CBI Case On KLEF University : NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్

Best Web Hosting Provider In India 2024

CBI Case On KLEF University : NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్

Bandaru Satyaprasad HT Telugu Feb 01, 2025 10:37 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu
Feb 01, 2025 10:37 PM IST

CBI Case On KLEF University : గుంటూరు జిల్లా కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. NAAC అక్రెడిటేషన్ కోసం లంచాలు ఇచ్చారని యూనివర్సిటీ అధికారులపై ఆరోపణలు వచ్చాయి. యూనివర్సిటీ యూనివర్సిటీ వీసీ, వైస్ ప్రెసిడెంట్ సహా 10 మందిని సీబీఐ అరెస్టు చేసింది.

NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్
NAAC రేటింగ్ కోసం లంచాలు, కేఎల్ యూనివర్సిటీపై సీబీఐ కేసు- 10 మంది అరెస్ట్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

CBI Case On KLEF University : NAAC A++ రేటింగ్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలపై గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 10 మందిని అరెస్టు చేసింది.

yearly horoscope entry point

తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు గుంటూరు జిల్లా వడ్డేశ్వరం కేంద్రంగా పనిచేస్తున్న కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ అధికారులు NAAC టీమ్ సభ్యులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ…కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీలో సోదాలు నిర్వహించింది. ఈ కేసుకు సంబంధించి 10 మందిని అరెస్టు చేసింది. ఈ విద్యాసంస్థ నిర్వాహకులు… NAAC టీమ్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో సీబీఐ చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సోదాలు చేపట్టింది. సుమారు రూ. 37 లక్షల నగదు, 6 లెనోవా ల్యాప్‌టాప్‌లు, ఒక ఐఫోన్ 16 ప్రో మొబైల్ ఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు తెలిపారు.

Whats_app_banner

టాపిక్

Andhra Pradesh NewsGunturCbiCrime ApAmaravatiTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024