TG Tourism Papikondalu Package : వీకెండ్ లో ‘పాపికొండలు’ ట్రిప్ – ఈ వారంలోనే జర్నీ, ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి..!

Best Web Hosting Provider In India 2024

TG Tourism Papikondalu Package : వీకెండ్ లో ‘పాపికొండలు’ ట్రిప్ – ఈ వారంలోనే జర్నీ, ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి..!

Maheshwaram Mahendra HT Telugu Feb 01, 2025 01:23 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 01, 2025 01:23 PM IST

TG Tourism Papikondalu Package 2025: ఈ ఫిబ్రవరి నెలలో పాపికొండలకు వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి తీసుకెళ్తోంది. మొత్తం 3 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి….

Papikondalu tour package to operate on 7th febraury 2025 from hyderabad
Papikondalu tour package to operate on 7th febraury 2025 from hyderabad (Image Source AP Tourism)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

ప్రకృతి అందాలకు కేరాఫ్ అయిన పాపికొండలను చూడాలని అనుకుంటున్నారా..? గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ…. ప్రకృతి అందాలను అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే మీకోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.

yearly horoscope entry point

బడ్జెట్ ధరలోనే హైదరాబాద్ నుంచి పాపికొండలు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి శుక్రవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. వీకెండ్స్ లో ఆహ్లాదకరంగా గడిపి రావొచ్చు. బస్సులో జర్నీ ఉంటుంది.

పాపికొండలు టూర్ ప్యాకేజీ – వివరాలు:

  • పాపికొండల చూసేందుకు తెలంగాణ టూరిజం “PAPIKONDALU ROAD CUM RIVER CRUISE PACKAGE TOUR ” పేరుతో ప్యాకేజీని తీసుకుంది.
  • హైదరాబాద్ నుంచి ప్రతి శుక్రవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం 7 ఫిబ్రవరి, 2025వ తేదీన జర్నీ ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో డేట్ లో బుకింగ్ చేసుకోవచ్చు.
  • హైదరాబాద్ – పాపికొండలు టూర్ ప్యాకేజీ ధరలు: పెద్దలకు 6999గా ఉంటే… పిల్లలకు రూ. 5599గా ఉంది . నాన్ ఏసీ బస్సులో జర్నీ ఉంటుంది.
  • ప్యాకేజీ బుకింగ్ చేసుకున్న వాళ్లు హైదరాబాద్ నుంచి వెళ్తారు. రాత్రి 07.30 గంటలకు పర్యాటక భవన్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రాత్రి 8 గంటలక బషీర్ బాగ్ వద్దకు వస్తుంది. రాత్రి భద్రాచలం వెళ్తారు. మార్గ మధ్యలో భోజనం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలంలోని హారిత హోటల్ కు చేరుకుంటారు. 8 గంటలకు పోచారం బోటింగ్ పాయింట్ కు చేరుకొని.. పాపికొండలతో పాటు పెరంటాలపల్లికి వెళ్తారు. పొచారానికి బోట్ లో జర్నీ ఉంటుంది. ఈ జర్నీని అత్యంత ఆహ్లాదకరంగా సాగుతుంది. గోదావరి అందాలను మాటాల్లో వర్ణించలేం. ఇక రాత్రి భద్రాచలంలోని హారిత హోటల్ లో బస చేస్తారు.
  • మూడో రోజు టిఫిన్ చేసిన పర్ణశాలకు వెళ్తారు. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత… హైదరాబాద్ కు బయల్దేరుతారు. రాత్రి 10గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 1800-425-46464 నెంబర్ కు కాల్ చేయవచ్చు. info@tstdc.in మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.
  • ఈ లింక్ పై క్లిక్ చేసి హైదరాబాద్ – పాపికొండలు టూర్ ప్యాకేజీ వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ చేసుకునే వీలు కూడా ఉంటుంది.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

TourismAp TourismTelangana TourismBhadrachalamHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024