



Best Web Hosting Provider In India 2024
Double murder : యూపీలో డబుల్ మర్డర్ కలకలం- తల్లీకూతుళ్ల గొంతులు కోసి..
UP Double murder : యూపీలోని ఓ ఇంట్లో ఓ తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు! ఎవరో, వారి గొంతులు కోసి చంపి పారిపోయారు. ఈ నేరానికి పాల్పడిన వారు ఇంకా పోలీసులకు చిక్కలేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో ఓ తల్లీకూతుళ్లు శవమైన కనిపించారు. వారి గొంతులు కోసేసి ఉన్నాయి. నిందితులు ఇంకా పోలీసులకు చిక్కకపోవడం ఆందోళనకర విషయం! ఈ హత్యకు పాల్పడింది ఒకరేనా? లేక ఇందులో ఎంత మంది హస్తం ఉంది? అన్నది ప్రస్తుతం ఎవరికీ తెలియదు.

ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలహాబాద్ పట్టణం సమీపంలో ఉన్న ఇషాపూర్ అనే గ్రామంలో గురువారం మధ్యహ్నం ఈ డబుల్ మర్డర్ వ్యవహారం బయటపడింది. గీత, ఆమె కూతురు దీపికలు ఆ ఇంట్లో నివాసముంటున్నారు. ఆమె భర్త ప్రకాశ్, ఉద్యోగం పని మీద కొంతకాలం క్రితం ముంబై వెళ్లాడు. గీత కుమారుడు దేవాన్ష్, తన తాత సిద్ధాంత్ ఇంటికి వెళ్లాడు.
కాగా తల్లితో మాట్లాడాలని బుధవారం రాత్రి గీతకు దేవాన్ష్ ఫోన్ చేశాడు. కానీ ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పదేపదే కాల్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని దేవాన్ష్ తన తాతకు చెప్పాడు. ఆందోళనకు గురైన ఆ ఇద్దరు.. మరుసటి రోజు, అంటే గురువారం ఉదయం మలహాబాద్కు బయలుదేరారు.
గురువారం మధ్యహ్నం ఇంటికి చేరుకున్న ఆ ఇద్దరు డోర్ కొట్టారు. చాలా సేపటి వరకు ఎవరు తలుపు తీయలేదు. ఈ నేపథ్యంలోనే మహిళ తండ్రి సిద్ధాంత్, నిచ్చెన సాయంతో ఇంట్లోకి ప్రవేశించాడు. దేవాన్ష్ కూడా లోపలికి వెళ్లాడు.
ఓ గదిలో విఘతజీవులుగా పడి ఉన్న గీత, దీపికలు వారికి కనిపించారు. వారు గొంతులు కోసేసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. తలుపు తెరిచి, వెంటనే స్థానికులను పిలిచారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అక్కడి పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేసుకున్న అధికారులు, నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
అసలు ఈ పని ఎవరు చేశారు? తల్లీకూతుళ్లును చంపింది ఒకరేనా? లేక ఎంత మంది కలిసి చంపారు? వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం పోలీసుల వద్ద కూడా సమాధానం లేదు.
“మహిళ, ఆమె కూతురుని పదునైన ఆయుధం వాడి చంపేశారు. ఫోరెన్సీక్ నిపుణుల టీమ్ ఘటనాస్థలాన్ని పర్యవేక్షించింది. కీలక ఆధారాలను సేకరించింది. డాగ్ స్క్వాడ్‌ని కూడా ఉపయోగిస్తున్నాము. ఎవరైనా ఈ నేరానికి పాల్పడ్డారో, వారిని కచ్చితంగా పట్టుకుంటాము,” అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తల్లీకూతుళ్లు ఉదయం వరకు తలుపు తెరవకపోవడంతో తమకు అనుమానం వచ్చిందని, కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని స్థానికులు చెబుతున్నారు. నిందితులు ఎవరో వెంటనే పట్టుకుని, వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తన తల్లి, సోదరిని కోల్పోయిన దేవాన్ష్ చాలా బాధలో ఉన్నాడు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link