Karthika Deepam February 3rd Episode: అదిరిన ట్విస్ట్.. జ్యోత్స్న కుట్ర ఫెయిల్.. ఆశ్చర్యంలో కార్తీక్, దీప

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam February 3rd Episode: అదిరిన ట్విస్ట్.. జ్యోత్స్న కుట్ర ఫెయిల్.. ఆశ్చర్యంలో కార్తీక్, దీప

Karthika Deepam 2 Today Episode February 3: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప తనకు కాల్ చేయడం తప్ప మరో మార్గం లేదని పారిజాతానికి జ్యోత్స్న చెబుతుంది. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు దొరకలేదని కార్తీక్, దీప కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఎదురవుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
Karthika Deepam February 3rd Episode: అదిరిన ట్విస్ట్.. జ్యోత్స్న కుట్ర ఫెయిల్.. ఆశ్చర్యంలో కార్తీక్, దీప
Karthika Deepam February 3rd Episode: అదిరిన ట్విస్ట్.. జ్యోత్స్న కుట్ర ఫెయిల్.. ఆశ్చర్యంలో కార్తీక్, దీప
 

కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 3) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. శౌర్య ఆపరేషన్‍కు డబ్బు ఇవ్వాలంటే.. కార్తీక్ బావను వదిలేయాలని దీపకు చెప్పినట్టు పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. దీప మంగళసూత్రానికి ఖరీదు కట్టానని చెబుతుంది. దీప నుంచి కాల్ కోసం ఎదురుచూస్తుంటుంది. బావను నాకు ఇచ్చేస్తున్నట్టు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలని దీపతో చెప్పానని పారిజాతానికి అసలు విషయం చెబుతుంది జ్యోత్స్న. దీప అగ్రిమెంట్ చించేసిందని, కార్తీక్ తనను తిట్టాడని అంటుంది. కాల్ చేసేందుకు దీపకు 24 గంటల టైమ్ ఇచ్చానని చెబుతుంది. ఇంత వరకు దీప కాల్ చేయలేదంటే నీ ఆఫర్ వద్దనే కదా అని పారిజాతం అంటుంది.

తెలిస్తే ఉతికారేస్తారే..

ఈ సమయంలో జ్యోత్స్న తప్ప వారిని ఏ దేవుడు కాపాడలేడని జ్యోత్స్న అంటుంది. “ఈ విషయం మన ఇంట్లో తెలిస్తే.. పసిదాని ప్రాణంతో చెలగాటం ఆడినందుకు నిన్ను ఉతికి ఆరేస్తారే” అని పారిజాతం అంటుంది. ప్రాణాలతో చెలగాటం ఆడడం నా పుట్టుకతోనే మొదలైందని జ్యోత్స్న పొగరుగా చెబుతుంది. ఈ నిజం బయటపడదని అనుకుంటున్నావా అని పారిజాతం అంటుంది. ఇప్పుడు ఇంకో అబద్ధం చెబుతానని, బావ నాకు దక్కే వరకు ఎన్ని ప్రాణాలకైనా ఖరీదు కడతానని జ్యోత్స్న కఠినంగా చెబుతుంది.

అలాగైతే దీప చస్తుంది

శౌర్య చనిపోతే ఎలాగే అని పారిజాతం ప్రశ్నిస్తుంది. “చావనీ. ఆ తర్వాత బెంగపెట్టుకొని దీప చస్తుంది. ఆ తర్వాత దీప నా వాడు అవుతాడు” అని కర్కషంగా మాట్లాడుతుంది జ్యోత్స్న. కార్తీక్ అంటే అంత పిచ్చి ఏంటే అని పారు అడుగుతుంది. తాను బతుకుతున్నది రెండింటి కోసమే అని.. అవి ఆస్తి, బావ అని జ్యోత్స్న చెబుతుంది. చూస్తుంటే నీకు రెండు దక్కేలా లేవని, తప్పుల మీద తప్పులు చేస్తున్నావని ఆగ్రహిస్తుంది పారిజాతం. కార్తీత్, దీప ఈ విషయం మీ అమ్మకి చెబితే అంతే అంటుంది. అయితే, ఇప్పుడు వాళ్లు చెప్పరని జ్యోత్స్న నమ్మకంగా అంటుంది. వాళ్లకు రూ.50లక్షల డబ్బు ఇప్పటికిప్పుడు ఎవరూ ఇవ్వరని, నేనే దిక్కు అనేలా చెబుతుంది.

 

భర్తనే కాదు.. ప్రాణాలైనా వదిలేస్తుంది

దీప తనకు తప్పనిసరిగా కాల్ చేసి.. కార్తీక్‍ను వదిలేయాలన్న ఆఫర్ ఒప్పుకుంటుందని జ్యోత్స్నఅంటుంది. వరదల్లో చిక్కుకున్న వారికి కాపాడేందుకు వచ్చిన దేవతలా దీపకు నేను కనిపిస్తానని అంటుంది. “కూతురు కళ్ల ముందు చచ్చిపోతుంటే ఏ తల్లి తట్టుకోలేదు గ్రానీ. భర్తనే కాదు.. అవసరం అయితే ప్రాణాలైనా వదిలేస్తుంది. ఇప్పుడు కాస్త వేచిచూడాలి అంతే” అని జ్యోత్స్న అంటుంది. ఎవరైనా సాయం చేస్తే పారు సందేహిస్తుంది. నేను ఏ దేవత రాదు అని పొగరుగా జ్యోత్స్న పొగరుగా ఉంటుంది.

డబ్బు ఉన్న సూట్‍కేస్‍తో.. సూపర్ ట్విస్ట్

ఇంతలో డబ్బు ఉన్న సూట్‍కేస్‍తో ఓ మహిళల ఆసుపత్రికి వస్తుంది. శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు కట్టేందుకు సిద్ధమవుతుంది. ఆమే కార్తీక్ తండ్రి శ్రీధర్ రెండో భార్య కావేరి. డబ్బు ఉన్న సూట్‍కేస్‍తో ఆసుపత్రిలో అడుగుపెడుతుంది. సూట్‍కేస్ పట్టుకున్నప్పుడు ఆమె ముఖం చూపించకపోయినా డబ్బుతో వచ్చింది ఆమెనే అని అర్థమవుతుంది. దీంతో అదిరే ట్విస్ట్ వచ్చేసింది. దీపను కూడా కలుస్తుంది కావేరి.

బోరున ఏడ్చేసిన దీప, కార్తీక్

శౌర్య ఆపరేషన్ కోసం డబ్బు కట్టేందుకు మన వద్ద 60 నిమిషాలే మిగిలి ఉన్నాయని దీప ఏడేస్తుంది. కార్తీక్ కూడా కన్నీరు పెట్టుకుంటాడు. ట్రీట్‍మెంట్ ఆగిపోతుందని దీప ఎమోషనల్ అవుతుంది. నా బిడ్డను కాపాడండి కార్తీక్ బాబు అంటూ దండం పెడుతుంది. తనకు ఇది మరణశిక్షలా ఉందని, గడుస్తున్న ఒక్కో క్షణం ఉరికంబంపై వేలాడుతున్నట్టు ఉందని చెబుతాడు. తాను ఆశతోనే ప్రయత్నాలు చేస్తున్నానంటాడు. మన ప్రాణం పోతుందని తెలిసినా ఇంత బాధపడబోమని, ఇది నరకంలా ఉందని చెబుతాడు. శౌర్యను మీరు కాపాడతారనే నమ్మకంతో ఉన్నానని దీప అంటే.. నన్ను క్షమించు దీప అని కార్తీక్ బాధపడతాడు. నా మీద నాకు నమ్మకం లేదని కార్తీక్.. అంటే ఏడుస్తూ కూర్చుండిపోతుంది దీప.

 

నువ్వు నాకు కోడలు.. శౌర్య మనవరాలు

శౌర్య పరిస్థితి తెలిసి వచ్చాను దీప అని కావేరి అంటుంది. బాధలు, కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇచ్చేవే నిజయమైన బంధాలు అని చెబుతుంది. “నాకు బంధాల విలువ తెలియదు దీప. నిన్ను, కార్తీక్‍ను చూసి తెలుసుకున్నాను” అని అంటుంది. సొంత కూతురు స్వప్నను మేం వదిలేసినా సొంత మనిషిలా చూసుకున్నావని, పెళ్లి చేసి ప్రాణాలు నిలబెట్టావని దీపతో కావేరి అంటుంది. స్వప్నకు కార్తీక్ చెల్లి అనుకున్నాడని.. అందుకే నీకు కూతురు శౌర్య తనకు మనవరాలి లాంటిదని కావేరి చెబుతుంది. “కార్తీక్ నా భర్త కొడుకు.. అంటే నా కొడుకు. అందుకే నువ్వు నా కొడలివి. శౌర్యకు నాకు మనవరాలు అవుతుంది కదా. అక్రమ సంబంధాలు ఉంటాయి కానీ.. అక్రమ సంతానం ఉండదని ఒకసారి అక్క చెప్పింది. కానీ నీ మససులో అలాంటి ఆలోచన ఉందా” అని దీపను కావేరి అడుగుతుంది.

మీది అక్రమ బంధం కాదు

కాంచనను ఎలా పెళ్లి చేసుకున్నారో మిమల్ని కూడా అగ్నిసాక్షిగా శ్రీధర్ వివాహమాడారని కావేరితో దీప అంటుంది. మోసం చేసింది శ్రీధర్ అని, మోసపోతుందని మీ ఇద్దరూ అని దీప అంటుంది. మీది అక్రమ బంధం కాదు.. అక్రమ సంతానం కాదు అని చెబుతుంది. అంటే నువ్వు నన్ను మా అక్కను చూస్తున్నట్టే.. చూస్తున్నావా అని కావేరి అడిగితే.. అవునండి అని బదులిస్తుంది దీప. దీంతో కావేరి సంతోషిస్తుంది. శౌర్యకు అంటే.. నా మనవరాలికి ఏం కాదు దీప అని చెబుతుంది. కార్తీక్ వల్ల ఎంతో మంది సాయం పొందారని, నీ కూతురికి ఏం కాదని ధైర్యం చెబుతుంది. నేను వచ్చినట్టు కార్తీక్‍కు చెప్పొద్దని కావేరి అంటుంది. తమకు ఇంకా ఆశ చావలేదని, కానీ ఆ ఆశను బతికించేందుకు ఏ దైవం దిగొస్తుందని దీప అనుకుంటుంది.

 

మాటలతో చంపొద్దు

శౌర్య ఆపరేషన్‍కు డబ్బు దొరకపోవటంతో కార్తీక్ దిగాలుగా కూర్చొని ఉంటాడు. ఆపరేషన్ టైమ్ అయిపోయిందని, మనం అక్కడికి వెళ్లకపోతే డబ్బు కట్టేలేక పాపను వదిలేశారని అంటారని దీప ఏడుస్తూ అంటుంది. శౌర్యకు అసలు విషయం తెలియాల్సిన అవసరం లేదని, వాళ్లు పొమ్మనేలోపు శౌర్యను తీసుకొని వెళదామని చెబుతుంది. మనం చేసిన ప్రయత్నాలన్నీ అయిపోయాయనని, కాపాడాల్సింది దేవుడే కార్తీక్ బాబు అని దీప ఏడుస్తూ ఉంటుంది. దేవుడినే వేడుకుందామని చెబుతుంది. నా వల్ల కావడం లేదు దీప. నేను దాని ముఖం చూడలేను అని కార్తీక్ కన్నీరు పెట్టుకుంటాడు. ముందుడి నడిపించాల్సింది మీరే అని దీప అంటుంది. మళ్లీ ఆపరేషన్‍కు రావాల్సిన అవసరం లేదని శౌర్యకు చెప్పండని కార్తీక్‍తో బాధగా దీప అంటుంది. శౌర్య ముందు మీరు ఏడ్వడానికి వీలు లేదని, మీ కంట్లో కన్నీరు శౌర్య చూడకూడదని దీప చెబుతుంది. పరిస్థితులు పగబట్టి చంపింది చాలు దీప.. నీ మాటలతో కూడా చంపొద్దని కార్తీక్ కన్నీటితో అంటాడు. బాధ అయినా బరువైనా మోయాల్సిందేనని అంటాడు.

ఆపరేషన్ స్టార్ట్.. ఆశ్యర్యంలో కార్తీక్, దీప

శౌర్యను కోసం గదిలోకి కార్తీక్, దీప వెళతారు. అయితే, అక్కడ శౌర్య కనిపించకపోవటంతో ఏమైందని ఇద్దరూ కంగారు పడతారు. డబ్బు కట్టలేదని బయటికి పంపేశారేమో అని దీప టెన్షన్ పడుతుంది. ఇంతలో నర్స్ వచ్చి శౌర్యకు సంబంధించిన వస్తువులను దీపకు ఇస్తుంది. ఏంటి అన్నట్టుగా సందేహంగా చూస్తారు దీప, కార్తీక్. ఆపరేషన్ చేసేటప్పుడు ఇలాంటి వస్తువులు ఉండకూడదని నర్స్ చెబుతుంది. దీంతో దీప, కార్తీక్ ఆశ్చర్చపోతారు. డబ్బులు అని కార్తీక్ అంటే.. కట్టేశారు కదా అని నర్స్ చెబుతుంది. దీంతో డబ్బులు కట్టేశారా ఎవరు అని కార్తీక్ సందేహంగా అంటాడు.

 

జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. కార్తీక్ గ్రేట్ అన్న డాక్టర్

శౌర్య ఆపరేషన్ కోసం దీపకు డబ్బు ఇచ్చి కార్తీక్‍ను దక్కించుకోవాలనుకున్న జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. శౌర్యకు ఆపరేషన్ మొదలైపోయింది. కావేరినే డబ్బు కట్టి ఉంటుంది. అయితే, ఈ ఎపిసోడ్‍లో ముఖం చూపించలేదు. ఈ విషయం కార్తీక్, దీపకు కూడా తెలియదు. దీపను కలిసినా అసలు విషయం చెప్పదు కావేరి.

డబ్బులు ఎవరు కట్టారని కార్తీక్ కన్‍ఫ్యూజ్ అవుతుండగా.. ఇంతలో డాక్టర్ వస్తాడు. “కార్తీక్ నువ్వు గ్రేట్ మ్యాన్. నువ్వు ఎక్కడ డబ్బు కట్టేలేవోనని, పాపకు ఆపరేషన్ ఎక్కడ ఆగిపోతుందోనని కంగారు పడ్డాను. కానీ నువ్వు మాట నిలబెట్టుకున్నావు. చివరి నిమిషంలో డబ్బు మొత్తం కట్టేశావ్” అని డాక్టర్ అంటాడు. ఏం మాట్లాతున్నారు డాక్టర్ అని కార్తీక్ ఆశ్చర్యంగా అంటాడు. ఆపరేషన్‍కు టైమ్ అవుతుందని, తాను వెళ్లానని డాక్టర్ చెబుతాడు. శౌర్యకు ఏం కాదని, నమ్మతంతో ఉండాలని అంటాడు. డబ్బులు కట్టడం ఏంటి కార్తీక్ బాబు అని దీప అంటుంది. తనకు ఏమీ తెలియదని, రిసెప్షన్‍లో అడిగితే తెలుస్తుందని కార్తీక్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఫిబ్రవరి 3) ఎపిసోడ్ ముగిసింది.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024