంగులోనే ఉంటాయి. ఇలా ఎరుపు రంగులోనే ఆ బ్రీఫ్ కేసు ఉండడానికి కారణం ఏంటో తెలుసా.
ఎరుపు రంగు దేనికి ప్రతీక?
ఎరుపు రంగు కేవలం డేంజర్ అని చెప్పడానికి సూచిస్తారని అనుకుంటారు. నిజానికి ఎరుపు రంగు ఉత్సాహాన్ని, అదృష్టాన్ని, సాహసాన్ని, కొత్త జీవితాన్ని సూచిస్తుంది. మతపరమైన పండుగలలో ఎరుపు రంగుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎరుపు రంగు అనేది శక్తిని సూచిస్తుంది. ఈ రంగు శాశ్వతత్వాన్ని, పునర్జన్మను కూడా సూచిస్తుంది. అందుకే ఎరుపు రంగుకు హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఎరుపు రంగు ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతారు. సంకల్ప శక్తిని పెంచేందుకు కూడా ఎరుపు రంగు ఎంత ఉపయోగపడుతుందని అంటారు.
హిందూమతంలో ఎరుపు రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతెందుకు దేవతలకు పెట్టే బొట్టు, పుణ్యస్త్రీలు పెట్టుకునే బొట్టు కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. ఎరుపు రంగు దుర్గామాతకు, హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఇష్టమైన రంగుగా చెప్పుకుంటారు. శుభ సంకల్పాలలో కచ్చితంగా ఎరుపు రంగు తిలకం ఉండాల్సిందే. ఇది ధైర్యానికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. ఎన్నో పూజల సమయంలో దేవుడు విగ్రహం ముందు ఎరుపు రంగు వస్త్రాన్నే ఉంచుతారు. శుభకార్యాలలో కూడా ఎరుపు రంగు దుస్తులను ధరించే వారి సంఖ్య ఎక్కువ. హిందూమతంలో ఎరుపు రంగుకు ఉన్న ప్రాధాన్యత ఎంతో. వివాహ సమయంలో నూతన వధువు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అంత మంచి జరుగుతుందని నమ్ముతారు. అందుకే ఎరుపు రంగు వివాహాలకు ప్రత్యేకమైన రంగుగా మారిపోయింది.
బడ్జెట్ లో ఎరుపు రంగు ఎందుకు?
బడ్జెట్ బ్రీఫ్ కేసు లేదా బండిల్ కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కొన్నిసార్లు ఎరుపు రంగు దుస్తులతోనే బడ్జెట్ ను సమర్పించే మంత్రులు కూడా ఉన్నారు. ఇలా ఎరుపు రంగులో బండిల్ వాడడం వల్ల ప్రభుత్వం తమ ప్రజలకు శక్తివంతమైన, స్థిరత్వమైన బలం కలిగి ఉన్న పాలనను అందిస్తున్నట్టు సందేశాన్ని ఇవ్వడమే. ఎరుపు.. శక్తిని, అధికారాన్ని సూచిస్తుంది. ఇది సూర్యుడు, అగ్ని, జీవితంతో ముడిపడి ఉంటుంది. అలాగే సంపదకు, శ్రేయస్సుకు, అదృష్టానికి కూడా చిహ్నంగా అనేక సంస్కృతులలో చెబుతారు. హిందూ మతంలో కూడా ఎరుపును శుభ కరమైన రంగుగా చెబుతారు. అందుకే బడ్జెట్ సమర్పించడానికి తెచ్చే బ్రీఫ్ కేసును కూడా ఎరుపు రంగులోనే పెట్టారని ఎంతోమందికి నమ్మకం.
టాపిక్