Sinus Relief: చలికాలం ఎక్కువగా వేధించే సైనస్ నొప్పిని ఇలా తగ్గించుకోండి. ఈ పాయింట్లలో మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం!

Best Web Hosting Provider In India 2024

Sinus Relief: చలికాలం ఎక్కువగా వేధించే సైనస్ నొప్పిని ఇలా తగ్గించుకోండి. ఈ పాయింట్లలో మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం!

Ramya Sri Marka HT Telugu
Feb 01, 2025 03:30 PM IST

Sinus Relief: సైనసైటిస్ సమస్య అనేది చాలా మందిలో కనిపించే సమస్యే. చలికాలం దీని నుంచి బయటపడేందుకు చాాలా రకాలుగా ప్రయత్నిస్తాం. ఎన్నో మందులు కూడా వాడతాం. వీటితో సంబంధం లేకుండా కొద్దిసేపు మసాజ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చట. అదెలాగో చూద్దామా..!

సైనస్ నొప్పిని ఇలా తగ్గించుకోండి
సైనస్ నొప్పిని ఇలా తగ్గించుకోండి

సైనస్ సమస్యతో బాధపడేవాళ్లు బయట తిరగడానికి, ప్రశాంతంగా మాట్లాడటానికి ఇలా ప్రతిదానికి భయపడుతుంటారు. దీని నుంచి బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మెడిసిన్ తో కొన్నిసార్లు పరిష్కారం వెదుక్కోవచ్చు. కానీ, ఒకవేళ మెడిసిన్ అందుబాటులో లేకపోయినా సైనస్ నుంచి రిలీఫ్ దక్కించుకోవాలంటే, మసాజ్ చేసుకోవడం ఒక్కటే సొల్యూషన్. ఈ సమస్య వల్ల తీవ్రమైన నొప్పి కూడా అనుభవించవచ్చు. ఈ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మసాజ్ చేయండి. ముక్కు మూసుకుని శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లు ఈ టెక్నిక్స్ పాటించాలి. ఫలితంగా సైనస్ వల్ల కలిగే చిరాకు తగ్గిపోతుంది.

yearly horoscope entry point

ఈ మసాజ్‌లో కొన్ని ప్రత్యేక పాయింట్లపై మసాజ్ చేయాల్సి ఉంటుంది. సైనస్ లు ప్రధానంగా 3 రకాలు ఉంటాయి. వీటి నుంచి ఉపశమనం కోసం కొన్ని ప్రత్యేకమైన పాయింట్లపై మసాజ్ చేసినప్పుడు నొప్పి, క్లోమం నుండి ఉపశమనం దక్కుతుంది. సైనస్ పాయింట్ల మసాజ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

1) ఫ్రంటల్ సైనస్ మసాజ్

ఫ్రంటల్ సైనస్‌లు మీ నుదుటి మధ్యలో, మీ కంటికి పైన ఉంటాయి. ఈ మసాజ్ చేయడానికి, మీ రెండు చూపుడు వేళ్లు, మధ్య వేళ్లను కలిపి నాలుగు వేళ్లను మీ కనుబొమ్మల పైన, మీ నుదుటి మధ్య భాగంలో ఉంచండి. ఆపై బయటకు వృత్తాకారంగా తిప్పుతూ నెమ్మదిగా మసాజ్ చేయండి. దాదాపు 30 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు దీన్ని పునరావృతం చేయండి. సమస్యగా అనిపించినప్పుడల్లా ఇలా చేయడం ద్వారా రిలీఫ్ కలుగుతుంది.

2) మాక్సిల్లరీ సైనస్ మసాజ్

మాక్సిల్లరీ సైనస్‌లు అతిపెద్దవి, అవి మీ ముక్కు రెండు వైపులా, ఇంకా మీ చెంపల కింద సమస్యగా మారతాయి. వీటి నుంచి ఉపశమనం కోసం చూపుడు వేలు, మధ్య వేళ్లను మీ ముక్కు రెండు వైపులా, మీ చెంప ఎముకల, ఎగువ దవడ మధ్యలో ఉంచండి. ఆపై వృత్తాకార చలనంలో నెమ్మదిగా మసాజ్ చేయండి. దాదాపు 30 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు పునరావృతం చేయండి. అలా చేసిన తర్వాత సైనస్ నుంచి రిలీఫ్ పొందడం మీరే గమనిస్తారు.

3) స్ఫెనాయిడ్, ఎత్మాయిడ్ సైనస్ మసాజ్

స్ఫెనాయిడ్ సైనస్‌లు మీ ముక్కు వెనుక మీ కళ్ళ మధ్యలో ఉంటాయి. అయితే ఎత్మాయిడ్ సైనస్‌లు మీ ముక్కును మీ మెదడు నుండి వేరుచేసే ఎముకలో ఉంటాయి. కాబట్టి ఇవి రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. వీటిని మసాజ్ చేయడానికి, మీ చూపుడు వేలును ముక్కు ఎముక అంచులపై ఉంచండి. ఆపై మీ కళ్ళ మూలల, మీ ముక్కు ఎముక మధ్య భాగాన్ని గుర్తించండి. దాదాపు 15 సెకన్ల పాటు మీ వేలితో ఆ ప్రదేశంలో తేలికగా ఒత్తిడిని కలిగిస్తూ కదపండి. ఆపై ముక్కు ఎముక అంచు నుండి క్రిందికి నెమ్మదిగా చేయి తీసేయండి.

ఈ మసాజ్ తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే కానీ, పర్మినెంట్ సొల్యూషన్ కాదనే సంగతి గుర్తుంచుకోండి. సైనస్ సమస్య తీవ్రంగా అనిపించినప్పుడు మసాజ్ ట్రై చేసి, వైద్యుడ్ని సంప్రదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024