Tomato – Keeradosa: టమాటో – కీరదోస కలిపి తింటున్నారా? అయితే ఈ మూడు సమస్యలు తప్పవని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది!

Best Web Hosting Provider In India 2024

Tomato – Keeradosa: టమాటో – కీరదోస కలిపి తింటున్నారా? అయితే ఈ మూడు సమస్యలు తప్పవని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది!

Ramya Sri Marka HT Telugu
Feb 01, 2025 08:30 AM IST

Tomato – Keeradosa: ఆహారం తీసుకునే సమయంలో చాలా మంది చేసే తప్పుడు కాంబినేషన్ ఇదేనట. టమాటో, కీరదోస కలిపి తినకూడదని ఆయుర్వేదం చెబుతుంది. సలాడ్ ప్రిపేర్ చేసుకునే సమయంలో చాలా మంది ఇలా చేస్తుంటారు. మరి అలా తినడం వల్ల కలిగే సమస్యలేంటో తెలుసుకుందామా..

టమాటో - కీరదోస కలిపి తింటున్నారా?
టమాటో – కీరదోస కలిపి తింటున్నారా? (shutterstock)

సలాడ్ తీసుకునే చాలా మంది చేసే పొరబాటు ఏంటంటే, చలువదనానికి దోసకాయ, రుచికోసం టమాటా చిన్న ముక్కలుగా చేసుకుని వాడటం. కానీ, ఇలా చేయడం అనేది ఆరోగ్యానికి చేటు చేస్తుందట. సలాడ్ ఫైబర్‌ కోసం కీరదోసను జతచేస్తాం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. అయితే, ఆయుర్వేదం సూచిస్తున్న ఆహార నియమాల ప్రకారం.. సలాడ్ లోనైనా, మరెందులోనైనా టమాటా, కీరదోసను కలిపి తినకూడదట. ఒకవేళ తింటే ప్రధానంగా మూడు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందట.

yearly horoscope entry point

సలాడ్‌లో టమాటో – కీరదోసను కలిపి తినడం వల్ల కలిగే నష్టాలు

1. శరీర సమతుల్యత దెబ్బతినవచ్చు

ఆయుర్వేదం ప్రకారం, కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినడం వల్ల శరీర సమతుల్యత దెబ్బతిని, జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన కాంబినేషన్ టమాటో + కీరదోస. ఈ రెండు కూరగాయలు విరుద్ధ ఆహారాల జాబితాలో ఉన్నాయి. వేర్వేరు సమయాల్లో జీర్ణమవుతాయి. కాబట్టి, కీరదోసను, టమాటోను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

2. పోషకాల శోషణ

టమాటో, కీరదోసను కలిపి తినడం వల్ల పోషకాల శోషణ సరిగా జరగదు. టమాటోలో విటమిన్ సి, కీరదోసలో కుకుర్బిటాసిన్ అధికంగా ఉంటాయి. ఇవి కలిపి తీసుకుంటే, జీర్ణమైన ఆహారం నుంచి పోషకాలను శోషించుకునేందుకు అడ్డంకిగా మారుతుంది.

3. ఎసిడిటీ సమస్య

టమాటో, కీరదోస రెండింటిలోనూ నీరు అధికంగా ఉంటుంది. కానీ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్తి, ఉబ్బరం, బ్లోటింగ్ వంటి సమస్యలు కలుగుతాయి.

కీరదోస, టమాటో కలిపి తినకుండా ఇతర పదార్థాలను ప్రత్యామ్నాయంగా తీసుకోవాలనుకుంటే, ఇవి ట్రై చేయండి.

కీర + మజ్జిగ (Buttermilk):

కీరను మజ్జిగతో కలిపి తినడం చాలా మంచిది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా తక్షణ శక్తిని అందించి నీరసం తగ్గుతుంది.

టమాటో + క్యారెట్ (Carrot)

టమాటో, క్యారెట్ కలిపి సలాడ్ లేదా జ్యూస్ తయారుచేసుకోవచ్చు. ఈ రెండు ఆహార పదార్థాలు విటమిన్ A, C తో నిండినవి. శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

కీర + పండ్లు

కీరను పండు లేదా స్మూతీతో కలిపి తినడం మంచి ప్రత్యామ్నాయం. పాలు లేదా కొబ్బరి నీటితో కూడా స్మూతీ చేసుకోవచ్చు. దీని వలన మిక్స్డ్ న్యూట్రియెంట్స్ సమకూరుతాయి.

టమాటో + కాబేజి (Cabbage)

టమాటోను కాబేజితో కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మంచి ఫైబర్ కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

కీర + నిమ్మరసం (Lemon)

కీరతో నిమ్మరసం లేదా నిమ్మచుర్ణం కలిపి తినడం కూడా మంచి డిటాక్స్ రెమెడీగా పనిచేస్తుంది. ఇది శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

కీర + ఆపిల్

కీరను ఆపిల్‌తో కలిపి స్మూతీ చేయడం మంచి ఆహారం. ఇది శరీరానికి ప్రాముఖ్యమైన యాంటీఆక్సిడెంట్స్‌ను అందిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024