Illu Illalu Pillalu February 1st Episode: వేదవతి ఉగ్రరూపం- నిజం తెలిసినా పట్టించుకోని రామరాజు- విశ్వను కొట్టిన భద్రావతి

Best Web Hosting Provider In India 2024

Illu Illalu Pillalu February 1st Episode: వేదవతి ఉగ్రరూపం- నిజం తెలిసినా పట్టించుకోని రామరాజు- విశ్వను కొట్టిన భద్రావతి

Illu Illalu Pillalu Serial February 1st Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 1 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను విశ్వ చంపాలని మనుషులతో అటాక్ చేయించాడని సాగర్ చెబుతాడు. దాంతో ఉగ్రరూపంతో ఊగిపోతుంది వేదవతి. వెళ్లి సేనాపతి ఫ్యామిలికీ వార్నింగ్ ఇస్తుంది. కానీ, అటాక్ గురించి తెలిసి ఏం పట్టించుకోడు రామరాజు.

 
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఫిబ్రవరి 1వ తేది ఎపిసోడ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఫిబ్రవరి 1వ తేది ఎపిసోడ్
 

Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధీరజ్‌ను ఈ దెబ్బలు ఎలా తగిలాయి అని వేదవతి అడుగుతుంది. గొంతు చించుకుని అరుస్తుంటే ఎవరు మాట్లాడరేంటీ.. ఏమైందిరా చిన్నోడా. చెప్పు అని వేదవతి అడుగుతుంది. చిన్న గొడవ జరిగిందని ధీరజ్ అంటాడు. గొడవ.. నన్ను ఎవరు కొట్టారురా అని వేదవతి అడుగుతుంది.

ఏదో దాస్తున్నారు

అదేంట్రా యాక్సిడెంట్ అని చెప్పావ్. ఇప్పుడు గొడవ అంటున్నావ్ అని మామ అడుగుతాడు. అదే మామ బైక్ యాక్సిడెంట్ చేసినవాడితో గొడవ అని ధీరజ్ అబద్ధం చెబుతాడు. అక్క వీళ్లంతా ఏదో విషయం దాస్తున్నారు. ఏదో జరిగింది. ఏదో మతలబు ఉందని మామ అంటాడు. దాంతో ప్రేమను అడుగుతుంది వేదవతి. ఏం లేదమ్మా. కంగారుపడకు అని ధీరజ్ అంటే.. ప్రాణం పోతుందిరా నాకు అని వేదవతి ఏడుస్తూ అంటుంది.

మీరు నిజం దాస్తుంటే భయంగా ఉంది. ఆ భయం పెరిగిపోతుంది అని తల పట్టుకుంటుంది. ఎవరు నా కొడుకుని ఇంతలా కొట్టింది అని అంటుంది వేదవతి. చిన్నోడి మీద మర్డర్ అటెంప్ట్ చేశారమ్మా. చంపేయాలని చూశారు వాన్ని అని సాగర్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఏంట్రా నువ్ అనేది. ఎవర్రా వాడు. వాడిని చంపాలని చూసింది ఎవరు. నా కొడుకును చంపాలన్నంత పగ ఉన్నోడు ఎవరు అని గట్టిగా అడుగుతుంది వేదవతి.

దాంతో ఎదురింటి విశ్వ గాడు అని సాగర్ చెబుతాడు. అయ్యో ఇప్పుడు ఏం జరుగుతుందో అని ప్రేమ భయపడుతుంది. సంక్రాంతి సంబురాల్లో తమ్ముడిని చంపాలను ప్రయత్నించాడు అని సాగర్ అంటాడు. నా కొడుకును చంపాలని చూస్తాడా. చెబుతా వాడి సంగతి అని సేనాపతి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది వేదవతి. దాంతో అంతా ఆపేందుకు ట్రై చేస్తారు. కానీ, వేదవతి ఆగదు. కొంగు కట్టుకుని మరి సేనాపతి ఇంటికి వెళ్తుంది వేదవతి.

 

ఒక్కొక్కరిని కొడతాను

రేయ్ సేనాపతి, భద్రావతి.. రేయ్ విశ్వ రండి బయటకు అని అరుస్తుంది వేదవతి. భయపడి లోపల దాక్కున్నారా. బయటకు రండ్రా అని అంటుంది వేదవతి. దాంతో అంతా వస్తారు. గీత దాటి రాడానికి నీకు ఎంత ధైర్యమే నీకు. లేచిపోయిన దానివి సిగ్గులేకుండా వచ్చి రేయ్ అని మాట్లాడుతున్నావ్ అని భద్రావతి అంటుంది. మాట్లాడుతాను. మాట్లాడటమే కాదు. నా కొడుకుపై చేయి చేసుకున్నందుకు ఒక్కొక్కరిని కొడతాను కూడా అని వేదవతి అంటుంది.

మతిపోయిందా నీ కొడుకుపై చేయి చేసుకోవడం ఏంటీ అని సేనాపతి అంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా చిన్నకొడుకును చంపాని చూస్తారు అని వేదవతి అంటే అంతా షాక్ అయి చూస్తారు. మేము చంపాలని చూడటం ఏంటీ. ఏదో ఒక గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావ్ అని భద్రావతి అంటే.. మేము ఎక్కడ నీ మీదకు వస్తావేమో అని రివర్స్‌లో నువ్ అంటున్నావా అని రేవతి అంటుంది. మేము మంచివాళ్లం కాబట్టి మాలోనే బాధపడ్డాం. నిజంగా మేము చంపేవాళ్లం అయితే ఆరోజు నిన్ను లేపుకపోయినందుకు రామరాజు గాడిని చంపేవాళ్లం అని సేనాపతి అంటాడు.

ఆరోజు అలా చేసి ఉంటే ఈరోజు మా కూతురు కోసం బాధపడేవాళ్లం కాదు. ఇక్కడి నుంచి వెళ్లు అని సేనాపతి అంటాడు. తాడోపేడో తేల్చుకుందామనే వచ్చాను. పిలువు నీ కొడుకును, ఆ వెధవని పిలువు అని వేదావతి అంటుంది. దాంతో ఏంటీ అరుస్తున్నావ్ అని విశ్వ వస్తాడు. రాగానే ఎడా పెడా విశ్వను కొడుతుంది వేదవతి. గల్ల పట్టి బయటకు లాక్కొస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు. నా చిన్నకొడుకు మీద చేయి చేసుకుంటావురా అని మళ్లీ మీదకు వెళ్తుంటే అంతా ఆపుతారు.

 

హంతకులను చేస్తుంది

ఏమైందే అని వేదావతి తల్లి అడుగుతుంది. మనుషులను పెట్టి నా చిన్నకొడుకును చంపాలని చూశాడు. సంక్రాంతి సంబురాల్లో చంపడానికి వాళ్లు దాడి చేశారు. అదృష్టం బాగుండి నా కొడుకుకు ఏం కాలేదు. కానీ, ఒంటినిండా దెబ్బలతో ఉన్నాడు. వీరు కిరాయి రౌడీలతో చంపించాలను చూశాడో అడగండి అని వేదవతి అంటుంది. రేయ్ నీ మీద నిందలు వేయడమే కాదు. పదిమందిలో మనల్ని హంతకులని చేయాలని చూస్తుంది. నువ్ దాడి చేయించలేదని చెప్పురా అని భద్రావతి అంటుంది.

దాంతో విశ్వ సైలెంట్‌గా ఉంటాడు. అర్థమైందిగా.. నా కొడుకు ప్రాణాలను వీడే తీయాలను చూశాడని అర్థమైంది కదా. రేయ్ చేతకాని దద్దమ్మలా పదిమందిని పంపించడం కాదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కడివే నా కొడుకుతో తలపడు. ఆ తర్వాత భూమ్మీద నువ్ బతికి బట్టకడతావో చూడు అని చిటికేలు వేసి చెబుతుంది వేదవతి. అప్పుడే రామరాజు వస్తాడు. రామరాజు కొడుకులు కంగారుపడతారు.

పాతికేళ్లు మీరేమన్నా అని భరించాను.

పనోడితో లేచిపోయిందని కాకుల్లా పొడిచినా సహించాను. అందుకు కారణం మీ బాధలో అర్థం ఉంది కాబట్టి. అంతవరకే నేను చూస్తాను. నా కొడుకుల జోలికి వస్తే మాత్రం ఎవ్వరని చూడను. ఏం చేయడానికైనా, ఎంత దూరం అయినా వెళ్లడానికి అవసరమైతే నిలువెల్ల తగలబెట్టాడనికైనా నేను వెనుకాడను. ఇప్పటివరకు భద్రావతి, రామరాజును చూశారు. ఈ వేదవతిని చూడలేదు. చూడాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి అని వార్నింగ్ ఇస్తుంది వేదవతి.

 

పట్టించుకోని రామరాజు

బావ అక్క అని చెప్పేసరికి వేదవతి ఆగిపోతుంది. ఏవండి ఆ విశ్వగాడు అని వేదవతి చెప్పబోతుంటే.. లోపలికి రా అని రామరాజు అంటాడు. దాంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతారు. వాడు చంపించాడని చెబుతుంటే ఇలా వచ్చేశారేంటండి అని వేదవతి అంటే.. పట్టనట్టు ఉన్న రామరాజు వేరే విషయాలు మాట్లాడుతాడు. వేదవతి ఎంత చెప్పినా రామరాజు ఏది వినడు. వేదవతి మాట్లాడుతుంటే ఇప్పటివరకు మిల్లుకు రాకుండా ఇంట్లో ఏం పీకుతున్నావ్ అని సాగర్‌ను బెదిరిస్తాడు రామరాజు.

దాంతో సాగర్ వెళ్లిపోతాడు. మళ్లీ వాళ్లు చంపేందుకు ప్రయత్నాలు చేస్తారు అని వేదవతి అంటుంటే.. అమూల్యను గద్దిస్తాడు రామరాజు. వేదవతి అరుస్తూనే ఉంటుంది. మీకు బాధగా లేదా. కన్నతండ్రి ప్రాణం కొట్టుకోవట్లేదా. ముక్కు మొహం తెలియనివాడిలా చూస్తున్నారు. వాన్ని ఓదార్చరేంటండి. కనీసం వాడి వైపు చూడట్లేదేంటండి అని వేదవతి అంటుంది. చూడను, పట్టించుకోను. నా గౌరవ మర్యాదల గురించి ఆలోచించను వాడి గురించి ఎందుకు పట్టించుకోవాలి. నేను మనిషిని కాదు, మానవత్వం లేదనుకో మిల్లు బుక్ మర్చిపోయి వచ్చాను అని వెళ్లిపోతాడు రామరాజు.

దాంతో వేదవతి, ధీరజ్ ఇద్దరు బాధపడుతారు. పిల్లలకు ఏదైనా చిన్నదెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోతారు. ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారని చెప్పినా మొహం చూడట్లేదు అంటే చిన్నోడిపై కోపం కాదు ఎంత ద్వేషం ఉందని దీన్నిబట్టే అర్థం అవుతోంది. నన్ను క్షమించురా చిన్నోడా అని వేదవతి అంటుంది. ఈ గాయాలు భరించగలుగుతున్నా. నీ ద్వేషాన్ని భరించలేకపోతున్నా. ప్లీజ్ మాట్లాడు అని ధీరజ్ అనుకుంటాడు.

 

పాతికేళ్ల పగ చల్లారుతుంది

మరోవైపు నీకు అసలు బుద్ధుందా, మైండ్ పనిచేస్తుందా. వాడి ప్రాణాలు తీసి నీ చెల్లెలి పసుపుకుంకుమలు తీస్తావా అని విశ్వను సరస్వతి తిడుతుంది. వాడు నా చెల్లెలి కొడుకు కాదు. వాడు శత్రువు కొడుకు. ఈరోజు జస్ట్‌లో మిస్ అయ్యాడు. కానీ, ఏదో ఒక రోజు వాన్ని చంపేస్తాను అని విశ్వ గట్టిగా అంటాడు. నోర్మూయ్.. అని విశ్వను కొడుతుంది భద్రావతి. చంపేయడం ఏంట్రా. సమస్య పరిష్కారం అవుతుందా అని భద్రావతి అంటే.. పగ చల్లారుతుంది. పాతికేళ్ల పగ చల్లారుతుందని విశ్వ అంటాడు.

ఆ రామరాజు గాడిని ఆరోజే చంపేసి ఉంటే ఈరోజు మీకు ఈ బాధ ఉండేదా. ప్రేమ గురించి ఇలా ఏడుస్తు ఉండేవాళ్లమా అని విశ్వ అంటాడు. చంపేయడం పెద్ద పని కాదు. అలా చేస్తే మనింటి ఆడపిల్లకు మనపై ద్వేషం పెరుగుతుంది అని సేనాపతి అంటుంది. ఇదే మీరు చేస్తున్న తప్పు. ఆరోజు రామరాజు గాడి తల తీసుంటే.. అత్త చచ్చినట్లు మన ఇంటికే వచ్చేది. మీరు చేసిన తప్పు నేను చేయను అని విశ్వ అంటాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024