Parenting Tips: పిల్లలతో మనస్సు విప్పి మాట్లాడేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 విషయాలు వారి చెవిన పడకూడదు!

Best Web Hosting Provider In India 2024

Parenting Tips: పిల్లలతో మనస్సు విప్పి మాట్లాడేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 విషయాలు వారి చెవిన పడకూడదు!

Ramya Sri Marka HT Telugu
Feb 01, 2025 02:00 PM IST

Parenting Tips: పిల్లలతో మీ అనుభవాలను పంచుకోవడమనేది మంచి అలవాటే. కానీ, కొన్నింటిని మాత్రం అస్సలు వారి చెవిన పడకుండా జాగ్రత్తపడండి. అవి తెలియడం వల్ల వారికి మంచి జరగకపోగా, మానసికంగా నెగెటివ్ ఫీలింగ్స్ ఎక్కువ కలుగుతాయట. మరి ఆ 3 విషయాలేంటో చూసేద్దామా..!

పిల్లలతో మనస్సు విప్పి మాట్లాడేస్తున్నారా
పిల్లలతో మనస్సు విప్పి మాట్లాడేస్తున్నారా

తల్లిదండ్రులు చాలా వరకూ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని ఆశపడతారు. ఈ క్రమంలోనే తమ అనుభవాలను వారితో పంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. కానీ, అలా చేసేటప్పుడు, చాలా సార్లు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు. అవి తల్లిదండ్రుల విషయంలో సాధారణమైనవిగానే అనిపించినప్పటికీ, పిల్లల మనసుపై లోతైన ప్రభావం చూపి వారిని తిరుగుబాటుదారులుగా మార్చి ప్రమాదంలో పడేస్తాయట. తల్లిదండ్రులు తమ గతం నుండి కొన్ని విషయాలను పిల్లల వరకూ చేరనివ్వకపోవడమే బెటర్. మరి పిల్లలతో పంచుకోకూడని ఆ 3 విషయాలేంటో తెలుసుకుందాం.

yearly horoscope entry point

ప్రమాదకరమైన కథలు

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ బాల్యంలో చేసిన ప్రమాదకరమైన స్టంట్లు, ప్రమాదకరమైన ప్రయాణాలు లేదా ప్రమాదకరమైన ప్రవర్తనల గురించి పిల్లలతో చర్చించకూడదు. ఒకవేళ ఇతర సందర్భంలో తెలిసి పిల్లల చెవిన పడినప్పటికీ ఏదో ఒక విషయం చెప్పి డైవర్ట్ చేసేయాలి. అలా కాకుండా వారితో పాటు అదే విషయం గురించి చర్చించుకుంటూ కూర్చోవడం వల్ల మీ పిల్లల మనసులో ఆలోచించకుండా అలాంటి ప్రమాదకరమైన పనులు చేయాలనే ఆలోచన రావచ్చు.

డబ్బుకు సంబంధించిన చెడు నిర్ణయాలు, ఆర్థిక పోరాటాల కథలు

తల్లిదండ్రులు చాలా సార్లు తమ పిల్లలకు డబ్బు విలువను నేర్పించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో తమ జీవితంలో తాము చేసిన ఆర్థిక తప్పులు, నిర్లక్ష్యంగా చేసిన ఖర్చుల నష్టం, అప్పుల అనుభవాలు, ప్రమాదకరమైన పెట్టుబడుల గురించి చర్చిస్తారు. కానీ, చాలా సార్లు ఈ విషయాలు తెలియడం వల్ల పిల్లలపై మంచి కంటే చెడు ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుందట. మీ పిల్లలు కూడా ఈ కథ విని తమ కుటుంబ ఆర్థిక స్థిరత్వం గురించి అసురక్షితంగా భావించవచ్చు. లేదా డబ్బు విషయాల గురించి అధికంగా ఆందోళన చెందవచ్చు. కాబట్టి, పిల్లలకు కథలు చెప్పడం కంటే స్మార్ట్ ఆదా, ఖర్చు చిట్కాలను చెప్పడమే బెటర్.

తిరుగుబాటు ప్రవర్తనకు సంబంధించిన కథలు

తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లలకు, తాము కూడా చిన్న వయస్సులో ఉన్నప్పుడు స్కూల్ బంకింగ్, కర్ఫ్యూను ఉల్లంఘించడం లేదా ఇతర తిరుగుబాటు ప్రవర్తనల గురించి చెప్పకూడదు. ఈ అనుభవాలను పిల్లలతో చర్చించడం వల్ల మీకు ఆనందంగా, హాని చేయనిదిగా అనిపించవచ్చు. కానీ, ఈ విషయాలు వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. మీకు తెలియకుండానే వారు కూడా ఈ పనులు చేసేందుకు ప్రేరణ కలిగించిన వారవుతారు. ఈ రకమైన కథలు విన్న తర్వాత తమకు తెలియకుండానే పిల్లల మనసులో తల్లిదండ్రుల పట్ల అవిధేయతా భావాన్ని పెంచుతాయి.

పిల్లలతో ఏమేం పంచుకోవాలి?

మంచి పెంపకం అంటే పిల్లల భద్రత, జీవిత అనుభవాల మధ్య మంచి సమతుల్యతను కొనసాగించడం. కాబట్టి, మీ వ్యక్తిగత కథలను పిల్లలతో పంచుకోవడానికి బదులుగా, వారిలో ధైర్యం, కష్టపడటం లేదా దయను నింపే విధమైన అంశాలను చర్చించాలి. వారికి చెప్పే కథలు మీవే అయి ఉండాల్సిన అవసరం లేదు. వారిలో సత్ప్రవర్తనను, ప్రేరణను నింపే కథల ఉదాహరణలను పంచుకోవడం బెటర్. వారికి కథలు చెప్పే సమయంలో యథాలాపంగా వ్యవహరించకుండా కాస్త ప్రయోజనపూర్వకమైనవి పంచుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024