Oats Beetroot Chilla: ఓట్స్, బీట్‌రూట్ కలిపి ఇలా దోసెలు వేశారంటే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!

Best Web Hosting Provider In India 2024

Oats Beetroot Chilla: ఓట్స్, బీట్‌రూట్ కలిపి ఇలా దోసెలు వేశారంటే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!

Ramya Sri Marka HT Telugu
Feb 03, 2025 06:30 AM IST

ఆరోగ్యకరమైన ఉదయం భోజనం: పిల్లలు మరియు పెద్దలకు ఆరోగ్యకరమైనదాన్ని తినమని కోరుకుంటున్నారా? అయితే వేగంగా బీట్‌రూట్ మరియు ఓట్స్‌తో తయారుచేసిన రుచికరమైన చిలాలను తయారు చేయండి. రెసిపీని గమనించండి.

 ఓట్స్,  బీట్‌రూట్ కలిపి ఇలా దోసెలు  వేశారంటే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!
ఓట్స్, బీట్‌రూట్ కలిపి ఇలా దోసెలు వేశారంటే.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం! (shutterstock)

బీట్‌రూట్ తినడానికి పిల్లలు, చాలా మంది పెద్దలు ఇష్టపడరు. ఐరన్, విటమిన్లు వంటి ఎన్నో రకాల పొషకాలతో నిండిన బీట్‌రూట్‌ను మీ ఇంట్లో కూడా ఎవరూ తినడానికి ఇష్టపడకపోతే ఈ రెసిపీ మీ కోసమే. పిల్లలకు ఎంతో ఇష్టమైన ఓట్స్‌తో బీట్‌రూట్ కలిపి ఇలా దోసెలు తయారు చేసి వారికి ఇచ్చారంటే వావ్ అనుకుంటూ తినేస్తారు. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గానో లేక రాత్రి పూట డిన్నర్‌గానో తినడం చాలా మంచిది. సులభంగా తయారయ్యే ఆ ఆరోగ్యకరమైన రెసిపీని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటో, ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం రండి.

yearly horoscope entry point

ఓట్స్ బీట్‌రూట్ దోసలు తయారు చేయడానికి కావలసినవి:

  1. ఒక కప్పు ఇన్‌స్టంట్ ఓట్స్
  2. ఒక కప్పు సూజి(బొంబాయి రవ్వ)
  3. ఒక బీట్‌రూట్
  4. రెండు పచ్చిమిర్చి
  5. అల్లం ముక్క
  6. ఒక టీస్పూన్ జీలకర్ర
  7. నీరు
  8. రుచికి తగినంత ఉప్పు
  9. నూనె

ఓట్స్ బీట్‌రూట్ దోసలు తయారు చేయడం ఎలా?

  • ఓట్స్ బీట్‌రూట్ దోసలు తయారు చేయడానికి ముందుగా బీట్‌రూట్‌ను తొక్క తీసి శుభ్రం చేయండి.
  • తర్వాత దాన్ని మీడియ సైజు ముక్కలుగా కటే చేయండి.
  • ఇప్పుడు ఒక ప్యాన్ లో నీరు పోసి వేడి చేయండి.
  • నీరు కాస్త వేడెక్కిన తర్వాత దాంట్లో బీట్ రూట్ ముక్కలను వేసి మరిగించండి.
  • తరువాత వాటిని తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి. బీట్ రూట్ ను ముందుగా ఉడికించడం ఇష్టం లేకపోతే పచ్చిగా కూడా మిక్సీలో వేసి పేస్టులా తయారు చేయచ్చు.
  • ఇప్పుడు వేరొక పాన్‌లో ఓట్స్‌ను వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వాటిని వేయించండి.
  • ఓట్స్ చల్లారిన తర్వాత దాంట్లో రవ్వను కలిపి ఒక మిక్సీ జార్‌లో వేయండి. ఈ రెండింటినీ మెత్తటి పొడిగా తయారు చేసి పక్కకు పెట్టుకోండి.
  • ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో ఉడికించుకుని పక్కకు పెట్టుకున్న బీట్‌రూట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్రలతో పాటు కొద్దిగా నీరు పేసి మిక్సీ పట్టండి. ఈ మిశ్రమం మెత్తటి పేస్టులా మారేంత వరకూ మిక్సీ పట్టండి.
  • ఒక పెద్ద బౌల్‌ తీసుకుని దాంట్లో ఓట్స్ పొడిని వేయండి తర్వాత దీంట్లోనే బీట్‌రూట్ పేస్ట్, ఉప్పు, కాసిన్నీ నీరు వేసి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమం మరీ గట్టిగా కాకుండా, వదులుగా కాకుండా దోసెలు వేసేందుకు అనువుగా ఉండేలా చూసుకోండి.
  • పిండి అంతా బాగా కలిసిని తర్వాత ఐదు నిమిషాలు విశ్రాంతి ఇవ్వండి.
  • తరువాత ఇనుప తవాను తీసుకుని దోసెలను వేసుకోండి. మీకు నచ్చిన అల్లం చట్నీ లేదా టమాటా పచ్చడితో వేడి వేడిగా తినేయండి.

ఈ దోసెలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ పిల్లల కోసం మీ కోసం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024