Identity Review: ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Best Web Hosting Provider In India 2024

Identity Review: ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

Sanjiv Kumar HT Telugu
Feb 01, 2025 09:31 AM IST

Identity Movie Review In Telugu: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ మర్డర్ మిస్టరీ సినిమా ఐడెంటిటీ. స్టార్ హీరోయిన్ త్రిష, మాలీవుడ్ హీరో టొవినో థామస్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఐడెంటిటీ తెలుగులో జీ5లో ఓటీటీ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి ఐడెంటిటీ రివ్యూలో తెలుసుకుందాం.

ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?
ఐడెంటిటీ రివ్యూ- ఊహించని ట్విస్టులు, మెదడుకు పనిపెట్టే సీన్స్- ఓటీటీ మలయాళ మర్డర్ మిస్టరీ ఎలా ఉందంటే?

టైటిల్: ఐడెంటిటీ

yearly horoscope entry point

నటీనటులు: టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి, అర్చన కవి, అజు వర్గీస్, షమ్మీ తిలకన్, అర్జున్ రాధాకృష్ణన్ తదితరులు

దర్శకత్వం: అఖిల్ పాల్, అనాస్ ఖాన్

నిర్మాతలు: రాజ్ మల్లియత్, రాయ్ సీజే, కోచుమోన్

సంగీతం: జేక్స్ బిజోయ్

సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్

ఎడిటింగ్: చమన్ చాకో

ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ డేట్: జీ5- 31 జనవరి 2025,

Identity Review And Rating In Telugu: స్టార్ హీరోయిన్ త్రిష, మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, హనుమాన్ విలన్ వినయ్ రాయ్ ముగ్గురు ప్రధాన పాత్రల్లో నటించిన మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వేస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐడెంటిటీ. జనవరిలో మలయాళం, తెలుగులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది.

దాంతో ఇదే నెలలో ఐడెంటిటీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జీ5 ఓటీటీలో తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో జనవరి 31 నుంచి ఐడెంటిటీ స్ట్రీమింగ్ అవుతోంది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ ఇద్దరు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఐడెంటిటీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

బెంగళూరులో ఓ షాపింగ్ మాల్‌లోని లేడీస్ ట్రయల్ రూమ్‌లో సీక్రెట్‌గా ఫోన్ పెట్టి అమ్మాయిల న్యూడ్ వీడియోలు చిత్రీకరించి వారిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు అమర్ ఫిలిక్స్ (అర్జున్ రాధాకృష్ణన్). కట్ చేస్తే అతన్ని చాలా దారుణంగా చంపేస్తారు. ఈ కేసును సాల్వ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ అలెన్ జాకబ్ (వినయ్ రాయ్) హత్యను చూసిన విట్నెస్, జర్నలిస్ట్ అలీషా అబ్దుల్ సల్మాన్ (త్రిష)తో రంగంలోకి దిగుతాడు.

అలీషాకు ప్రాణ హానీ ఉండటంతో ఓ చోట పేరు మార్చి తన చెల్లెలిగా చెప్పి ఉంచుతాడు అలెన్. ఈ సమయంలోనే అలెన్‌కు స్కెచ్ ఆర్టిస్ట్‌ హరన్ శంకర్ (టొవినో థామస్) పరిచయం అవుతాడు. దాంతో హరన్ హెల్ప్ తీసుకుంటాడు అలెన్. అలెన్, అలీషా, హరన్ ముగ్గురు కలిసి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు.

ట్విస్టులు

ముగ్గురు కలిసి ఎలా ఇన్వెస్టిగేషన్ చేశారు? ఆ మర్డర్‌కు ఈ ముగ్గురికి ఉన్న లింక్ ఏంటీ? దాంతో వీరికి సంబంధం ఎలా ఏర్పడంది? హరన్ శంకర్ గతం ఏంటీ? అసలు అమర్ ఫిలిక్స్ అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీయడం వెనుకున్న ఆంతర్యం ఏంటీ? అమర్‌ను ఎవరు చంపారు? ఎందుకు హత్య చేశారు? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఐడెంటిటీ చూడాల్సిందే.

విశ్లేషణ:

క్రైమ్ థ్రిల్లర్ లేదా మర్డర్ ఇన్వెస్టిగేషన్ జోనర్స్ సినిమాలను ఎంత ఎంగేజ్ చేస్తే అంతా హిట్ అవుతాయి. అయితే, ఐడెంటిటీ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌గానే సాగుతుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. అన్నిసార్లు మంచి సినిమాలు హిట్ కావాలని లేదు. కానీ, ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ కావాలంటే ఎంత థ్రిల్లింగ్‌ నెరేషన్ ఉన్న అర్థం అయ్యేలా కథ చెప్పాలి. అదే ఐడెంటిటీలో కాస్తా మిస్ అయింది.

ఐడెంటిటీ మూవీ ఒక క్రైమ్‌తో స్టార్ అయి ఇన్వెస్టిగేషన్ నుంచి యాక్షన్ జోనర్‌కు మారిపోతుంది. కానీ, స్టార్టింగ్ నుంచి వచ్చే ఎండింగ్ వరకు ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. కాకపోతే స్క్రీన్ ప్లేలో కాస్తా కాంప్లెక్సిటీ ఉండటంతో రెగ్యులర్ ఆడియెన్స్ ఎంజాయ్ చేయలేరు. చాలా వరకు ప్రేక్షకులకు బ్రెయిన్‌కు పనిచెప్పేలా ఉంటుంది సినిమా.

ఒక్కొక్కరికి ఉన్న లింక్

అమ్మాయిల న్యూడ్ వీడియోలు తీయడం, అతను మర్డర్ కావడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీస్ ఆఫీస్ రావడం, అతనితో యాక్సిడెంట్ అయి గతం మర్చిపోయిన సాక్షి, వారికి స్కెచ్ ఆర్టిస్ట్ పరిచయం కావడం, ఆ తర్వాత ఆ కేసుతో ఒక్కొక్కరికి ఉన్న లింక్ బయటపడటం అంతా ఆకట్టుకుంటుంది. ఊహించని ట్విస్టులతో, అదిరిపోయే సీన్స్‌తో కట్టి పడేస్తుంది.

ఇంటర్వెల్ వచ్చేసరికి ఎవరు ఏంటీ అనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ తర్వాత యాక్షన్ జోనర్‌లోకి వెళ్లిన సినిమా బాగానే ఉంటుంది. ప్రతిసారి ఫ్లాష్‌బ్యాక్ స్క్రీన్ ప్లేతో కాస్తా ఇబ్బందిగా అనిపిస్తుంది. త్రిష గురించి వచ్చే ట్విస్ట్ బాగానే ఉంటుంది. కానీ, అది గతేడాది రిలీజ్ అయిన ఓ తెలుగు సినిమాలో చూసిన పాయింటే కాబట్టి కొత్తగా అనిపించదు. కానీ, కేసులో మాత్రం అది చాలా కీలకంగా ఉంటుంది.

ఎలివేషన్ అదుర్స్

కథలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. దాంతో ఎవరు ఏంటీ అనే కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఓటీటీలో కాబట్టి వెనక్కి వెళ్లి చూసుకునే ఆప్షన్ ఉంటుంది. థియేటర్‌లో అలా ఉండదు కాబట్టి క్లారిటీగా అర్థం చేసుకోలేం. ఇక క్లైమాక్స్‌కు 40 నిమిషాల ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. హరన్ శంకర్‌కు ఇచ్చే ఎలివేషన్ మాములుగా ఉండదు.

క్లైమాక్స్ సింపుల్‌గా బాగుంటుంది. అయితే, క్లైమాక్స్‌లో వచ్చే ఫ్లైట్ సీన్ కావాలని పెట్టినట్లు అనిపించినా చాలా స్టైలిష్‌గా, కొత్తగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

అదిరిపోయిన యాక్టింగ్

టొవినో థామస్ నటనతో ఆకట్టుకున్నాడు. వినయ్ రాయ్ అదరగొట్టాడు. ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ హైలెట్ అయింది. త్రిష హీరోయిన్‌లా కాకుండా ఓ సాక్షి పాత్ర చేసింది. కథలో కీలకమైన పాత్రలో త్రిష డీసెంట్‌గా చేసింది. మిగతా వారి యాక్టింగ్ అంతా బాగుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే 2 గంటల 37 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఐడెంటిటీ కొత్త ఫీల్ ఇస్తుంది. కానీ, నిడివి కాస్తా తగ్గించి ఉంటే బాగుండేది. అయితే, మూవీ రెగ్యులర్ ఆడియెన్స్‌కు నచ్చకపోవచ్చు. మందిరా బేడి స్విమ్ సూట్ సీన్, అమ్మాయిలను టార్చర్ చేసే సన్నివేశాలు తప్పా పెద్దగా ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కూడా చూసేయొచ్చు. జీ5లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఐడెంటిటీ మూవీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి బెస్ట్ ఛాయిస్.

రేటింగ్: 2.95/5

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024