Best Web Hosting Provider In India 2024
Aha OTT: జనవరిలో ఆహా ఓటీటీలో వచ్చిన 8 తెలుగు సినిమాలు.. మూడు నేరుగా స్ట్రీమింగ్‍కు.. మీరెన్ని చూశారు!
Aha OTT: ఆహా ఓటీటీలో జనవరిలో వరుసగా చిత్రాలు అడుగుపెట్టాయి. అందులో మూడు నేరుగా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. జనవరిలో ఆహాలో ఎంట్రీ ఇచ్చిన 8 సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
ఆహా ఓటీటీ దూకుడుగా సినిమాలకు తీసుకొస్తోంది. వరుసగా కొత్త కంటెంట్ తీసుకొస్తోంది. గత నెల జనవరిలో ఆహా ఓటీటీలో ఎనిమిది ఇంట్రెస్టింగ్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. వివిధ జానర్లలో ఈ సినిమాలు ఉన్నాయి. ఇందులో మూడు చిత్రాలు నేరుగా ఆహాలోనే స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. జనవరిలో ఆహాలోకి వచ్చిన 8 సినిమాలు ఏవంటే..
రజాకార్
రజాకార్ చిత్రం జనవరి 24వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. గతేడాది మార్చి 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు 10 నెలల తర్వాత ఆహాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ హిస్టారికల్ యాక్ష్ మూవీలో బాబీ సింహా, రాజ్ అర్జున్, అనసూయ, మార్కండ్ దేశ్‍పాండే కీలకపాత్ర పోషించగా.. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
లవ్ రెడ్డి
రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ‘లవ్ రెడ్డి’ జనవరి 3వ తేదీన ఆహా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి కృష్ణవేణి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 18న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆహా ఓటీటీలో చూడొచ్చు. ఈ చిత్రానికి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించారు.
కథా కమామిషు
కథా కమామిషు థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చింది. ఈ కామెడీ డ్రామా మూవీ జనవరి 2న స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. కరుణ కుమార్, ఇంద్రజ, కృతిక రాయ్, వెంకటేశ్ కాకుమాను, శృతి ఈ చిత్రంలో లీడ్ రోల్స్ చేశారు.
రామ్‍నగర్ బన్నీ
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన చంద్రహాస్ హీరోగా నటించిన రామ్‍నగర్ బన్నీ సినిమా ఆహాలో జనవరి 17న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు స్ట్రీమింగ్‍కు వచ్చింది.
మోక్షపటం
మోక్షపటం చిత్రం జనవరి 14వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం థియేటర్లలో విడుల కాకుండానే నేరుగా ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో తిరువీర్ ప్రధాన పాత్ర పోషించగా.. రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించారు.
హైడ్ ఎన్ సీక్
క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ ఎన్ సీక్.. జనవరి 10వ తేదీన ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రంలో విశ్వంత్ దుడ్డంపూడి, రియా సచ్‍దేవ్, శిల్పా మంజునాథ్ లీడ్ రోల్స్ చేశారు. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
కాఫీ విత్ ఏ కిల్లర్
కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రం జనవరి 31వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రంలో రవిబాబు, శ్రీనివాసరెడ్డి, శ్రీరాపాక ప్రధాన పాత్రలు చేశారు. థియేటర్లలో రిలీజైన సుమారు రెండేళ్ల తర్వాత ఈ చిత్రం ఆహా ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.
నీలి మేఘ శ్యామ
నీలి మేఘ శ్యామ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం జనవరి 9న స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు.
సంబంధిత కథనం