Hyderabad : మహిళ మృతి కేసులో ట్విస్ట్.. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Best Web Hosting Provider In India 2024

Hyderabad : మహిళ మృతి కేసులో ట్విస్ట్.. సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!

Basani Shiva Kumar HT Telugu Feb 01, 2025 11:14 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Basani Shiva Kumar HT Telugu
Feb 01, 2025 11:14 AM IST

Hyderabad : హైదరాబాద్ నగరం వారాసిగూడలో మహిళ మృతి ఘటన కన్నీరు పెట్టిస్తోంది. ఈ కేసులో పోలీసులు తాజాగా సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ముగ్గురి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ లెటర్ ఎవరు రాశారు.. ఎందుకు రాశారు.. ఎప్పుడు రాశారు.. ఆ వివరాలు చూద్దాం.

మృతురాలు లలిత (ఫైల్ ఫొటో)
మృతురాలు లలిత (ఫైల్ ఫొటో)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ఆ ఆడపిల్లలను అన్నీతానై చూసుకుంటున్న తల్లి అకస్మాత్తుగా చనిపోయింది. ఈ బాధను తట్టుకోలేని ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఎంతో కుంగిపోయారు. ఏం చేయాలో తెలియక.. దిక్కుతోచక.. ఎవరికీ చెప్పకుండా.. తల్లి మృతదేహంతో ఇంట్లోనే ఉండిపోయారు. 9 రోజులపాటు తిండిలేదు. నీరసించిపోయారు. ఒకసారి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ ఘటన అందరినీ కలచివేస్తోంది.

yearly horoscope entry point

సూసైడ్ నోట్..

తాజాగా ఈ కేసులో మృతురాలి కుమార్తెలు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 22న లలిత మృతి చెందింది. 23న ఆమె ఇద్దరు కూతుళ్లు రవలిక, యశ్విత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. దీనికి సంబంధించిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మేనమామే కారణం..

తమ సూసైడ్‌కు కారణం మేనమామ బిట్ల రమేష్, ప్రకాష్ రెడ్డి, తండ్రి సీఎల్ రాజు అని రవళిక, యశ్విత లేఖలో రాశారు. పోలీసులకు లభించిన సూసైడ్ లెటర్ ప్రకారం.. మృతురాలు లలిత కుటుంబాన్ని భర్త రాజు దూరం పెట్టాడు. దీంతో లలిత తన కూతుళ్లతో కలిసి తల్లి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో సోదరుడు బిట్ల రమేష్, అతని భార్య వరలక్ష్మి కలిసి తమ తల్లి లలితను కొట్టినట్లు కుమార్తెలు లెటర్‌లో వాపోయారు.

2021 నుంచి గొడవలు..

తమ మేనమామ బిట్ల రమేష్‌తో 2021 నుంచి గొడవలు జరుగుతున్నట్లు లెటర్‌లో రాశారు. తమ తల్లి లలితను చంపింది మామయ్య రమేష్ అని లెటర్‌లో ఆరోపించారు. చేతబడి చేసి చంపాడని, దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తల్లి చనిపోయిన తర్వాత రవళిక, యశ్విత సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 23న లెటర్ రాసినట్లు సమాచారం.

26 ఏళ్ల కిందట పెళ్లి..

ఓయూలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల కిందట లలితకు పెళ్లైంది. వీరికి రవళిక, యశ్విత సంతానం. అయితే.. గొడవల కారణంగా రాజు 2020లో వీరిని విడిచి వెళ్లిపోయాడు. లలిత తన తల్లి దగ్గర ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. రవళిక బట్టల షాప్‌లో. యశ్విత ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు. ఆరు నెలల కిందటే ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్‌లోని అద్దె ఇంట్లోకి మారారు.

మొదట ఎమ్మెల్యే దగ్గరకు..

ఆ తర్వాత కొన్ని రోజులకే తల్లి లలిత చనిపోయింది. కనీసం అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేవు. ఈ సమయంలోనే ఆత్మహత్య చేసుకునేందుకు పదునైన వస్తువులతో ఇద్దరూ గొంతు, మణికట్టుపై కోసుకున్నట్లు తెలుస్తోంది. తొమ్మిది రోజులుగా ఒక గదిలో మృతదేహాన్ని ఉంచి, మరో గదిలో అక్కాచెల్లెళ్లున్నారు. యువతులిద్దరూ శుక్రవారం ఉదయం బయటికి వచ్చి చుట్టుపక్కల వారికి విషయం చెప్పారు. వారి ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు.

Whats_app_banner

టాపిక్

HyderabadCrime TelanganaTs PoliceTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024