తిరుపతిలో కక్ష సాధింపు రాజకీయాలు 

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ నేత భవనం కూల్చివేతకు ప్లాన్‌
 

తిరుపతి: కూటమి పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైయ‌స్ఆర్‌సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డికి చెందిన ఆస్తులకు ధ్వంసం చేసేందకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తిరుపతిలోని డీబీఆర్‌ ఆసుపత్రి రోడ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. జ‌న‌సేన నేత‌ల అండతో అధికారులు ఓవరాక్షన్‌కు దిగారు. వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి డీబీఆర్‌ రోడ్డులో నిర్మిస్తున్న ఐదు అంతస్థుల భవనంలో మూడో అంతస్థులో కూల్చివేతకు మున్సిపల్‌ అధికారులు దిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేతలకు రావడంతో స్థానిక వైయ‌స్ఆర్‌సీపీ నేత భూమన అభినయ్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది.

డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల కోస‌మే: భూమన అభినయ్‌ రెడ్డి  
`డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తిరుపతి నగరం కార్పొరేషన్ పరిధిలో కక్ష్య సాధింపు చర్యలకు దిగుతోంది.వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులు ధ్వంసం చేసేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీకి పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ టీడీపీ కుట్రలు చేస్తోంది. డీబీఆర్‌ ఆసుపత్రి రోడ్‌లో శేఖర్ రెడ్డి ఐదు అంతస్థుల భవనం నిర్మాణంలో ఉండగా మూడవ అంతస్తులో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం నోటీసులు ఇవ్వాలి. 15 రోజులు సమయం ఇవ్వాలని స్పష్టంగా ఉంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికార బలంతో కూల్చివేతకు దిగుతున్నారు. కూటమి నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని అభిన‌య్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 

Best Web Hosting Provider In India 2024