Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu February 3rd Episode ప్రేమకు శాపంగా అన్న పగ- ధీరజ్‌ను పట్టుకుని ఏడ్చిన తండ్రి- విశ్వకు రామరాజు ధమ్కీ
Illu Illalu Pillalu Serial February 3rd Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఫిబ్రవరి 3 ఎపిసోడ్‌లో ధీరజ్‌ను భూమ్మీద లేకుండా చేస్తాను ఆవేశంతో చెబుతాడు విశ్వ. వీడి పగ ప్రేమకు శాపంగా మారేలా ఉందని సరస్వతి బాధపడుతుంది. తను పెళ్లి చేయడం వల్లే కొడుకు ప్రాణాల మీదకు వచ్చిందని వేదవతి కుమిలిపోతుంది.
Illu Illalu Pillalu Serial Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ధీరజ్‌ను ఎప్పటికైనా చంపుతాను అని విశ్వ అంటాడు. వాన్ని చంపేసి నువ్ హంతకుడు అవుతావా. జైలుకు వెళ్తావా అని భద్రావతి అంటుంది. వెళ్తాను అని గట్టిగా అంటాడు విశ్వ. నా చెల్లెలి కోసం జైలుకైనా వెళ్తాను. మహా అయితే నాలుగేళ్లు జైల్లో ఉంటాను. నా చెల్లెలు అయితే ఇంటికి వస్తుందిగా అని విశ్వ అంటాడు.
భూమ్మీద లేకుండా చేస్తాను
అరేయ్ కన్న కొడుకు విషయంలో కూడా కడుపు కోత పెట్టకురా అని రేవతి అంటుంది. పాతికేళ్లుగా వీళ్లు పడుతున్న బాధను చూస్తున్నావ్‌గా. నువ్ కూడా ఇలాగే బాధపడతావా అని విశ్వ అంటాడు. అలాగని నీ చెల్లెలి పసుపుకుంకుమలు నీ చేత్తో అని రేవతి అంటే.. అదేమైనా మనం చేసిన పెళ్లా. లేచిపోయి చేసుకున్నారు. నా దృష్టిలో అది నా పెళ్లే కాదు. అందుకే ఆ ధీరజ్ గాడిని ఈ భూమ్మీద లేకుండా చేస్తాను. నా చెల్లెలిని ఈ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను. నా నిర్ణయాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు అని ఆవేశంతో చెప్పి వెళ్పిపోతాడు.
వీడింత పగతో రగిలిపోతున్నాడు. వీడి పగ చెల్లెలి జీవితానికి ఎలాంటి శాపం అవుతుందో ఏమై. భగవంతుడా నా మనవరాలిని చల్లగా ఉండేలా చూడు స్వామి అని భయపడి కోరుకుంటుంది సరస్వతి. మరోవైపు ధీరజ్‌కు తగిలిన దెబ్బలు చూసి అమూల్య ఏడుస్తుంది. ఇదంతా ఆవిడగారిని పెళ్లి చేసుకోవడం వల్లే. మనకు పగలున్నాయని తెలిసి పెళ్లి ఎందుకు చేసుకున్నావ్. అందుకే వాళ్ల అన్నయ్య నిన్ను చంపేందుకు ప్రయత్నించాడు అని అంటుంది.
ఆ మాటలు ప్రేమ వింటుంది. ప్రేమను చూసి అమూల్య ఆగిపోతుంది. మీరిద్దరి ప్రేమించుకున్నారు, ఇద్దరు ఇష్టపడేగా పెళ్లి చేసుకున్నారు. మా అన్నయ్యేదో మాయ చేసినట్లు అంటున్నారు. మా అన్నయ్యకు ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమైనా అయితే మేము తట్టుకోగలమా. మీ అన్నయ్య నిజంగా రాక్షసుడిలాగే ఉన్నాడు. చూస్తుంటే నాకు నీ మీద కూడా డౌట్‌గానే ఉంది. నిజంగానే మా అన్నయ్యను ప్రేమించి పెళ్లి చేసుకోలేదను. ఏదో కుట్రతో పెళ్లి చేసుకున్నావా అని అమూల్య అంటుంది.
చేయని తప్పుకు
దాంతో అక్కడికి వచ్చిన నర్మద అమూల్య అలా మాట్లాడటం తప్పు అంటుంది. కరెక్ట్. వీళ్లు పాతికేళ్లుగా పగ తీర్చుకోవాలని చూస్తున్నారు. మా కుటుంబం మీద పగ తీర్చుకునేందుకే ఈవిడ పెళ్లి చేసుకుని ఉంటుంది అని రెచ్చిపోతుంది అమూల్య. తనకు అలా ఉంటే మీ అన్నయ్యను ఎందుకు కాపాడుతుంది. హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్తుంది. దానికి పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. బయటి నుంచి కూడా చేయొచ్చు. ధీరజ్‌కు అలా జరిగినందుకు ప్రేమ కూడా భాదపడుతుంది. ప్రేమ చాలా మంచిది. చేయని తప్పుకు ఇంకెప్పుడు అలా బాధపెట్టకు అని నర్మద చెబుతుంది.
ధీరజ్ వెళ్లిపోతాడు. అమూల్య మాటలు పట్టించుకోవద్దు. త్వరలోనే మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి. కుదిరితో మీ అన్నయ్య తరఫున ధీరజ్‌కు సారీ చెప్పు. మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుంటా నువ్ చూసుకుంటానని నువ్ మాటివ్వు అని నర్మద చెప్పి వెళ్లిపోతుంది. దాంతో ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. అమూల్య కోప్పడిన అర్థం ఉంది. అన్నయ్య ధీరజ్‌ను చంపడానికి నేనే కారణం అని మనసులో అనుకుంటుంది.
దెబ్బలు మరి నొప్పి ఎక్కువగా ఉన్నాయా అని ప్రేమ అంటే.. ధీరజ్ సెటైర్లు వేస్తాడు. దెబ్బలకు మందేమైనా రాయాలా అని ప్రేమ అంటుంది. దాంతో ధీరజ్ షాక్ అవుతాడు. శాడిస్ట్ చింతామని జోక్ చేయట్లేదుగా. నువ్ ఒక శాడిస్ట్‌వి అని ధీరజ్ అంటాడు. ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. నువ్ నన్ను కాపాడింది మీ అన్నయ్య ప్రేమతో. నాకేమైనా అయితే మీ అన్నయ్య జైలుకు వెళ్తాడు. అది తప్పక ఆపేశావ్. లేకపోతే నా పీక పట్టుకుని నువ్వే పిసికే రకం అని ధీరజ్ అంటాడు.
దిండుతో కొట్టిన ప్రేమ
ఏరా. నువ్వింతేనా. ఎదుటి వాళ్లను అర్థం చేసుకోవా. నిజంగా నేను బాధపడి వస్తే ఇలా అంటావా అని ప్రేమ అంటుంది. మళ్లీ ధీరజ్ సెటైర్లు వేస్తాడు. నీకు అన్ని తెలిసి సారీ చెప్పాలని అంటున్నావ్ చూడు దీన్నే పుండు మీద కారం చల్లడం అంటారు అని ధీరజ్ అంటాడు. నువ్ జన్మలో మారవురా. నీకు సారీ చెప్పడానికి వచ్చిన నాకు బుద్ధి లేదు. అనవసరంగా నిన్ను కాపాడాను అని ప్రేమ అంటుంది. మళ్లీ తన మాటలతో ధీరజ్ విసిగించేసరికి దిండుతో కొడుతుంది ప్రేమ.
దాంతో నొప్పితో విలవిల్లాడుతాడు ధీరజ్. నువ్ నిజంగా శాడిస్ట్‌వే అని వెళ్లిపోతాడు ధీరజ్. బయట కూర్చున్న ధీరజ్‌ను చూసి వేదవతి వస్తుంది. కొడుకుని చూసి కుమిలిపోతుంది. మళ్లీ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. నిన్ను ఇలా చూస్తుంటే ఈ అమ్మ ప్రాణం పోతుందిరా. నీకేమైనా అయితే ఏంటీ అని భయంతో గుండె పట్టేస్తుందిరా అని ఏడుస్తుంది వేదవతి. దాంతో ధీరజ్ ఓదార్చుతాడు. ఈ అమ్మ మీద నీకు చాలా కోపం ఉంది కదూ. నీకు ఈ పరిస్థితి రాడానికి నేనే కారణం కదా అని వేదవతి అంటుంది.
అప్పుడు నా మేనకోడలు ప్రాణాలు, నా అన్నయ్య ప్రాణాలు కాపాడటానికి ప్రేమ మెడలో తాళి కట్టించాను. అందుకేగా విశ్వగాడు పగ పెంచుకున్నాడు. నాలుగు ప్రాణాలు నిలబడాతాయనుకున్నాను. కానీ, నా కొడుకు ప్రాణాల మీదకు వస్తుందని ఊహించలేకపోయాను అని వేదవతి ఏడుస్తుంది. అలా జరగాలని రాసిపెట్టి ఉంది. దానికి నువ్వెలా బాధ్యురాలు అవుతావ్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నాన్నా నాతో మాట్లాడట్లేదు చూడు అది భరించలేనంత బాధగా ఉంది అని ధీరజ్ బాధపడుతాడు.
ఇదంతా నావల్లేరా
కనీసం నా మొహంవైపు కూడా చూడట్లేదు. నాన్న అలా చేయడం తట్టుకోలేకపోతున్నాను. ఏదో కోపం ఉందని అనుకున్నాను. కానీ, నా మొహం కూడా చూడనంతా అసహ్యం కూడా ఉందని ఈరోజే అర్థమవుతుంది. నాన్న నా మీద ఎప్పటికీ ప్రేమ చూపిస్తారో. అప్పటివరకు ఈ బాధను ఎలా భరించగలను అని ధీరజ్ అంటాడు. ఇదంతా నావల్లేరా. నేనే నీకు మీ నాన్నను దూరం చేశాను. ఆరోజు నేను తీసుకున్న నిర్ణయం ఇలాంటి పరిస్థితి తీసుకొస్తుందని అనుకోలేదని. ఇదంతా నా వల్లే అని ఏడుస్తుంది వేదవతి.
అలా కాదని, ఏదో ఒక రోజు నాన్న తనతో మాట్లాడుతాడని ధీరజ్ ఓదార్చుతాడు. తర్వాత రాత్రి ఇక నుంచి చిన్నోడిని కనిపెట్టుకుంటూ ఉండాలి అని సాగర్‌తో చందు అంటాడు. అవును, మళ్లీ ఏదో ఒకరోజు వాడు అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ముందు వాడి సంగతి చూద్దాం అన్నయ్య అని సాగర్ అంటాడు. అల్లుళ్లు మీ ప్రేమ చూస్తుంటే ముచ్చట వేస్తుంది. కానీ, విశ్వ గాడు కూడా మన కుటుంబమే. వాడు చెల్లెలి మీద ప్రేమతో చేశాడు. దీని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వదిలేయండి అని మామ అంటాడు.
ఇంతలో ధీరజ్ వస్తాడు. మీతో మాట్లాడాలనిపించిందని చెబుతాడు. ఇంతకుముందులాగే మీతో కబుర్లు చెప్పుకుంటూ మీతోనే పడుకుంటాను అని ధీరజ్ అంటాడు. తర్వాత అంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. తర్వాత అంతా పడుకుంటారు. దొంగచాటుగా వచ్చిన రామరాజు ధీరజ్‌ను పట్టుకుని కుమిలిపోతాడు.
విశ్వను కొట్టిన రామరాజు
రామరాజు కన్నీటి చుక్కలు ధీరజ్ చేయిపై పడతాయి. దాంతో ధీరజ్ మేల్కోంటాడు. కానీ, అదివరకే రామరాజు వెళ్లిపోతాడు. లేచి తన చేయిపై ఉన్న కన్నీటి చుక్క చూసి నాన్నే వచ్చాడనుకుని సంతోషిస్తాడు. సాగర్‌ను లేపి నాన్న.. నాన్న వచ్చాడు. నన్ను చూసి బాధపడ్డాడు. కంటతడి పెట్టాడు అని చూపిస్తాడు. మరుసటి రోజు విశ్వ తన గ్యాంగ్‌తో ఉంటే.. రామరాజు వెళ్లి కొడతాడు. పీక మీద చేయి వేసి వెనక్కి తిప్పుకుంటాడు. దాంతో విశ్వ ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్