Budget Sarees: బడ్జెట్ సమర్పించే రోజు నిర్మల సీతారామన్ కట్టే చీరలు ఎంతో ప్రత్యేకం, గత బడ్జెట్‌లకు కట్టిన చీరలు ఇవే

Best Web Hosting Provider In India 2024

Budget Sarees: బడ్జెట్ సమర్పించే రోజు నిర్మల సీతారామన్ కట్టే చీరలు ఎంతో ప్రత్యేకం, గత బడ్జెట్‌లకు కట్టిన చీరలు ఇవే

Haritha Chappa HT Telugu
Feb 01, 2025 09:00 AM IST

Budget 2025 Sarees: బడ్జెట్ సమర్పించేందుకు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ఎనిమిదోసారి సిద్ధమయ్యారు. బడ్జెట్ తో పాటు ఆరోజు ఆమె కట్టుకునే చీర కూడా ఎంతో చర్చనీయాంశంగా మారుతుంది. గతంలో ఆమె బడ్జెట్ సమర్పించేటప్పుడు ఎలాంటి చీరలను ధరించారో తెలుసుకోండి.

బడ్జెట్ రోజు నిర్మలా సీతారామన్ కట్టే చీరలు ఎంతో ప్రత్యేకం
బడ్జెట్ రోజు నిర్మలా సీతారామన్ కట్టే చీరలు ఎంతో ప్రత్యేకం

కేంద్ర బడ్జెట్ ను సమర్పించేందుకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ సిద్ధమయ్యారు. ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సమర్పించేటప్పుడు కట్టుకునే చీర కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. అది భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని ప్రదర్శించేలా చేస్తుంది. ప్రతి చీర కూడా భారతదేశంలోని భిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంటుంది. అందుకే నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పించే రోజు కట్టే చీరలు కూడా ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

yearly horoscope entry point

గతేడాది ఆమె ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ను సమర్పించారు. ఆ సమయంలో నీలిరంగు చీరను ధరించారు. ఇది పశ్చిమబెంగాల్లో లభించే కంఠా ఎంబ్రాయిడరీని కలిగి ఉంది. ఈ చీర పై కనిపించే ఆకు డిజైన్ బెంగాల్‌కు చెందిన ప్రాచీన ఎంబ్రాయిడరీ వర్కులలో ఒకటి. బెంగాల్ నుండి ప్రత్యేకంగా ఈ నీలిరంగు చీరను తెప్పించుకొని మరి ఆమె ధరించారు. ఇది ఆక్వా కల్చర్ ఉత్పాదకతకు భారత దేశంలోని మత్య్స రంగం అభివృద్ధికి సూచికగా అభివర్ణించారు.

ఇక 2024-25లో పూర్తి బడ్జెట్‌ను సమర్పించేటప్పుడు నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగళగిరి చీరను తెప్పించుకున్నారు. మెజంతా రంగు బోర్డర్‌తో కూడిన హాఫ్ వైట్ మంగళగిరి శారీ ఇది. చూసేందుకు అద్భుతంగా ఉంది. ఈ చీరను కట్టుకోవడం ద్వారా ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ అవసరాలకు కీలకమైన పోలవరం నీటి పారుదల ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేశారు.

2023లో ఆమె బడ్జెట్‌ను సమర్పించేందుకు ఎరుపు రంగు చీరను ఎంపిక చేసుకున్నారు. ఇది టెంపుల్ బార్డర్ చీర. ఈ చీర కర్ణాటక ధార్వాడ్ ప్రాంతానికి చెందిన చీర. ఇది చేతితో నేసిన రధాలు, నెమళ్లు, కమలం వంటి డిజైన్లు కలిగి ఉన్నాయి. ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు.

2022లో బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు సీతారామన్ గోధుమ రంగు బొమకాయ్ చీరను ధరించారు. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో నేసే ప్రత్యేకమైన చేనేత చీర.

2021లో ఆమె హైదరాబాదులోని పోచంపల్లి గ్రామం నుండి ప్రత్యేకమైన హాఫ్ వైట్ పోచంపల్లి చీరను తెప్పించుకుని ధరించారు. ఈ చీర కూడా హుందాగా అద్భుతంగా ఉంది.

2020లో ఆమె బడ్జెట్‌ను సమర్పించేందుకు పసుపు రంగు పట్టు చీరను ధరించారు. పసుపు శుభాన్ని, శ్రేయస్సును కలిగించే రంగు. ఇది భారత దేశ సంస్కృతిని, సంపదను సూచిస్తుంది. అదే రంగు బ్లౌజ్ తో ఆమె లక్ష్మీదేవిలా కనిపించారు.

2019లో కూడా సీతారామన్ బడ్జెట్ బ్రీఫ్ కేస్ పట్టుకొని పింక్ చీరలో దర్శనమిచ్చారు. బంగారు రంగు అంచులతో కూడిన గులాబీ రంగు మంగళగిరి చీర అది.

బడ్జెట్ సమర్పించేటప్పుడు సీతారామన్ అందమైన చీరలను ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కొక్కసారి తెప్పించుకొని ధరిస్తారు. ప్రత్యేకమైన చేనేత ఎంబ్రాయిడరీ ని కలిగి ఉన్న చీరల్ని ఎంపిక చేసుకుంటారు. భారతదేశంలోని చేనేత చీరల గొప్పతనాన్ని చాటి చెప్పడం కూడా ఆమె ఉద్దేశం. బడ్జెట్‌ను సమర్పించడానికి సీతారామన్ ధరించే ప్రతి చీర కచ్చితంగా ప్రశంసలు అందుకుంటుంది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024