Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2025/02/Brahmamudi_Serial_February_3rd_Episode_1738548076139_1738548076423.jpg)
Brahmamudi February 3rd Episode: రాజ్ చేతికి బ్లాక్ మనీ- రెడ్ హ్యాండెడ్‌గా పట్టించేందుకు రుద్రాణి ప్లాన్- అపర్ణ ఆగ్రహం
Brahmamudi Serial February 3rd Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో వేలంలో నెక్లెస్ కొనుక్కున క్లైంట్ శిరీష్ రూ. కోటి 80 లక్షలను క్యాష్ రూపంలో తీసుకొస్తాడు. ఇలా బ్లాక్‌లో తీసుకోనని వైట్ రూపంలోనే కావాలని రాజ్ అంటాడు. కానీ, అది తన భార్యకు తెలియకూడదని చెబుతాడు. దాంతో రాజ్ డబ్బు తీసుకుంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఆస్తులు తాకట్టు పెట్టి రాజ్, కావ్య అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని రుద్రాణి చెబుతుంది. నాకు అన్యాయం జరుగుతుందని రుద్రాణి చెబుతుంది. తను రెచ్చగొడితే రెచ్చిపోవట్లేదు. నాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది.
సాయంత్రం వచ్చాక అడుగుదాం
బ్రతికించావ్ తల్లి కనీసం ఇప్పటికైనా నా మాటలు నమ్మావ్ అని రుద్రాణి అనుకుంటుంది. చిన్న పిల్లల చేయకు. ఒక కొడుకు తల్లివి అని అపర్ణ అంటుంది. ఆ కొడుకు కోసమే నా తాపత్రయం. అందరి ముందు మాట్లాడి చెడ్డదాన్ని అవుతున్నాను అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇప్పుడు ఏంటీ, రాజ్ కావ్య ఆస్తులు తాకట్టు పెట్టి అమెరికా వెళ్తున్నారని అంటారు. సాయంత్రం వచ్చాకా వాళ్లనే అడుగుదాం. అప్పటివరకు ఓపిక పట్టు అని ఇందిరాదేవి అంటుంది.
ఓపిక పట్టి వయసు అయిపోతుంది కానీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రావట్లేదు అని గొణుక్కుంటుంది ధాన్యలక్ష్మీ. సాయంత్రం వరకు ఓపిక పట్టామన్నారు కదా. ఎందుకు గొణుక్కుంటావ్ అని ప్రకాశం అంటాడు. ఒకవేళ రుద్రాణి చెప్పింది నిజం అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు ఆఫీస్‌లో డిజైన్స్ ఫైనల్ ఫ్రూఫ్ రీడింగ్ చేయాలని కావ్య అంటుంది. ఇంతలో రాజ్‌కు వేలం పాటలో నెక్లెస్ కొనుకున్న శిరీష్ వచ్చారని కాల్ వస్తుంది.
తర్వాత శిరీష్ వస్తాడు. మీ నెక్లెస్ వేలంలో కొన్నానుగా. కోటి 80 లక్షలు క్యాష్ రూపంలో ఇస్తున్నాను అని శిరీష్ అంటాడు. అంత అమౌంట్ క్యాష్‌లో ఇస్తున్నారా అని కావ్య ఆశ్చర్యపడుతుంది. దానికి షాక్ అయిన రాజ్ నేను ఇలా బ్లాక్‌లో తీసుకోలేను. నా దగ్గర ప్రతి పైసా వైట్‌లోనే ఉండాలి. ట్రాన్స్‌ఫర్ చేయండి. మా కంపెనీ అకౌంట్‌లో ఏదైనా చాలా క్లియర్‌గా చూపిస్తాం అని రాజ్ అంటాడు. ఇంత చిన్న అమౌంట్ కోసం కూడా ఇంతలా ఆలోచిస్తారేంటండి. క్లైంట్స్ ఇబ్బంది కూడా మీరు అర్థం చేసుకోవాలి అని శిరీష్ అంటాడు.
చాలా పర్సనల్
మనం ఇప్పటివరకు ఎన్నో ట్రాన్స్‌ఫర్స్ చేశాం. మీకు ఎంతోమందిని క్లైంట్స్‌ను ఇచ్చాను. ఈ ట్రాన్సాక్షన్ మా వైఫ్‌కు తెలియకూడదు. ఇది చాలా పర్సనల్ అని శిరీష్ అంటాడు. పెళ్లాన్ని ఇంట్లో పెట్టుకుని పర్సనల్ కావాల్సి వచ్చిందంట అని కావ్య మనసులో తిట్టుకుంటుంది. కావ్య కోపంగా చూడటం గమనించిన రాజ్ కూల్ అని సైగ చేస్తుంది. ఇట్స్ ఓకే నేను చూసుకుంటాను అని రాజ్ అంటాడు. కౌంట్ చేసుకుంటారా అని అడిగితే.. నేను మనీ కంటే మనుషులను నమ్ముతాను అని రాజ్ అంటాడు.
తర్వాత మగబుద్ధి చూపిస్తారుగా అని కావ్య అంటే.. నేను శ్రీరామ చంద్రుడిని అని రాజ్ అంటాడు. ఇద్దరు వాదించుకుంటారు. టార్చర్ పెడుతున్నావ్ అని రాజ్ అంటాడు. హాలీడే రోజు ఇంత అమౌంట్ బ్యాంక్‌లో ఎలా డిపాజిట్ చేయాలి. ఇవాళ ఇంటికి తీసుకెళ్దాం. రేపు వెళ్లి బ్యాంక్‌లో డిపాజిట్ చేద్దాం అని రాజ్ అంటాడు. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఎదురుచూస్తుంటారు. ఇంకా రాలేదేంటీ. ఇంకా ఏదైనా ప్లాన్ వేశారా. ఆస్తులన్నీ తాకట్టుపెట్టారు కదా. ఇక ఇంటితో పనేంటీ అనుకుంటే రుద్రాణి అంటుంది.
ఇవాళే కదా వీసాకు అప్లై ఇచ్చారు. అప్పుడే ఎలా వెళ్లిపోతారు అని ధాన్యలక్ష్మీ అంటే.. కావ్య మాములుది కాదు అని రుద్రాణి అంటుంది. ఇంతలో స్వప్న వచ్చి ఏంటీ గుమ్మం ముందే గుంట నక్కల్లా చూస్తున్నారు అని అంటుంది. చిన్నాపెద్ద మర్యాదా లేదా అని ధాన్యలక్ష్మీ అంటుంది. మిమ్మల్ని అంటానా. పీక్కుతునే మా అత్తను అంటున్నా అని స్వప్న అంటుంది. తర్వాత రుద్రాణిపై కౌంటర్స్ వేస్తుంది. ఇందాకే కావ్యకు కాల్ చేస్తే ఆఫీస్‌లో వర్క్ ఉందని లేట్ అవుతుందని చెప్పింది అని వెళ్లిపోతుంది స్వప్న.
కేసు పెట్టిన పెడతావ్
మరోవైపు సంతోషంగా అప్పుకు కల్యాణ్ కాల్ చేస్తే చేయదు. తర్వాత లిఫ్ట్ చేస్తుంది. హాయ్ కూచి అంటే షటప్. ఫోన్ లిఫ్ట్ చేయవేంటీ అని అరుస్తాడు. ఇప్పుడు కుర్చీమడతపెట్టి కొడతావా ఏంటీ అని అప్పు అంటుంది. కొడితే నువ్ ఊరుకుంటావా. కాబోయే పోలీస్‌ను కొట్టిన మొగుడు అని పోలీస్ట్ స్టేషన్‌లో కేసు పెడతావ్ అని కల్యాణ్ అంటాడు. అలా ఎందుకు చేస్తాను. ఇప్పుడు ఏమైంది నాన్న. ఎందుకంత కోపం అని అప్పు అడుగుతుంది.
సంతోషమైన విషయం షేర్ చేసుకుందామని. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అవనీ సురేష్ గారు ఉన్నారు కదా. ఈరోజు నేను రాసిన పాటను మా గురువు గారు ఆయన రాసిన పాటగా ఇచ్చారు. కానీ, మ్యూజిక్ డైరక్టర్ గారు మాత్రం నేను రాసినట్లు గుర్తు పట్టారు. లైఫ్‌లో నేను చాలా గొప్పవాడిని అవుతావని చెప్పారు. థ్యాంక్యూ పొట్టి. నిన్ను పెళ్లి చేసుకుని నేను ఇలా బయటకొచ్చి పాట రాయకుంటే నాకు ఇలాంటి గుర్తింపు రాకపోయిండేది కదా అని కల్యాణ్ చెబుతాడు.
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. పిజ్జా డెలీవరి చేసుకుంటూ ఉండేదాన్ని ఇప్పుడు నీ వల్లే పోలీస్ అవుతున్నాను. ఇంకో మూడు నెలలు ట్రైనింగ్. ట్రైనింగ్ అయిపోయి పోలీస్ అయ్యాక ఎప్పటికి నీకు దూరం అవ్వను. నీ పక్కనే ఉంటాను అని అప్పు అంటుంది. మరోవైపు అంతా భోజనం చేస్తుంటారు. రాజ్, కావ్య వచ్చి చాలా సేపు అయింది. కడిగేద్దామని చూస్తే ఇంకా రారేంటీ అని రుద్రాణి అనుకుంటుంది. అది గమనించిన స్వప్న కౌంటర్స్ వేస్తుంది.
తిక్కలేసి మాట్లాడుతుంది
నీ వయసుకు తగిన పనులు చేస్తే ఎందుకు గౌరవం ఇవ్వరు అని ప్రకాశం అంటాడు. మీ చెల్లెలిని మాత్రం బాగానే తిడతారు. అన్నాయం జరిగితే నోరు మెదపరు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో రాజ్, కావ్య వస్తారు. రాజ్‌కు ఇంకాస్తా పెట్టమంటారా అని కావ్య అంటే.. బాగా పెట్టమ్మా. దూరంగా వెళితే అక్కడ ఇంటి ఫుడ్ ఉండకపోవచ్చు అని రుద్రాణి అంటుంది. దూరంగా వెళ్లడం ఏంటీ అత్త అని రాజ్ అంటాడు. అదేదో తిక్కలేసి మాట్లాడుతుంది లేరా. నువ్ తిను అని ఇందిరాదేవి అంటుంది.
రాజ్, నువ్ కావ్య కలిసి మన ఆస్తులతోపాటు ధాన్యలక్ష్మీ, రుద్రాణి సంపాదించిన ఆస్తులను అమ్మేసి వచ్చిన డబ్బును డాలర్స్‌గా మార్చేసి ఫారెన్‌కు పారిపోవాలనుకుంటున్నారా. చెప్పరా.. అమెరికాకు ఎందుకు పారిపోవాలని అనుకుంటున్నారు. ఎవరికి చెప్పకుండా వెళ్తే దాన్ని పారిపోవడమే అంటారు కదా. అందుకే కదా నువ్ పాస్‌పోర్ట్, వీసాలు రెడీ చేసుకుంటున్నావ్. పక్కవాళ్ల ఆస్తులు అమ్మే హక్కు నీకెవరు ఇచ్చారు అని నిలదీస్తుంది అపర్ణ.
నేను డాలర్స్‌గా మార్చడం ఏంటీ అని రాజ్ అంటే.. నటించకు. నువ్ చెప్పకపోతే మాకు తెలియదా. వెనుక నుంచి ధాన్యలక్ష్మీ, రుద్రాణిని మోసం చేస్తే కనిపెట్టలేమనుకుంటున్నామా. ఏం రుద్రాణి మీ ఆస్తినే కదా వాడు డాలర్స్‌గా మారుస్తున్నాడు అని అపర్ణ అంటుంది. అంత దెప్పి పొడవకు వదినా. ఇందాక నేను అన్నమాటలు పట్టుకుని నన్ను నిందించాలని చూస్తున్నావ్ అని రుద్రాణి అంటుంది. ఛీ ఛీ తప్పు చేసినవాళ్లను నిందిస్తాను. కొడుకు అయినా, కోడలు అయినా ఆడ పడుచు అయినా అడిగి తీరాల్సిందే అని అపర్ణ అంటుంది.
అనుమానాలే వస్తాయి
నా కొడుకు తప్పు చేశాడని అనుకుంటున్నావ్ కదా. నీ మనసులో ఉంది నేను అడుగుతున్నాను. నువ్ చెప్పు రాజ్. ఎందుకు చేస్తున్నావ్. ఎప్పటి నుంచి చేస్తున్నావ్ అని అపర్ణ గట్టిగా సైటెరికల్‌గా అడుగుతుంది. నేను చెబుతాను అత్త. ఇంట్లో చాలా అనుమానాలు వస్తున్నాయని ఇప్పుడే తెలిసింది అని కావ్య అంటుంది. సీక్రెట్‌గా డాక్యుమెంట్స్ ఇస్తే అనుమానాలే వస్తాయి అని రుద్రాణి అంటుంది. మేము ఫారెన్ పారిపోవాలనుకుంటే ఇంటికి బ్రోకర్‌ను ఎందుకు రమ్మంటాం. స్వప్నకు ఎందుకిస్తాం అని రాజ్ అంటాడు.
సీక్రెట్‌గా వెళ్లాలనుకుంటే వీసాలు వచ్చేవరకు మూడో కంటికి తెలియకుండా చూసుకుంటాం కదా అని రాజ్ అంటాడు. దాంతో రోజంతా కష్టపడి వచ్చిన మనిషికి మనసు విరిగేలా చేసి గొంతు దాటి అన్నం తినకుండా చేస్తున్నారు అని కావ్య అంటుంది. సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టి డైవర్ట్ చేయకు. మీరు అమెరికా వెళ్లాలనుకుంది నిజమా కాదా. ఇప్పుడు ఉన్నపలంగా ఎందుకు వెళ్తున్నారు అని రుద్రాణి అడుగుతుంది.
ఆఫీస్ పని మీద వెళ్తున్నాం. ఫారెన్ క్లైంట్స్‌కు మన డిజైన్స్ నచ్చాయి. అమెరికా వచ్చి డెమో ఇవ్వమన్నారు. ఆ కాంట్రాక్ట్ ఓకే అయితే రూ. 40 కోట్ల డీల్ వస్తుంది. అందుకే వెళ్తున్నాం అని రాజ్ అంటాడు. దాంతో రుద్రాణిని కోపంగా చూస్తుంది ధాన్యలక్ష్మీ. ప్రాసెస్ అంతా పూర్తి అయ్యాక అందరికి చెప్పాలనుకున్నాం. ఈలోపు మీరు అంతా కలిసి దొంగను పట్టుకునేందుకు చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేశారు అని రాజ్ అంటాడు. నువ్ చెప్పేది నిజమేనా రుద్రాణి అంటుంది.
పౌరుషం ఉంది కాబట్టే
మాకు కష్టపడటం, రూపాయి రూపాయి కూడబెట్టడం మాత్రమే తెలుసు. ఆస్తులు మీద కన్నేయడం, ఇంటిని ముక్కలు చేయడం మాకు తెలియదు అని కావ్య అంటుంది. నిజమైతే సంతోషమే, అబద్ధమైతేనే ఆలోచించాలి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆలోచిస్తూనే ఉండండి అని రాజ్ తినకుండా వెళ్లిపోతాడు. ఇలా మాట్లాడితే ఇంకేం ఆకలి వేస్తుంది అని కావ్య వెళ్లిపోతుంది. రెండు మాటలకే ఇలా అలిగి వెళ్లిపోతే ఎలా అని రుద్రాణి అంటుంది.
వాళ్లకు పౌరుషం ఉంది కాబట్టే చేయని తప్పులకు నిందలు వేస్తే చిన్నబుచ్చుకుని వెళ్లిపోతారు అని ఇందిరాదేవి కూడా వెళ్లిపోతుంది. అందరితో మాటలు పడుతూ కూడా ఎలాంటి చలనం లేకుండా బతకడం మీకు మాత్రమే అవుతుందని సుభాష్ కూడా వెళ్లిపోతాడు. దాంతో అంతా వెళ్లిపోతారు. వాళ్లు అన్నదానికి ఫీల్ అవుతున్నావా అని రాహుల్ అడుగుతాడు. ఛీ ఛీ మీ తాతయ్య నన్ను మెడపట్టి గెంటేయాలనుకున్నాడు అప్పుడే ఫీల్ కాలేదు అని రుద్రాణి అంటుంది.
వీళ్లు ఆస్తులు అమ్మి డాలర్స్‌గా మార్చారు అనుకున్నాను. కానీ, అది కూడా కాదని తేలిపోయింది. మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు. ఎక్కడ పెడుతున్నారు. ఏం చేస్తున్నారో అది తెలుసుకోవాలి అని రుద్రాణి అంటుంది. మరోవైపు క్యాష్ కౌంట్ చేస్తుంటారు రాజ్, కావ్య. డబ్బుంటేనే కదా మనిషికి విలువ అని రాజ్ అంటాడు. మీరే చూస్తున్నారు కదా. ఉన్నప్పుడు లేనప్పుడు ఎలా ఉన్నారు అని కావ్య అంటుంది. ఒక్కోసారి కన్న తల్లి కూడా అనుమానించేలా కూడా చేస్తుంది డబ్బు కదా అని రాజ్ అంటాడు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దాం
ఈరోజు మమ్మీ ఎలా అడిగిందో చూశావ్ కదా. అంటే మనల్ని అనుమానించింది కదా. అది డబ్బు వల్లే కదా అని రాజ్ అంటాడు. అది అనుమానం కాదు అని కావ్య అంటే.. మీ అత్తగారిని వెనుకేసుకొస్తున్నావా అని రాజ్ అంటాడు. మీ అమ్మను అర్థం చేసుకోలేకపోయారు అంటున్నా. ఆ నలుగురు మిమ్మల్ని తప్పుగా అనుకోకూడదు అని. వాళ్ల మాటని అలా అడిగి మీ నుంచి నిజం చెప్పించారు. వాళ్లకు మిమ్మల్ని నిలదీసే అవకాశం ఇవ్వొద్దని, తన కొడుకును నిందించడం ఇష్టంలేక అలా చేశారు అని కావ్య చెబుతుంది.
నా గురించి మామ్ ఇంతఆలోచించిందా అని రాజ్ అంటాడు. తర్వాత రాజ్, కావ్య క్యాష్ లెక్కపెట్టడం దొంగచాటుగా చూస్తాడు రాహుల్. రుద్రాణికి వెళ్లి వాళ్ల దగ్గర రెండు కోట్ల క్యాష్ ఉందని చెబుతాడు. అది వాళ్ల దగ్గర ఉంటే రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దాం అని ఓ ప్లాన్ చెబుతుంది రుద్రాణి. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్