Acne Remedy: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది, ముఖంపై ఉన్న మొటిమలను ఈ ఇంటి చిట్కాతో పొగొట్టుకోండి

Best Web Hosting Provider In India 2024

Acne Remedy: వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది, ముఖంపై ఉన్న మొటిమలను ఈ ఇంటి చిట్కాతో పొగొట్టుకోండి

Haritha Chappa HT Telugu
Feb 03, 2025 09:30 AM IST

Acne Remedy: ముఖంపై మొటిమల సమస్య ఎక్కువ మందినే ఇబ్బందిపెడుతోంది. ఏదైనా వేడుకకు, పెళ్లిళ్లకు వెళ్దామన్నా కూడా ఈ మొటిమలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. వీటిని ఇంటి చిట్కాలతోనే వదిలించుకోవచ్చు.

మొటిమలు తగ్గించుకోవడం ఎలా?
మొటిమలు తగ్గించుకోవడం ఎలా?

యువత ఎదుర్కొంటున్న చర్మ సమస్యల్లో మొటిమల సమస్య ముఖ్యమైనది. ఎక్కడికైనా వెళ్లాలన్నా, పెళ్లిళ్లు, వేడుకలకు హాజరవ్వాలన్నీ ఈ మొటిమలు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. శరీరంలో హార్మోన్ స్థాయి దెబ్బతిన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇది కాకుండా వాతావరణం మారడం, జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. ప్రారంభంలో, ఇది ఒక చిన్నగా కనిపిస్తుంది. తరువాత పెద్ద మొటిమగా బయటపడుతుంది. వాలెంటైన్స్ వీక్ కు ముందే ఇలా జరిగితే మొటిమలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే తెలుసుకోండి. అసలే ఎంతో యువత ప్రేమికుల రోజున తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఇంటి చిట్కాలను అవలంబించడం వల్ల మొటిమలు మరక కూడా మాయమవుతుంది.

yearly horoscope entry point

బేకింగ్ సోడా

రెండు చిటికెల బేకింగ్ సోడాలో, ఒక చుక్క నిమ్మరసం, కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేయండి. తర్వాత తయారుచేసిన పేస్ట్ ను మొటిమలపై అప్లై చేయాలి. పేస్ట్ ఆరిన తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పేస్ట్ ను రాత్రిపూట మొటిమలపై అప్లై చేయడం ద్వారా కూడా నిద్రపోవచ్చు. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు దీన్ని శుభ్రంగా కడిగి కొద్ది సేపటికే శుభ్రం చేసుకోవాలి.

లవంగాలు

ఆరోగ్యానికి, చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. మొటిమలను ఎదుర్కోవడానికి, లవంగాలను గ్రైండ్ చేసి మెత్తని పొడిని తయారు చేసుకోవాలి. తర్వాత లవంగాల పొడిలో గోరువెచ్చని నీటిని కలిపి పేస్ట్ లా తయారుచేసుకుని ఆ తర్వాత ఈ పేస్ట్ ను మొటిమలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. రాత్రిపూట అలాగే వదిలేస్తే మరుసటి రోజు ఉదయానికి మొటిమలు మాయమవుతాయి.

జాజికాయ

జాజికాయ చాలా వేడి చేస్తుంది. ఇది మొటిమలో పేరుకుపోయిన చీమును తొలగిస్తుంది. దీన్ని మొటిమలపై వాడాలంటే జాజికాయ పొడి తీసుకుని అందులో కలబంద మిక్స్ చేసి మొటిమలపై అప్లై చేయాలి. కాసేపు అలానే ఉంచి తర్వాత ముఖం కడుక్కోవాలి.

మొటిమలు త్వరగానే తగ్గిపోతాయి. కానీ దాని మరక ముఖంపై ఎక్కువసేపు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మరకను ఎదుర్కోవటానికి కలబంద జెల్ ను వర్తించండి. ఇది చర్మానికి చాలా మంచిది. అనేక చర్మ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024