Best Web Hosting Provider In India 2024
Ginger Tea: మొటిమల సమస్యను తుడిచేసే అల్లం టీ, క్లియర్ స్కీన్ కావాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనట!
Ginger Tea: మొటిమల సమస్యకు మెడిసిన్ మాత్రమే కాదు. స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయటపడగలం. మరి అదెలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి!
కౌమార దశలో చర్మంపై మొటిమలు రావడం సహజమే. కానీ, టీనేజ్ దాటిన తర్వాత కూడా మొటిమల సమస్య వేధిస్తుందంటే కచ్చితంగా ఫోకస్ పెట్టాల్సిందే. ఈ పరిష్కారం కోసం అనేక మార్గాలను ప్రయత్నిస్తుంటాం. మెడిసిన్ వాడుతుంటాం. అలా కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా మొటిమలను నివారించవచ్చట. అంతేకాకుండా క్లియర్ స్కిన్ పొందగలమట. అదెలాగో తెలుసుకుందామా!
కొన్ని శతాబ్దాలుగా అల్లం టీ ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, హార్మోన్ల సమతుల్యతలోననూ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీఆక్సిడెంట్లు పెరుగుతాయట. ఫలితంగా వాపు, బ్యాక్టీరియాలకు పరిష్కారంగా ఉంటుందట. దాంతో మొటిమలు కలిగేందుకు తోడ్పడే బ్యాక్టీరియా నశించి, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతమవుతుంది. దీని కోసం అల్లాన్ని షాట్స్ రూపంలో తీసుకోవచ్చు.
అల్లం షాట్లు అంటే ఏమిటి?
అల్లం షాట్స్, పేరు సూచించినట్లుగా, అల్లంతో తయారుచేసే షాట్లు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయని, USలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఒక పరిశోధనలో పేర్కొంది. అల్లం పానీయం విషయానికి వస్తే, చర్మ సంబంధిత వ్యాధుల చికిత్సగా దీనిని వినియోగించవచ్చట.
అల్లం షాట్లు మొటిమలు తగ్గించడానికి ఎలా సహాయం చేస్తాయి?
అల్లం షాట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా మొటిమల వాపు తీవ్రతను తగ్గిస్తాయి. మొటిమలు ఏర్పడటానికి దారితీసే అనారోగ్యాన్ని షాట్‌లతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. అల్లంలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, అలాగే చర్మపు రంగును మెరుగుపరుస్తాయి. రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల అల్లంలో ఉండే ఈ గుణాలు హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, ఈ విధంగా ప్రభావవంతంగా మొటిమలను నియంత్రించుకోవచ్చు.
అల్లం షాట్ ఎలా తయారు చేయాలి?
షాట్ చేయడం సులభం. మీరు అనుసరించగల అల్లం షాట్ రెసిపీ ఇక్కడ ఉంది:
కావలసిన పదార్థాలు:
2 అంగుళాలు, ఒలిచిన లేదా తురిమిన తాజా అల్లం రూట్:
1 టేబుల్ స్పూన్, తాజాగా పిండిన నిమ్మరసం
1 టీస్పూన్ తేనె (అవసరం అనుకుంటేనే)
2-3 టేబుల్ స్పూన్లు నీరు
1/4 టీస్పూన్ పసుపు పొడి (ఐచ్ఛికం)
ఒక చిటికెడు కారపు మిరియాలు (ఐచ్ఛికం)
తయారీ విధానం:
- అల్లం రూట్‌ను కడగడం, పై తొక్క తీసేయడం వల్ల సులభం అవుతుంది.
- బ్లెండర్ లేదా చిన్న ఫుడ్ ప్రాసెసర్‌లో, తురిమిన అల్లం, నిమ్మరసం, తేనె, నీటిని కలపండి. కావాలనుకుంటే పసుపు, మిరియాలు జోడించండి.
- మిశ్రమాన్ని బాగా కలుపుకోండి. చక్కటి మెష్ జల్లెడ లేదా చీజ్‌క్లాత్ ద్వారా శుభ్రమైన కంటైనర్‌లో వడకట్టండి, గుజ్జును నొక్కడం ద్వారా మొత్తం రసాన్ని తీయొచ్చు.
- ఒక షాట్ గ్లాసులో రసం పోయాలి. తక్షణ శక్తి కోసం వెంటనే తాగేయాలి. అలా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రభావవంతంగా కూడా పనిచేస్తుంది.
- ఎక్కువ పరిమాణంలో తయారు చేసినట్లయితే, అల్లం షాట్‌ను గాలి చొరబడని కంటైనర్‌లో రిఫ్రిజిరేటర్‌లో రెండు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించే ముందు బాగా షేక్ చేయండి.
- అల్లం షాట్స్ తాగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
- మొటిమలను తగ్గించడంలో ఈ షాట్‌లు గొప్పగా ఉపయోగపడతాయి. వీటిని తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.అల్లం షాట్
- అల్లం షాట్స్ మంచివే అయినప్పటికీ, వాటిని మితంగా తీసుకోవాలి. చిన్న మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపులో ఇబ్బందిగా అనిపించదు.
- అల్లం మీ శరీరానికి పడుతుందా లేదా అనే విషయాన్ని ముందుగా నిర్ధారించుకోండి.
అల్లం షాట్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలు
అల్లం ఎక్కువగా తీసుకోవడం అనువైనది కాదు, ఎందుకంటే దాని బలమైన స్వభావం కారణంగా గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం లేదా అతిసారం ఏర్పడవచ్చు. “యాసిడ్ రిఫ్లక్స్ లేదా పిత్తాశయం సమస్యలు ఉన్న వ్యక్తులు ముఖ్యంగా పెద్ద మోతాదులకు దూరంగా ఉండాలి” అని వైద్యులు సూచిస్తున్నారు. అదనంగా, అల్లం రక్తాన్ని పలుచగా చేయవచ్చు, కాబట్టి మీరు రక్తం సన్నబడటానికి మందులు వాడుతున్నట్లయితే లేదా శస్త్రచికిత్స షెడ్యూల్ చేయబడినట్లయితే వైద్యుడిని సంప్రదించండి.
టాపిక్