Best Web Hosting Provider In India 2024
Telugu Web Series: తెలుగు వెబ్‌సిరీస్‌ను ఫ్రీగా చూసేయండి – హరీష్ శంకర్ ప్రొడ్యూసర్ – టైటిల్ ఇదే!
Web Series: అంకిత్ కొయ్య, తేజశ్రీరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గుడ్ ఓల్డ్ డేస్ వెబ్‌సిరీస్ శుక్రవారం యూట్యూబ్‌లో రిలీజైంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ వెబ్‌సిరీస్ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌కు శరత్ పాలంకి దర్శకత్వం వహించాడు.
Telugu Web Series: టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రజెంటర్‌గా వ్యవహరించిన తెలుగు వెబ్‌సిరీస్ గుడ్ ఓల్డ్ డేస్ శనివారం యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్స్క్రిప్షన్, రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా యూట్యూబ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. గుడ్ ఓల్డ్ డేస్ వెబ్‌సిరీస్‌లో తేజశ్రీ రెడ్డి, భార్గవ్ కొమ్మెర, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలు పోషించారు.
ఐదు ఎపిసోడ్స్…
ఈ వెబ్‌సిరీస్‌కు శరత్ పాలంకి దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్‌కు అతడే సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం గమనార్హం. శృతి రంజని మ్యూజిక్ అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 30 నిమిషాల వరకు ఉంది.
గుడ్ ఓల్డ్ డేస్ వెబ్ సిరీస్ కథ ఇదే…
పార్వతి అనే చిత్రకారిణి (పెయింటర్) జీవితం నేపథ్యంలో ఎమోషనల్ లవ్ డ్రామాగా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. పార్వతితో వంశీ అనే అంధుడికి ఉన్న సంబంధం ఏమిటి? పార్వతి ప్రేమించిన సంతోష్ ఎవరు? పార్వతికి వంశీ ఎందుకు దూరమయ్యాడు? సవతి సోదరులైన వంశీ, సంతోష్ లకు ఒకరిపై మరొకరికి నిజంగానే ప్రేమాభిమానాలు ఉన్నాయా? అనే అంశాలతో శరత్ పాలంకి ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు.
రెండేళ్ల తర్వాత…
సౌజన్య ప్రొడక్షన్స్ సంస్థ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. మెగా డాటర్ నిహారిక కొణిదెలకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ యూట్యూబ్ ఛానెల్లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లోనే ఈ వెబ్‌సిరీస్ రూపొందినట్లు సమాచారం. రెండేళ్ల తర్వాత యూట్యూబ్‌లోకి ఈ వెబ్‌సిరీస్‌ను తీసుకొచ్చారు.
మజిలీతో…
అంకిత్ కొయ్య హీరోగా, యాక్టర్‌గా టాలీవుడ్లో పలు సినిమాలు చేశాడు. నాగచైతన్య మజిలీ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు అంకిత్ కొయ్య. అశ్వత్థామ, శ్యామ్ సింగ రాయ్, సత్యభామ, బచ్చలమల్లితో పాటు పలు సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించాడు. జోహార్, మారుతి నగర్ సుబ్రహ్మణ్యంతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. గత ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఆయ్ మూవీలో కామెడీ ప్రధాన పాత్రలో కనిపించాడు.
వెబ్ సిరీస్‌లు…
తెలుగులో సినిమాలు మాత్రమే కాకుండా పలు వెబ్‌సిరీస్‌లలో అంకిత్ కొయ్య నటించాడు. మోడ్రన్ లవ్ హైదరాబాద్, 9 అవర్స్ వెబ్‌సిరీస్‌లలో అంకిత్ నటించాడు.