Best Web Hosting Provider In India 2024
Chicken Angara: మీరు చికెన్ ప్రియులా? అయితే రెస్టారెంట్ స్టైల్ చికెన్ అంగారా ఇంట్లోనే తయారు చేసుకోండి!
Chicken Angara: మీకు చికెన్ అంటే చాలా ఇష్టమా? వేరు వేరు రకాల చికెన్ రెసిపీలను తయారు చేసుకోవడం మీకు అలవాటా? అయితే ఈసారి రెస్టారెంట్ లాంటి మసాలా, స్మోకీ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోసుకోండి. ఈ రెసిపీని రోటీ లేదా అన్నం రెండింటిలోకీ బాగుంటుంది. చికెన్ అంగారా రెసిపీ తయారు చేయడం కూడా చాలా ఈజీ.
మీరు నాన్-వెజ్ ప్రియులైతే, వారానికి ఒక్కసారైనా చికెన్ తో కొత్త రెసిపీని ప్రయత్నించే వారైతే. ఇది మీ కోసమే. ఈ మసాలా చికెన్ అంగారా రెసిపీ మీకు కొత్త అనుభూతిని ఇస్తుంది. చికెన్ అంగారా అనేది స్మోకీ, మసాలా చికెన్ రెసిపీ, దీన్ని మీరు రోటీ, అన్నం, నాన్స్ తో కూడా తినవచ్చు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ అంగారా రెసిపీ రుచికరమైనది మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టపడతారు. చికెన్ అంగారా రెసిపీ ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీన్ని మీ ఇంటి పార్టీ మెనూలో కూడా చేర్చుకోవచ్చు.
చికెన్ అంగారా తయారీకి కావలసినవి
మ్యారినేట్ చేయడానికి
-1 కిలో చికెన్ ముక్కలు
-1 కప్పు పెరుగు
-½ కప్పు వేయించిన ఉల్లిపాయలు
-2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్
-½ కప్పు తురిమిన టమాటాలు
-2 టేబుల్ స్పూన్లు ఎర్ర మిరపకాయ పొడి
-1 టీస్పూన్ పసుపు
-2 టీస్పూన్లు ఉప్పు
-½ టీస్పూన్ గరం మసాలా
-1 టేబుల్ స్పూన్ కసూరి మేతి
వేయించి పొడి చేయడానికి
-1 టేబుల్ స్పూన్ ధనియాలు
-1 టీస్పూన్ మిరియాలు
-2 అంగుళాల దాల్చిన చెక్క ముక్క
-1 టీస్పూన్ జీలకర్ర
-10 ఎండు మిరపకాయలు
గ్రేవీ కోసం
-3 టేబుల్ స్పూన్లు నెయ్యి
-3 టేబుల్ స్పూన్లు నూనె
-2 తమలపాకులు
-3-4 లవంగాలు
-2 యాలకులు
దమ్ కోసం
-1 బొగ్గు ముక్క
-1 టీస్పూన్ నెయ్యి
చికెన్ అంగారా తయారీ విధానం
చికెన్ అంగారా తయారీకి ముందుగా చికెన్‌ను మ్యారినేట్ చేయాలి. దీనికోసం, ఒక గిన్నెలో పైన ఉన్న అన్ని పదార్థాలను వేసి బాగా కలపాలి. గిన్నెను మూతపెట్టి పక్కన పెట్టాలి.
తర్వాత, వేయించిన మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీనికోసం, ఒక పాన్‌లో పైన వివరించిన అన్ని పదార్థాలను వేసి మీడియం మంట మీద మాత్రమే వేయించాలి.
వేయించిన మసాలా దినుసులన్నీ చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
ఇప్పుడు, రెస్టారెంట్ స్టైల్ చికెన్ అంగారా గ్రేవీని తయారు చేయడానికి, ముందుగా మీడియం మంట మీద ఒక పెద్ద పాన్‌లో నెయ్యి, నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కిన తర్వాత, పాన్‌లో తమలపాకులు, లవంగాలు, యాలకులు వేసి 5 సెకన్ల పాటు వేయించాలి.
తర్వాత, పాన్‌లో మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్, మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
ఇప్పుడు, మంటను తక్కువ చేసి, పాన్‌ను మూతపెట్టి 40-45 నిమిషాల పాటు చికెన్ ఉడికించాలి.
చికెన్ బాగా ఉడికే వరకు అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి.
ఇప్పుడు, ఉప్పును చెక్ చేసుకోవాలి.
తర్వాత చికెన్ అంగారాలో దమ్ కోసం ఒక బొగ్గు ముక్కను తీసుకోవాలి. బొగ్గు లేదంటే దాల్చిన చెక్క కర్ర నేరుగా మంట మీద ఎర్రగా అయ్యే వరకు వేడి చేయాలి.
తర్వాత, బొగ్గు ముక్క లేదా దాల్చిన చెక్క ముక్కను పాన్ మధ్యలో ఒక చిన్న గిన్నెలో వేసి ఉంచాలి.
దాని మీద నెయ్యి వేసి, వెంటనే పాన్‌కు మూత పెట్టాలి.
5 నిమిషాల తర్వాత, పాన్ మూత తీసి, బొగ్గు ముక్క లేదా దాల్చిన చెక్క ముక్కను తీసివేసి, చికెన్ అంగారాను కొత్తిమీరతో అలంకరించాలి.
అంతే రెస్టారెంట్ స్టైలీ స్మోకీ, స్పైసీ చికెన్ అంగారా తయారైనట్టే. టేస్ట్ చేసిన వారు బెస్ట్ అనకుండా ఊరుకోరు.